ఎస్. ఎస్. రాజమౌళి
ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత[1]. ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.
ఎస్.ఎస్. రాజమౌళి | |
---|---|
![]() ముంబైలో జరిగిన బాహుబలి సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో ఎస్. ఎస్. రాజమౌళి | |
జననం | 1973,అక్టోబర్ 10![]() | 1973 అక్టోబరు 10 /
వృత్తి | సినిమా దర్శకుడు,సినిమా నిర్మాత |
వేతనం | దాదాపు చిత్రానికి 12 కోట్లు |
జీవిత భాగస్వామి | రమా రాజమౌళి. |
పిల్లలు | కార్తికేయ/మయూశ |
వెబ్ సైటు | ss-rajamouli.com ss ఈగ సినిమా |
రాజమౌళి చిత్రాలుసవరించు
పురస్కారాలుసవరించు
- పద్మశ్రీ
- జాతీయ పురస్కారాలు
- ఉత్తమ తెలుగు చిత్రం - ఈగ
- జాతీయ ఉత్తమ చిత్రం - బాహుబలి: ది బిగినింగ్
- నంది పురస్కారాలు
- ఉత్తమ దర్శకుడు - మగధీర
- ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రానువాదం రచయిత - ఈగ (నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు)[3][4][5][6]
- దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్
- ఉత్తమ తెలుగు దర్శకుడు - మగధీర
- సినీ"మా" అవార్డ్
- ఉత్తమ దర్శకుడు -మగధీర
- ఇతర అవార్డులు
- స్టార్ వరల్డ్ ఇండియా - ఉత్తమ చిత్రం - ఈగ
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-24. Retrieved 2013-06-22.
- ↑ "RRR Movie: SS Rajamouli's film is Back to the Shoot". Moviezupp (in ఇంగ్లీష్). 2020-10-06. Retrieved 2020-10-11.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.