ప్రియదర్శి పులికొండ

నటుడు
(ప్రియదర్శి పుల్లికొండ నుండి దారిమార్పు చెందింది)

ప్రియదర్శి పులికొండ ఒక తెలుగు సినీ నటుడు.[2] 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చాడు.[3][4]

ప్రియదర్శి పులికొండ
Priyadarshi.jpg
జననం (1989-08-26) 1989 ఆగస్టు 26 (వయస్సు 32)
హైదరాబాదు
విద్యమాస్ కమ్యూనికేషన్స్ లో ఎం. ఎ
విద్యాసంస్థహైదరాబాదు విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరిచా శర్మ [1]

వ్యక్తిగత జీవితంసవరించు

ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు. ఇతనికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది.

తండ్రి ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాసేవాడు. తల్లి గృహిణి. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి. ఈమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం.[5]

సినీ జీవితంసవరించు

ఇతను 2016 లో టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు. అదే సంవత్సరంలో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో స్నేహితుడు కౌశిక్ పాత్రలో అందరి దృష్టిలో పడ్డాడు. తెలంగాణా యాసలో ఇతను పలికిన సంభాషణలు విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. మధ్యలో కొన్ని లఘు చిత్రాలలో కూడా కనిపిస్తూ వచ్చాడు. జూనియర్ ఎన్. టి. ఆర్ కథానాయకుడుగా వచ్చిన జై లవకుశ, మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన స్పైడర్ సినిమాలో కూడా నటించాడు.[6]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
2016 టెర్రర్ తీవ్రవాది
పెళ్ళి చూపులు[7] కౌషిక్
బొమ్మలరామారం రామన్న
2017 ఘాజీ నీలేష్ మిష్రా హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం
విన్నర్
అర్జున్ రెడ్డి న్యాయవాది
కేశవ
మిస్టర్ వైద్యుడు
బాబు బాగా బిసి
దర్శకుడు
టేక్ ఆఫ్ ఇరాక్‌లో ఉన్న భారతీయుడు మళయాళం
యుద్ధం శరణం
జై లవకుశ ఒబులేష్ 'ఓబ్స్'
స్పైడర్ మధు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం
ఉన్నది ఒకటే జిందగీ సతీష్
మిడిల్ క్లాస్ అబ్బాయి దర్షి
ఇది మా ప్రేమ కథ
2018 రంగుల రాట్నం
ఎగిసే తారాజువ్వలు సొమరాజు
కణం సబ్ ఇంస్పేక్టర్ అగ్ని
తొలి ప్రేమ రవి
మనసుకు నచ్చింది
నల
నేల టిక్కెట్టు లయర్ యాదగిరి
వైఫ్ ఆఫ్ రామ్ చారి(పోలీసు)
నోటా 2018 వాంగ్
F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
అ! నల భీమ
నా నువ్వే
2019 మిస్టర్ మజ్ను
రామ చక్కని సీత
2020 వరల్డ్ ఫేమస్ లవర్
గువ్వ గోరింక
బొంభాట్
2021 నాంది
2021 జాతి రత్నాలు
2021 ఇచ్చట వాహనములు నిలుపరాదు

టీవీరంగంసవరించు

సంవత్సరం సిరీస్ పాత్రపేరు ఛానల్ పేరు భాష మూలాలు
2020 మెయిల్‌ హైబత్ ఆహా తెలుగు
2021 ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ మీనా ఆహా తెలుగు

మూలాలుసవరించు

  1. Sakshi (9 June 2021). "నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే." Sakshi. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
  2. "ఆ పేరుతోనే పుస్తకం రాస్తా." eenadu.net. ఈనాడు. 11 June 2018. Archived from the original on 11 June 2018. Retrieved 11 June 2018.
  3. "Pelli Choopulu film website". Archived from the original on 2017-08-27. Retrieved 2018-02-04.
  4. Priyadarshi Pullikonda
  5. "నా జీవితంలో 'ఛీ' అనుకునే సంఘటన అది". www.eenadu.net. Retrieved 2020-09-10.
  6. EENADU (19 June 2021). "ఈ సీరియ‌స్ పాత్ర స‌వాలు విసిరింది: ప్రియ‌ద‌ర్శి - actor priyadarshi interview about his role in in the name of god web series". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  7. "Meet Priyadarshi Tollywood town's new funny man". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 22 February 2018.