మిత్రుడు (సినిమా)

మిత్రుడు మహాదేవ్ దర్శకత్వం వహించిన 2009 సినిమా. వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. నందమూరి బాలకృష్ణ, ప్రియామణి ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తరువాత హిందీలో ఆజ్ కా హిందుస్తానీ పేరుతోను, భోజ్‌పురిలో ఫూల్ కౌర్ కేట్ గానూ అనువదించారు.

మిత్రుడు
(2009 తెలుగు సినిమా)
Mitrudu poster.jpg
దర్శకత్వం మహదేవ్
నిర్మాణం శివలెంక కృష్ణప్రసాద్
కథ విజయేంద్ర ప్రసాద్
చిత్రానువాదం మహదేవ్
తారాగణం నందమూరి బాలకృష్ణ, ప్రియమణి, బ్రహ్మానందం, రఘుబాబు, బాలయ్య, చంద్రమోహన్
సంగీతం మణి శర్మ
సంభాషణలు ఎం. రత్నం
ఛాయాగ్రహణం బి.బాలమురుగన్
కూర్పు కోలా భాస్కర్
నిర్మాణ సంస్థ వైష్ణవి సినిమా
విడుదల తేదీ 1 మే 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ సినిమా సమీక్షకుల ప్రశంసలు పొందలేకపోయింది.[1]

కథసవరించు

ఆదిత్య ( నందమూరి బాలకృష్ణ ) నిరాశకు గురైన ఒంటరివాడు, అతను మలేషియాలో ఉంటాడు. ఇందూ ( ప్రియమణి ) ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్త కుమార్తె. ఆమె మలేషియాలో చదువుతుంది. జ్యోతిష్కుడు ఆమె ఆదర్శ భర్త లక్షణాలు ఎలా ఉండాలో చెబుతాడు. ఆ లక్షణాలు ఆదిత్య లక్షణాలతో కలుస్తాయి. కొన్ని విఫల ప్రయత్నాల తరువాత, ఆదిత్య ఇందూ ప్రతిపాదనను అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆదిత్య ఎందుకు నిరాశకు గురయ్యాడు, ఇందూ ఆదిత్యను వెంబడించి అతనిని వివాహం చేసుకోవటానికి అసలు కారణం ఏమిటీ అనేవే మిగిలిన కథ అంతా  

తారాగణంసవరించు

పాటలుసవరించు

పాటల జాబితా
సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "తెల్లవారితే"  రాహుల్ నంబియార్, హేమచంద్ర, శ్రావన భార్గవి 4:58
2. "By Birthe"  శ్రేయా ఘోషల్ 4:00
3. "డోంట్ టచ్ మీ"  రంజిత్, కె.ఎస్.చిత్ర 4:43
4. "ఝుమ్మంది ఒళ్ళంతా"  కార్తిక్, సుజాత 3:59
5. "ప్రియమణి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సైంధవి 4:24
6. "ఆకాశం నుంచి"  విజయ్ ఏసుదాస్, కౌసల్య 4:30
మొత్తం నిడివి:
26:36

మూలాలుసవరించు

  1. Staff (2009-05-01). "మిత్రుడు ఓ బకరా(రివ్యూ)". https://telugu.filmibeat.com. Retrieved 2020-08-21. External link in |website= (help)