రింపీ కౌర్ గిల్ (జననం 1975 డిసెంబరు 19) భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ, పంజాబీ చిత్ర పరిశ్రమలలో పని చేస్తోంది.[1] ఆమె అనురాగ్ కశ్యప్ రూపొందించి, విమర్శకుల ప్రశంసలు పొందిన హిందీ చిత్రం దేవ్.డిలో పారో పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రానికి మూలం శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన బెంగాలీ నవల దేవదాస్‌. ఈ చిత్రానికిగాను ఆమె ఉత్తమ నటిగా 2010 ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది. దేవ్‌.డితో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె పంజాబీ చిత్రాలలో తన కెరీర్‌ను ప్రారంభించింది.[2]

మహీ గిల్
2018లో అపహరన్ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో మహీ గిల్
జననం
రింపీ కౌర్ గిల్

(1975-12-19) 1975 డిసెంబరు 19 (వయసు 48)[1]
విద్యాసంస్థపంజాబ్ విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
పిల్లలు1

సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, అలాగే దాని సీక్వెల్, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్‌ చిత్రాలలో లైంగికంగా విసుగు చెందిన భార్య మాధవి దేవి పాత్రను పోషించి ఆమె మరింత గుర్తింపు పొందింది.

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె 1975 డిసెంబరు 19న చండీగఢ్‌లో పంజాబీ జాట్ సిక్కు కుటుంబంలో జన్మించింది.[3] ఆమె 1998లో చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి థియేటర్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.[4]

కెరీర్ మార్చు

పంజాబీ ఆధారంగా 2003లో వచ్చిన బాలీవుడ్ చిత్రం హవాయిన్‌తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. దీనికి ముందు ఆమె థియేటర్‌తో పాటు రెండు పంజాబీ చిత్రాలను చేసింది. దేవ్.డి చిత్రంలో పారో పాత్రలో నటించింది.[5] ఆమె రామ్ గోపాల్ వర్మ నాట్ ఎ లవ్ స్టోరీ (2011)లో చేసింది, ఇది 2008లో జరిగిన నీరాజ్ గ్రోవర్ హత్య కేసు ఆధారంగా రూపొందించబడింది.[6]

2011 సెప్టెంబరు 30న విడుదలైన సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ చిత్రంలో ఆమె జిమ్మీ షీర్‌గిల్, రణదీప్ హుడాలతో కలిసి నటించింది. ఈ చిత్రం ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కింది.[7]

ఆమె ఇర్ఫాన్ ఖాన్‌తో పాన్ సింగ్ తోమర్‌లో నటించింది. డకాయిట్‌గా మారిన ఓ క్రీడాకారుడి నిజమైన కథ ఇది. ఇందులో ఆమె టైటిల్ క్యారెక్టర్ భార్యగా నటించింది. ఆమె అపూర్వ లఖియా చిత్రం తూఫాన్‌తో తెలుగు చిత్రసీమలోనూ తన అరంగేట్రం చేసింది, ఇది హిందీ వెర్షన్ జంజీర్‌తో ఏకకాలంలో చిత్రీకరించబడింది. తిగ్మాన్షు ధూలియా చిత్రం బుల్లెట్ రాజాలో ఆమె తన మొట్టమొదటి ఐటెమ్ సాంగ్ చేసింది.[8]

మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ '1962 ది వార్ ఇన్ ది హిల్స్'లో ఆమె నటించింది. ఈ సిరీస్‌లో అభయ్ డియోల్, సుమీత్ వ్యాస్, ఆకాష్ థోసర్ తదితరులు ఉన్నారు.[9]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమెతో పాటు, తన ఎకైక కుమార్తె వెరోనికా గోవాలో నివసిస్తున్నారు.[10][11]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Wadhwa, Akash (10 December 2012). "My first marriage failed because I was immature: Mahie". The Times of India. Archived from the original on 18 September 2018. Retrieved 17 September 2018.
  2. "I don't have time to date anyone: Mahi Gill". The Indian Express. 11 September 2009. Archived from the original on 30 September 2010. Retrieved 11 May 2010.
  3. Wadhwa, Akash (10 December 2012). "My first marriage failed because I was immature: Mahie". The Times of India. Archived from the original on 18 September 2018. Retrieved 17 September 2018.
  4. "Life History Of Celebrity And Actress Mahi Gill". Archived from the original on 21 April 2014. Retrieved 6 July 2013.
  5. Menon, Neelima (3 July 2009). "Mahi Gill: A girl on the verge". The New Indian Express. Archived from the original on 31 May 2016. Retrieved 30 April 2016.
  6. "It was difficult working in 'Not A Love Story': Mahi Gill". Mid-Day. Inter-Asian News Service. 21 July 2011. Archived from the original on 6 May 2016. Retrieved 30 April 2016.
  7. "Filmfare Awards 2011 - Nominations List". The Times of India. 20 January 2012. Archived from the original on 2 June 2016. Retrieved 30 April 2016.
  8. Udasi, Harshikaa (2 March 2013). "The next item". The Hindu. Chennai, India. Archived from the original on 1 June 2013. Retrieved 6 September 2013.
  9. Keshri, Shweta (15 February 2021). "1962 The War In The Hills trailer out. Abhay Deol's Indo-China war drama looks epic". India Today (in ఇంగ్లీష్). Retrieved 25 February 2021.
  10. "Mahie Gill: I am unmarried and mother of a three-year-old girl | Hindi Movie News - Bollywood - Times of India". The Times of India. Archived from the original on 3 July 2019. Retrieved 3 July 2019.
  11. "Mahie Gill reveals she has 3-year-old daughter with live-in boyfriend". International Business Times. 3 July 2019. Archived from the original on 3 July 2019. Retrieved 3 July 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=మహీ_గిల్&oldid=3993289" నుండి వెలికితీశారు