మాయదారి కృష్ణుడు

ఆర్. త్యాగరాజన్ దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం

మాయదారి కృష్ణుడు 1980, జూలై 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవర్ ఫిల్మ్స్ పతాకంపై సి. దండయుదపాణి నిర్మాణ సారథ్యంలో ఆర్. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, సుజాత, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం కొంతమంది నటీనటుల మార్పుతో తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది.

మాయదారి కృష్ణుడు
మాయదారి కృష్ణుడు సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. త్యాగరాజన్
రచనసయ్యద్ జ్వాలాముఖి (కథ), తూయవన్ (చిత్రానువాదం)
నిర్మాతసి. దండయుదపాణి
తారాగణంరజనీకాంత్,
సుజాత,
రతి అగ్నిహోత్రి
ఛాయాగ్రహణంవి. రామమూర్తి
కూర్పుఎంజి బాలురావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
దేవర్ ఫిల్మ్స్
విడుదల తేదీ
జూలై 19, 1980
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

శ్రీధర్ ఒక ఇన్స్పెక్టర్, రజినీ ఒక దొంగ. వీరిద్దరు బాల్యంలో విడిపోయిన సోదరులు. విచిత్రమైన పరిస్థితులలో వారిద్దరు కలిసినప్పుడు, శ్రీధర్ ను రైలు నుండి తోసి, రజిని ఇన్‌స్పెక్టర్‌గా ఒక గ్రామానికి వెళతాడు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయన్నది మిగతా కథ. వీధిలో నృత్యం చేసే రతి, రజినీకి సహాయం చేస్తూ అతన్ని ప్రేమిస్తుంది.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
  • నిర్మాత: సి. దండయుదపాణి
  • కథ: సయ్యద్ జ్వాలాముఖి
  • చిత్రానువాదం: తూయవన్
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: వి. రామమూర్తి
  • కూర్పు: ఎంజి బాలురావు
  • నిర్మాణ సంస్థ: దేవర్ ఫిల్మ్స్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా, ఆత్రేయ పాటలు రాశాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చెంగావి పంచె కట్టి"  పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:18
2. "గుడివాడ గుమ్మటం"  పి. సుశీల 4:12
3. "ఒకరితో ఒకరుగా"  పి. సుశీల 4:26
4. "వచ్చాడు మా పట్టెకు"  పి. సుశీల 5:12
5. "అనగనగా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:24
22:32

మూలాలు

మార్చు
  1. "Mayadari Krishnudu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-30.

ఇతర లంకెలు

మార్చు