మలబారు చింత ఒక రకమైన మొక్క. ఇది గట్టిఫెరె కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Garcinia cambogia.

మలబారు చింత
Garcinia morella - Köhler–s Medizinal-Pflanzen-063.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
G. gummi-gutta
Binomial name
Garcinia gummi-gutta
(లి.) Roxb.

మలబార్ చింతపండుని పూర్వ కాలం నుంచి మలబార్ ప్రాంతంలో అంటే కొచ్చిన్, త్రివేండ్రం, కాలికట్, కన్నూరులలో వాడుతున్నారు. ఈ ప్రాంత వాసులు చేపల కూరలో చింతపండుకు బదులుగా మలబార్ చింతపండును వాడుతారు. ఇది వాడిన చేపల కూర కాస్త వగరుగా అనిపిస్తుంది. 10 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్టు నుంచి పండిన కాయల్ని కోసి, తోలు వేరుగా చేసి, తోలును ఎండ బెట్టి సుగంధ ద్రవ్యంగా వాడతారు. ఎండ బెట్టగా వచ్చిన నల్లటి చింతపండు పోలిన పదార్థాన్ని మందుల తయారీ కూరల్లో వాడతారు. మలయాళంలో దీన్ని కోడంపులి (మలబార్ చింతపండు)గా పిలుస్తారు. వీటి కాయలు పండినపుడు పసుపురంగులో వుండి కాయల మీద గాడులు ఉంటాయి. 6 నుంచి 8 దాకా విత్తనాలుంటాయి. విత్తనాల చుట్టు అరిల్ అనే ఒక రకమైన కణజాలం వుంటుంది. దీని ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తెచ్చాక మలబార్ చింతపండు విలువ అనేక రెట్లు పెరిగింది.

వ్యాప్తిసవరించు

పశ్చిమ కనుమల్లోని అడవుల్లో, దక్షిణంగా కొంకణ్ నుంచి ట్రావెన్ కూర్ ప్రాంతం వరకు, నీలగిరి ప్రాంతంలోని షోలా అడవుల్లో ఇది పెరుగుతుంది.

ఆయుర్వేద మందులుసవరించు

మలబార్ చింతపండు నుంచి ఎన్నో ఆయుర్వేద మందులు తయారై ప్రాచుర్యం పొందాయి. దీని ప్రాముఖ్యాన్ని శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది. నేడు ఆధునిక వైద్య శాస్త్రంలో మలబార్ చింతపండును దివ్యౌషధంగా పరిగణిస్తున్నారు.

లావు తగ్గడానికిసవరించు

లావు తగ్గించడంలో మలబార్ చింతపండు ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో 30 శాతం హైడ్రాక్సీ సిట్రికామ్లం వుండటమే అందుకు కారణం. దీనివల్ల మనం తీసుకున్న ఆహార పదార్థంలో వున్న పిండి పదార్థాలు అధికంగా ఖర్చయిపోయి, కొవ్వుగా మారకుండా నిరోధించబడతాయి. ఆహారపుటలవాట్లలో మార్పుగానీ, ఆకలి నశించడంగానీ దీనివల్ల వుండదు. ఆహారం జీర్ణం కానపుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

వ్యాధి నివారణకుసవరించు

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ ను చైతన్యవంతం చేసి వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరెడ్స్ ను తగ్గిస్తుంది. మన శరీరంలోని కొవ్వు పదార్థాలను ఇది సహజ సిద్ధంగా, నాడీ మండలానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా దహించి వేస్తుంది. దీనితో తయారు చేసిన కషాయం ఇస్తే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

ఇతర ఉపయోగాలుసవరించు

పశువుల్లో నోటి వ్యాధి నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చూడండిసవరించు

చిత్రమాలికసవరించు

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.