ముట్టుకూరు (దుర్గి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని గ్రామం
(ముత్తుకూరు (దుర్గి) నుండి దారిమార్పు చెందింది)

ముత్తుకూరు, పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుర్గి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2315 ఇళ్లతో, 9431 జనాభాతో 13192 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4772, ఆడవారి సంఖ్య 4659. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2116 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1859. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 589820[1].ఈ గ్రామం మండల కేంద్రమయిన దుర్గికి 8 కి.మీ. దూరంలో ఉంది.

ముట్టుకూరు
—  రెవెన్యూ గ్రామం  —
ముట్టుకూరు is located in Andhra Pradesh
ముట్టుకూరు
ముట్టుకూరు
అక్షాంశరేఖాంశాలు: 16°22′35″N 79°28′54″E / 16.376393°N 79.481638°E / 16.376393; 79.481638
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి మానుపాటి పార్వతమ్మ
జనాభా (2011)
 - మొత్తం 9,431
 - పురుషుల సంఖ్య 4,772
 - స్త్రీల సంఖ్య 4,659
 - గృహాల సంఖ్య 2,315
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్ 08642.

సమీప గ్రామాలు మార్చు

కోలగట్ల 5 కి.మీ, ఆత్మకూరు 7 కి.మీ, మందడి 7 కి.మీ, దుర్గి 8 కి.మీ,

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి మాచర్లలో ఉంది. సమీప జూనియర్ కళాశాల దుర్గిలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

గ్రామస్థులు విరాళాలు సేకరించి బస్సుస్టాండు కూడలిలో 5 ఎకరాల పొలం కొని జిల్లా పరిషత్తు పాఠశాల భవన నిర్మాణానికి అప్పగించారు. రు. 30 లక్షల ప్రభుత్వ నిధులతో పాఠశాలకు స్వంతభవనం నిర్మించుకున్నారు. గత సంవత్సరం రు. 30 లక్షల ప్రభుత్వ నిధులతో మరో నాలుగు గదులు నిర్మించుకున్నారు. ఇప్పుడు 400 మంది విద్యార్థులతో పాఠశాల కళకళలాడుచున్నది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

ముత్తుకూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు,ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 5 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఐదుగురు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

ముత్తుకూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటిఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

ముత్తుకూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 9300 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 626 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 534 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 199 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 329 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 200 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 490 హెక్టార్లు
  • బంజరు భూమి: 1365 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 149 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 1855 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 149 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

ముత్తుకూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 149 హెక్టార్లు

తయారీ మార్చు

ముత్తుకూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో):

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

ప్రత్తి, మిరప, కంది

గ్రామ పంచాయతీ మార్చు

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మానుపాటి పార్వతమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

ముత్తుకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలోని వెంకటేశ్వరుని బండ వద్ద 2014 లో దేవాలయం నిర్మించారు. 2014, ఫిబ్రవరి-8 ఆదివారం నాడు, వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి తదితర దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించారు.[2]

శివాలయం మార్చు

ఈ ఆలయ ప్రాంగణంలో 2017,ఆగస్టు-12వతేదీ శనివారంనాడు, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదమంత్రాల నడుమ, భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామంలో శివాలయ నిర్మాణం చేపట్టిన, ఈ గ్రామానికి చెందిన శ్రీ జిల్లెల్లమూడి చిననాసరయ్య, శ్రీ లింగా చినరామయ్య కుటుంబసభ్యులు కలిసి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయానికి 28 ఎకరాల మాన్యం భూములున్నవి.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు

సుమారు శతసంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయాన్ని 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మాణం చేయటానికై గ్రామానికి చెందిన శ్రీ దొండపాటి పచ్చయ్య, ఆయన కుమారుడు శ్రీ చెన్నయ్య ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 2016, నవంబరు-25వతేదీ శుక్రవారంనాడు ఆలయంలోని ఆంజనేయస్వామివారి మూల విరాట్టును బయటకు తీసినారు. పునాదులలో ఏమైనా సొమ్ము ఉందేమోనని పరిశీలించారు. అప్పట్లో యంత్రం లేకుండా ఆలయం ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్నారు.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు ప్రతి సంవత్సరం, దుర్గి మండలంనుండియేగాక, జిల్లా నలుమూలలనుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చెదరు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో సుందరంగా అలంకరించెదరు. విచ్చేసిన భక్తులకు భారీగా అన్నదానం నిర్వహించెదరు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. (2015లో జరుగునది-58వ వార్షికోత్సవం).

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం మార్చు

ఈ ఆలయ 17వ వార్షికోత్సవం, 2017,జూన్-20వతేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు, అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. [10]

గ్రామంలోని ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ఐ.ఏ.ఎస్‌. అధికారి మూడావతు మల్లిఖార్జున నాయక్‌ (గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌), సుగాలీ కుటుంబానికి చెందిన మూడావతు బలరాం నాయక్‌, లలితాబాయి దంపతుల పెద్ద కుమారుడు. రెండో కుమారుడు చిన్నానాయక్‌ కోదాడలో ప్రభుత్వ డాక్టర్‌. బలరాం నాయక్‌ కోటప్పకొండ దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పదవీ విరమణ చేశారు.

గ్రామ విశేషాలు మార్చు

గ్రామంలో 33/11 కె.వి. విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుచేసుకొని లో-వోల్టేజి సమస్యను అధిగమించారు. విద్యుత్తు సౌకర్యం బాగు పడటంతో, రైతులందరూ బోరుబావులు ఏర్పాటు చేసుకొని, ప్రత్తి, మిరప లాంటి వాణిజ్య పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జించుచున్నారు. కొంత భూమిని మాగాణిగా మార్చుకొని తిండి గింజలకు కొదవ లేకుండా చేసుకున్నారు.

పురాతన ఆరోగ్య కేంద్రానికి అవసరమైన 3 ఎకరాల స్థలాన్ని ప్రజల విరాళాలతో కొనుగోలుచేసి, రు. 30 లక్షలతో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండటంతో, రు. 30 లక్షలతో, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా, నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నారు. పశువైద్యశాల, పంచాయతీలకు స్వంత భవనాలు నిర్మించుకున్నారు.

మినీ వాటర్ ట్యాంకులు, సిమెంటు రహదారులు, నిర్మాణం చేసుకున్నారు.

పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి గ్రామస్థులు 3 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వగా, దేవాదాయశాఖ మరో 11 లక్షలు మంజూరు చేసింది. రు. 30 లక్షల గ్రామస్థుల విరాళాలతో బొడ్రాయి, శివాలయంలో దేవతావిగ్రహాలు పునఃప్రతిష్ఠించుకున్నారు. సాయిబాబా, మెహర్ బాబా దేవాలయాలు, చర్చి నిర్మించుకున్నారు.

ఈ గ్రామంలో ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఆమె పేరు లింగా ఆదిలక్ష్మమ్మ. ఆమె వయసు 105 ఏళ్ళు. 2014, ఫిబ్రవరి-15న ఆమెకు, గ్రామంలో ఆమె కుమారులు, కోడళ్ళు, మనుమలు, మునిమనుమలు, బంధువులు శతవసంతాల అభిషేకం చేసి సన్మానించారు.

నాగార్జున విశ్వవిద్యాలయం, అక్టోబరు-2020లో నిర్వహించిన ఎ.పి.పి-సెట్ పరీక్షా ఫలితాలలో, ఈ గ్రామానికి చెందిన కొల్లి వెంకటరావు అను విద్యార్థి, రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించాడు.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,156. ఇందులో పురుషుల సంఖ్య 4,110, స్త్రీల సంఖ్య 4,046, గ్రామంలో నివాస గృహాలు 1,838 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 13,192 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-10; 5వ పేజీ.

వెలుపలి లింకులు మార్చు