మర్యాద రామన్న (సినిమా)

ఆర్కా మీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన చిత్రం మర్యాద రామన్న. సునీల్, సలోని జంటగా నటించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. తన ఇంటిగడప దాటేంతవరకు అతిథి ప్రాణాన్ని తీయని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి, తన తండ్రికీ ఆ పెద్దమనిషికీ తగాదాలున్నాయని తెలుసుకుని తన ప్రాణాలను కాపాడుకోవలనే ఒక యువకుడు కథను వివరించే ఈ సినిమా సునీల్ కి హీరోగా రెండో సినిమా. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా భారీవిజయాన్ని సాధించింది.

మర్యాద రామన్న
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాణం యార్లగడ్డ శోభు,
దేవినేని ప్రసాద్
కథ ఎస్.ఎస్.రాజమౌళి,
ఎస్.ఎస్.కాంచి
తారాగణం సునీల్
సలోని
నాగినీడు
సుప్రీత్
వేణు గోపాల్
మాస్టర్ శ్రీ‌ సింహా
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం సీ. రాంప్రసాద్
నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా
భాష తెలుగు

కుటుంబ కలహాల కారణంగా రామినీడు తమ్ముడు, తన బావ రాఘవ రావు ఒకరినొకరు చంపుకుంటారు. ఇది తెలిసి రాఘవ రావు భార్య తన కొడుకు రాముతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తన తమ్ముడి చావుకు కారణమైన రాఘవ రావు కుటుంబాన్ని చంపాలని రామినీడు, తన కొడుకులు శపథం చేస్తారు. దాదాపు పతికేళ్ళ తరువాత అనాథగా బ్రతుకుతున్న రాము ఉద్యోగం పోయాక తన ఇంటికి తన ఊరిలో ఉన్న ఆస్తికి సంబంధించిన పత్రాలను పోస్టులో పొందుతాడు. ఆ ఊరిలో తన పొలాన్ని అమ్మి, ఆ డబ్బుతో ఒక ఆటో ట్రాలీ కొని తను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని సాధించాలనుకుంటాడు. స్వతహాగా అమాయకుడు, శ్రమజీవి అయిన రాము ట్రైను పట్టుకుని తన ఊరికి వెళ్తాడు. అదే ట్రైనులో తనకి అపర్ణ పరిచయమౌతుంది. తన బొమ్మల పుస్తకాన్ని వదిలేసి వెళ్ళడంతో రాము అది ఇచ్చే ప్రయత్నంలో త్రైను నుంచి సకాలంలో దిగలేకపోతాడు.

ఆ ఊరికి చేరాక మళ్ళ సూరి అనే యువకుడి సహాయంతో అక్కడున్న ఒక మసీదుకు వెళ్తాడు. ఒక కుర్రాడికి అప్పజెప్పి మళ్ళ సూరి వెళ్ళిపోతుండగా, రాము-ఆ కుర్రాడి సంభాషణ ద్వారా రాము తన తండ్రి శత్రువైన రాఘవ రావు కొడుకని తెలుసుకుని తనని చంపాలని బయలుదేరతాడు కానీ అప్పటికే రాము ఆ ప్రదేశంలో లేడని తెలుసుకుంటాడు. ఆ కుర్రాడికి తన విషయాన్ని చెప్పి తన పొలం అమ్మడంలో సహాయం చేయగలిగే వ్యక్తిని చూపించమంటాడు. అప్పుడు ఆ కుర్రాడు రామినీడుని పరిచయం చేస్తాడు. రామినీడు ఇంటికి రాము వెళ్ళి అక్కడే భోజనం చేసి ఆయనతో పాటు తన పొలానికి వెళ్ళాలనుకుంటాడు రాము. సహజంగా అతిథులకు మర్యాదలు చేయడం రామినీడు అలవాటు. తన ఇంటి గడప దాటేంతవరకూ తన శత్రువునైన చంపని రామినీడు గడప దాటాక మాత్రం తన శత్రువుని ప్రాణాలతో వదలడు. ఇంతలో అపర్ణ రామినీడు కూతురని తెలుసుకున్న రాంఉ అపర్ణకి తన పుస్తకాన్ని ఇస్తాడు. అపర్ణలోని చిత్రకారిణిపై ఎప్పుడూ వెక్కిరించే అపర్ణ కుటుంబ సభ్యులు ఆ పుస్తకం వల్ల రాము ట్రైను మిస్స్ అయ్యాడని తెలిసి కడుపుబ్బా నవ్వుకుంటారు.

మళ్ళ సూరి ద్వారా నిజం తెలుసుకున్న రామినీడు తన ఇంటి నిబంధనల వల్ల రాముని గడప దాటించి చంపాలనుకుంటాడు. పిల్లలతో దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు రాము అనుకోకుండా స్టోర్ రూములో తన తల్లిదండ్రులు ఫొటోలను చూసి ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని గ్రహించి, గడప్ దాటితే చస్తానని తెలుసుకుంటాడు. సరిగ్గ గడప దాటే సమయానికి రాము ఆ ఇంట్లోని ఉయ్యాల తాళ్ళను కోసి అది తన మీదకి వచ్చాక వెనక్కి దూకి తన నడుము విరిగిందని నమ్మించాక అపర్ణ బావ మరియూ డాక్టరైన శ్రీకాంతు తనని పైనున్న గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. చిన్నపటినుంచీ తనకు అపర్ణపై ఎలాంటి భావాలు లేవని చెప్పిన తమ కుటుంబాలు తమ పెళ్ళి చెయ్యాలనుకుంటున్న ఈ తరుణంలో శ్రీకాంతు రాము అపర్ణను ప్రేమిస్తున్నాడని భావించి వాళ్ళ ప్రేమ నిలబడాలని, తద్వారా తను తప్పించుకోవాలని శ్రీకాంతు ఏదో ఒక రకంగా రాముని ఇంట్లోనేఉంచాలనుకుంటాడు.

రామినీడు ఆ ఉయ్యాల సంఘటన గురించి తెలుసుకున్నాక చంపాలని రామినీడు, తప్పించుకోవాలని రాము తాపత్రయపడుతుంటే అపర్ణ, శ్రీకాంతులు మాత్రం రాము అపర్ణను ప్రేమిస్తున్నాడు కనకే ఇల్లు కదలటంలేదని భావిస్తారు. మరుసటిరోజు రామినీడు తమ్ముడి ఆప్తికం. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. బంధువులంతా వెల్లిపోయాక తన చావు ఖాయమని తెలుసుకున్న రాము శ్రీకాంతు తల్లిదండ్రులని అపర్ణ, శ్రీకాంతుల పెళ్ళి విషయంపై రామినీడుతో తెల్చుకోమని రెచ్చగొడతాడు. తద్వారా చుట్టాలందరూ ఇంట్లో ఉండగా అదే రోజు రాత్రి తన కూతురి పెళ్ళిని నిశ్చయిస్తాడు రామినీడు. శ్రీకాంతు ఏమాత్రం ఒప్పుకోక అపర్ణ గీసిన బొమ్మలని పిచ్చిగీతలని అంటాడు. అప్పుడే రాము అపర్ణ కుటుంబానికి ఆ బొమ్మల్లో దాగున్న అర్థాన్ని వివరిస్తాడు. అప్పుడే శ్రీకాంతు అపర్ణతో, అపర్ణ రాముతో ప్రేమలో పడగా రాము పెళ్ళి జరిగితే ఇల్లు దాటక్కరలేదని సంబరపడతాడు.

రామినీడు పెళ్ళిని గుడిలో జరిపిస్తున్నానని, ఇక తను గడప దాటక తప్పదని బెదిరిస్తాడు. అపర్ణ సలహా మేరన సారె బుట్టల్లో దూరాక ఇదంతా రామినీడు చిన్నకొడుకు బైర్రెడ్డి చూస్తాడు. తన బాబాయి హత్యకు పగ తీర్చుకుంటానని, అందరూ చూస్తుండగా నడిసీమలో అడ్డంగా నరికి చంపుతానని తన అనుచరులతో చెప్తాడు. ఇది విన్న రాము వారు లేని సమయం చూసి ఆ బుట్టలో బంతిపూలు నింపి ఖాళీ బుట్టలో దూరుతాడు. నడిసీమలో బుట్టను నరికాక బంతిపూలని చూసి వాడినిటిదగ్గరే ఉన్నాడని ఇంటివైపు పరిగెడుతాడు. అప్పుడే ఇంటిగడప దాటి పరిగెడుతున్న రాముని బైర్రెడ్డి, తన మనుషులు తరుముతుంటారు. తన పాత సైకిల్ ద్వారా వాళ్ళనుంచి తప్పించుకుతిరుగుతూ, లోయలు దాటి ఒక పాత వంతెన వద్దకి అపర్ణతో కలిసి చేరుకుంటాడు రాము.

అక్కడే రాము తనని ప్రేమించలేదని, ఇదంతా తన తండ్రి నుంచి తప్పించుకోడానికే చేశాడని తెలుసుకుంటుంది అపర్ణ. అక్కడికి చేరుకున్న రామినీడు, మళ్ళ సూరి, బైర్రెడ్డి, తన మనుషులూ రాముని చంపాలనుకుంటారు. అప్పుడు అపర్ణ వారిని ఆపి తను రాముని ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఆ క్షణం అపర్ణ ప్రేమ దక్కించుకోవడం కోసం రాము రామినీడు, తన కొడుకుల చేతిలో దారుణంగా దెబ్బలు తింటాడు. తన వల్ల రాము చనిపోవడం ఇష్టంలేని అపర్ణ వంతెన మీదనుంచి నీటిలోకి దూకేస్తుంది. అపర్ణ కోసం రాము కూడా నీటిలోకి దూకి తనని కాపాడతాడు. తను చేసిన తప్పుని గ్రహించిన రామినీడు తన కూతురిని రాముకిచ్చి సంతోషంగా వివాహం చేసి తమ పగలని మర్చిపోవడంతో కథ సుఖాంతమౌతుంది.

నటీనటులు

మార్చు

సంగీతం

మార్చు
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "అమ్మాయి కిటికీ పక్కన"  అనంత శ్రీరామ్కారుణ్య, చైత్ర 3:37
2. "ఉద్యోగం ఊడిపోయింది"  రామజోగయ్య శాస్త్రిరంజిత్ 3:45
3. "తెలుగమ్మాయి"  అనంత శ్రీరామ్ఎం.ఎం.కీరవాణి, గీతా మాధురి 4:05
4. "రాయె రాయె"  చైతన్య ప్రసాద్రఘు కుంచె, గీతా మాధురి 4:21
5. "పరుగులు తీయ్"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:10
19:49

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, నంది పురస్కారం