మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు

మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు (Mallipudi Mangapati Pallam Raju) 1962 ఆగష్టు 31 న జన్మించాడు. 14వ లోక్‌సభ సభ్యుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసుపార్టీ తరపున లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేశాడు.

మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు
మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు


నియోజకవర్గము కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-08-31) 31 ఆగస్టు 1962 (వయస్సు 58)
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి మమత
సంతానము 1 కొడుకు, 1 కూతురు
నివాసము కాకినాడ
September 16, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4015

పళ్ళంరాజు తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కూడా గతంలో మూడుమార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసాడు.

శ్రీ మంగపాటి పళ్ళం రాజు గారు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం పార్లమెంటరీ నియోజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రస్తుత 15 వ లోక్ సభకు పాతినిత్యం వహిస్తున్నారు.

బాల్యముసవరించు

శ్రీ పళ్ళం రాజుగారు... డాక్టరు, ఎం.ఎస్. సంజీవి రావు, శ్రీమతి రామ రాజేశ్వరి దంపతులకు 31, ఆగస్టు 1962 న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. శ్రీ పళ్ళం రాజుగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఇ., ఎం.బి.ఎ విద్యను, అమెరికాలోని [-ఫిలడెల్పియా లోకూడ విద్యాభాసం చేశారు. వీరికి శ్రీమతి మమతతో 15 పిబ్రవరి, 1989 వ సంవత్సరంలో వివాహము జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానముసవరించు

పళ్ళం రాజుగారు 1989-91 తొమ్మిదవ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1995 నుండి 2000 వరజ్య్ ఆధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగాను, 1997 నుండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుని గాను పనిచేశారు. 2004 లో జరిగిన ఎన్నికలలో రెండవ సారి కూడా లోక్ సభ స్థానానికి ఫోటీ చేసి గెలుపొందారు. జనవరి 2006 నుండి మే 2009 వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మూడో సారి కూడా అదే నియోజిక వర్గంలో గెలుపొంది రక్షణ శాఖ మంత్రిగా వుండి 2012 అక్టోబరు 28 నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా కొనసాగుతున్నారు.

అభిరుచులుసవరించు

వీరికి, సంగీతము, ఫోటోగ్రఫి, పుట్ బాల్, ఈత, గుర్రపు స్వారి, మొదలగునవి ఇష్టమైన విషయాలు.

వరించిన గౌరవాలుసవరించు

జవహర్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం 2006 లో వీరికి Honorary Doctorate ఇచ్చి గౌరవించింది.

మూలాలుసవరించు

https://web.archive.org/web/20131004221113/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=3375

బయటి లింకులుసవరించు