మార్గాని భరత్‌రామ్
మార్గాని భరత్ రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినిమా నటుడు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) పార్టీ తరపున రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వైఎస్సార్సీపీ చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు. 2017లో తెలుగులో వచ్చిన ఓయే నిన్నే చిత్రంలో కూడా నటించాడు.[2][3]
మార్గాని భరత్ రామ్[1] | |||
| |||
పదవీ కాలం 2019 ఏప్రిల్ 23 – 2024 జూన్ 3 | |||
ముందు | మురళీమోహన్ | ||
---|---|---|---|
తరువాత | దగ్గుబాటి పురంధేశ్వరి | ||
నియోజకవర్గం | రాజమండ్రి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1982 మే 12||
రాజకీయ పార్టీ | వైఎస్సార్సీపీ | ||
తల్లిదండ్రులు | మార్గాని నాగేశ్వరరావు, మార్గాని ప్రసూన | ||
జీవిత భాగస్వామి | మార్గాని మోనా | ||
సంతానం | 2 | ||
నివాసం | రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ఆంధ్రప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కుడైన, ఎంపీలలో ఒకరైన భరత్, రాజన్న రచ్చబండ కార్యక్రమం ద్వారా వేలాది కేసులను పరిష్కరిస్తున్నాడు. నియోజకవర్గంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాడు.
మార్గాని భరత్ 2024 సెప్టెంబర్ 27న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[4]
జననం, విద్య
మార్చుభరత్ 1982, మే 12న నాగేశ్వరరావు - ప్రసూన దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జన్మించాడు. భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు రాజమండ్రిలో వ్యాపారవేత్త, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త. భరత్ రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అమెరికాలో మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేశాడు.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుభరత్ 2013 డిసెంబరు 12న మోనాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సినిమారంగం
మార్చుఅమెరికాలో చదువుతున్నప్పుడు సినిమా ఆఫర్ రావడంతో ఓయే నిన్నే అనే సినిమాలో నటించాడు. కాలేజీ రోజుల్లో లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి చాలా మోడలింగ్ షోలలో కూడా పాల్గొన్నాడు.
క్రీడలు
మార్చు(స్టేట్ ప్లేయర్ గా క్రికెట్ తోపాటు బ్యాడ్మింటన్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఆటలు ఆడాడు.
రాజకీయ ప్రస్థానం
మార్చుచిన్నతనం నుండే రాజకీయాల్లో ఉన్న భరత్, యువనేతగా ఎదిగాడు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరిన భరత్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూపపై 1,21,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[6][7] 2019 జూన్ 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యాడు.[8]
ఇతర పదవులు
మార్చు- 2019 సెప్టెంబరు 13 నుండి 2020 సెప్టెంబరు 12 వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 2019 అక్టోబరు 9 నుండి పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్ సభ్యుడు
- 2020 సెప్టెంబరు 13 నుండి ట్రాన్స్పోర్ట్ పర్యాటకం, కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.
మార్చుసామాజిక సేవలో
మార్చు- స్వగ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో తన తండ్రి స్థాపించిన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న భరత్ కరోనా సమయంలో అతను వినూత్నమైన ఆలోచనలను ఆచరణ చేసి, ప్రజలకు సేవ చేశాడు.
- నియోజకవర్గ సమస్యల పరిష్కారమం కోసం రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.[9]
- యువత హరిత పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతోపాటు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గంలోని ప్రతి కళాశాల విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకోని, ఆ మొక్క కింద విద్యార్థి పేరుతో నేమ్ బోర్డును ఉంచి దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థికి అప్పగిస్తున్నాడు.[10]
- కరోనా, లాక్డౌన్ సమయంలో కరోనా రోగులకు అవసరమైన అత్యవసర సేవలను అందించడానికి 60మంది వాలంటీర్లతో సూపర్ 60 అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు.
- "జగనన్న ఆక్సిజన్ రథచక్రాలు - ఆక్సిజన్ ఆన్ వీల్స్" అనే మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి, కరోనా సమయంలో, ఆసుపత్రి రోగులతో నిండినప్పుడు కాన్సెంట్రేటర్లు, సిలిండర్లతో కూడిన రెండు ఆక్సిజన్ బస్సులను అందించాడు.
అవార్డులు
మార్చు- 2018-2019 భారత్ గౌరవ్ అవార్డు
- భారత్ యూత్ అవార్డు (కోవిడ్ సమయంలో సేవలు)
మూలాలు
మార్చు- ↑ National Portal of India. "Bharat Ram Margani | National Portal of India". Retrieved 26 April 2021.
- ↑ The New Indian Express (5 October 2017). "Bharat Margani, the new kid on the block". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
- ↑ The Times of India (9 September 2017). "Rajamahendravaram boy, Bharat Margani turns hero with Oye Ninne - Times of India". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
- ↑ Sakshi (28 September 2024). "రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
- ↑ "భరత్ మార్గాని's biography and latest film release news". telugu.filmibeat.com. Retrieved 2022-08-24.
- ↑ DNA India (24 May 2019). "Rajahmundry Lok Sabha Election Results 2019 Andhra Pradesh: YSR Congress' Margani Bharat beats TDP's Maganti Roopa". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
- ↑ Sakshi. "Rajahmundry Constituency Winner List in AP Elections 2019 | Rajahmundry Constituency Lok Sabha Election Results". www.sakshi.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Sakshi (5 June 2019). "చీఫ్ విప్‌గా మార్గాని భరత్ రామ్". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
- ↑ "ప్రజల వద్దకే రాజన్న'రచ్చబండ'కార్యక్రమంలో ఎంపీ మార్గాని పిలుపు". TV 77 Telugu (in బాస్క్యూ). Retrieved 2022-08-24.[permanent dead link]
- ↑ Reporter, Staff (2021-03-11). "Yuvatha-Haritha: students join the mission and plant saplings". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-08-24.