మున్నూరు కాపు

మున్నూరు కాపు తెలంగాణా బీసీ కులాల జాబితా డి గ్రూపులో ఒక ప్రధానమైన కులం. మున్నూరు కాపులు చిన్న,సన్నకారు రైతులు. మున్నూరు కాపులు తమ పేరు చివర పటేల్ అని పెట్టుకుంటున్నారు.

చరిత్రసవరించు

  • మూడు వైపులా నీటిని ఆపి అడ్డుకట్టలు వేసి చెరువులని కట్టి వ్యవసాయం చేసిన కాపులే మున్నూరు కాపులు. మున్నూరు కాపులు వ్యవసాయంతో పాటు రాజ్యానికి అవసరం వచ్చినపుడు సైనిక సేవలు అందించారు. హజారీ సైనిక దళంలో పనిచేసిన మున్నూరు కాపుల ఇంటి పేరు హజారీ గా స్థిరపడింది.
  • కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి పాలనలోనే బతుకమ్మ పండుగ ప్రారంభమైనట్లు కులాలు, పండుగలు అనే పరిశోధనాత్మక వ్యాసం రాసి డాక్టరేట్ పొందిన పి.శారద తెలిపారు. బతుకమ్మ పండుగకు ప్రధాన కారణం- రుద్రమదేవిపై ఆమె సవతి కుమారులు హరిహరమురారి దేవులు తిరుగుబాటు చేసినప్పుడు జరిగిన పోరాటంలో హజారీ మంగమ్మ అనే మున్నూరు కాపు కులానికి చెందిన అంగరక్షకురాలు రుద్రమదేవిని కాపాడి తను చనిపోతూ రుద్రమదేవిని బతికించినందున బతుకమ్మ పండుగను జరుపడం ఆనవాయితీగా వస్తున్నదని కాకతీయుల కాలంలో మహిళ గ్రంథంలో రచయిత యం. రాధాకృష్ణ పేర్కొన్నారు.
  • గణపతిదేవుడు స్నేహితుడు , గజ సేనాధిపతి ఐన జాయాప సేనాని తన చెల్లెలైన నారమ్మ , పేరమ్మలని గణపతిదేవుడికిచ్చి పెండ్లి చేసిండు. యుద్ధ విద్యలలో అరితేరిన వాడే కాక నృత్య రత్నావళి అనే గ్రంధ రచయిత ఐన ఈ జాయప సేనాని మున్నూరు కాపు.

కాపు-ఉప కులాలుసవరించు

రాజకీయ నాయకులుసవరించు

 
పీవీ రంగయ్య నాయుడు

మూలాలుసవరించు