ముప్పాళ్ళ (ఈపూరు మండలం)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, ఈపూరు మండలంలోని గ్రామం

ముప్పాళ్ళ, పల్నాడు జిల్లా, ఈపూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఈపూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తెనపల్లి నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1751 ఇళ్లతో, 6533 జనాభాతో 2124 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3164, ఆడవారి సంఖ్య 3369. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1114 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 265. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590120.[1]

ముప్పాళ్ళ (ఈపూరు మండలం)
పటం
ముప్పాళ్ళ (ఈపూరు మండలం) is located in ఆంధ్రప్రదేశ్
ముప్పాళ్ళ (ఈపూరు మండలం)
ముప్పాళ్ళ (ఈపూరు మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°14′35.016″N 79°50′27.780″E / 16.24306000°N 79.84105000°E / 16.24306000; 79.84105000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంఈపూరు
విస్తీర్ణం
21.24 కి.మీ2 (8.20 చ. మై)
జనాభా
 (2011)
6,533
 • జనసాంద్రత310/కి.మీ2 (800/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,164
 • స్త్రీలు3,369
 • లింగ నిష్పత్తి1,065
 • నివాసాలు1,751
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522661
2011 జనగణన కోడ్590120

సమీప గ్రామాలు

మార్చు

గోగులపాడు 4 కి.మీ, పొట్లూరు 5 కి.మీ, కొత్తలూరు 7 కి.మీ, కొండాయపాలెం 7 కి.మీ, చిత్తాపురం 7 కి.మీ

గ్రామ పంచాయితీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మోదుగుల నరసింహారావు, సర్పంచిగా ఎన్నికైనాడు

మౌలిక వసతులు

మార్చు

కళ్యాణమండపం:- ఈ గ్రామంలో ఒక కళ్యాణమండపం నిర్మాణం కొరకు గ్రామస్థులు భూమిని సేకరించారు. ఆ స్థలంలో కళ్యాణమండపం నిర్మాణానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 1.25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

విద్యా సౌకర్యాలు

మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: కనీస సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుచున్న ఈ పాఠశాలను ప్రముఖ కార్పొరేటు సంస్థ అయిన "పి.ఎం.ఐ." వారు ఆర్థిక సహకారం అందించి, అసిస్ట్ అను స్వచ్ఛందసంస్థ ద్వారా ఈ పాఠశాలకు అన్ని సదుపాయాలు కల్పించి కార్పొరేటు పాఠశాలకు దీటుగా తయరుచేసారు. ఈ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించుచున్నారు. ఈ విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో గూడా సీట్లు సంపాదించుచున్నారు. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.శ్రీ విద్యా నికేతన్ అనే ప్రవేట్ పాఠశాల ఉంది.సమీప బాలబడి ఈపూరులో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వినుకొండలోను, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ నరసరావుపేటలోను, మేనేజిమెంటు కళాశాల వినుకొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నరసరావుపేటలోను, అనియత విద్యా కేంద్రం వినుకొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ముప్పాళ్ళలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ముప్పాళ్ళలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 20 నుండి 23 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 20 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం లో ఉంది, సహకార బ్యాంకు గ్రామం లో వుంది atm s kuda vunnai వ్యవసాయ RBK కూడా వుంది వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ముప్పాళ్ళలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 163 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 42 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 84 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 155 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 49 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1629 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 575 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1054 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ముప్పాళ్ళలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 969 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 84 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

ముప్పాళ్ళలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి,

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బియ్యం

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రామాలయం=

మార్చు

శ్రీ పాటిమిధ లక్ష్మీనరసింహ స్వామి

మార్చు

సాయిబాబా గుడి

మార్చు

శివాలయం

మార్చు

గంగమ్మ గుడి

మార్చు

వినాయక గుడి

మార్చు

చౌడేశ్వరి అమ్మవారి గుడి

మార్చు

విరాట్ పోతులూరి వీరబ్ర్మేంద్రస్వామి గుడి

మార్చు

ఆంజనేయ స్వామి గుడి

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు

ఆధ్యాత్మిక విశేషం

మార్చు

ఈ గ్రామంలో 1932 నుండి నగర సంకీర్తనం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుచున్నది. గ్రామస్థులు ప్రతి దినం వేకువఝామున విష్ణుమూర్తి (గజేంద్ర మోక్షం) చేతబట్టుకుని, గ్రామ వీధులగుండా ప్రదర్శన నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా అఖండనామ సంకీర్తనతో భజనలు చేయుచూ గ్రామోత్సవం నిర్వహించుచున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిలోని వారందరూ నిద్రమేల్కొని వచ్చి సాంబ్రాణి సమర్పించి, హారతులు తీసుకొనుచున్నారు. కరవుకాటకాలు సంభవించకుండా గ్రామం సుభిక్షంగా, సుఖశాంతులతో ప్రజలు జీవించుచూ అందరూ బాగుండాలని కాంక్షించుచూ ఈ కార్యక్రమం నిర్వహించుచున్నారు. ప్రతిరోజూ పది నుండి ఇరవై మంది ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్నారు.పండుగ,పర్వదినాలలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది.

1932లో గ్రామానికి చెందిన 34 మంది భక్తులు సమావేశమై, గ్రామంలో ప్రతిదినం వేకువఝామున నగర సంకీర్తనం నిర్వహించాలని తీర్మానం చేసుకుని, ఆ మేరకు అంగీకార పత్రం వ్రాసుకుని అందరూ సంతకాలు చేసారు. ఈ బృందానికి కృష్ణదాసు అను ఒక పరమభక్తుడు నాయకత్వం వహించి ప్రోత్సహించాడు. ఈ మేరకు మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ శుద్ధ ఏకాదశి) రోజున ఈ నగరసంకీర్తన కార్యక్రమం ప్రారంభమైనదని పెద్దలు చెప్పుచున్నారు. తమ పూర్వీకుల నుండి వచ్చుచున్న ఈ కార్యక్రమాన్ని గ్రామస్థుల తమ బాధ్యతగా భావించి కొనసాగించుచున్నారు. అందుకోసం ఒక సమాజంగా ఏర్పడినారు. గ్రామంలోని రామాలయం నుండి ప్రారంభించి అక్కడే ముగించుచున్నారు. భారీ వర్షాలు, తుఫానులూ ఉన్నా ఈ కార్యక్రమం ఇంతవరకు ఒక్క రోజు కూడా ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగడం విశేషం. 1975లో ఈ గ్రామంలో ఘర్షణలు తలెత్తి, కర్ఫ్యూ విధించినప్పుడు కొంతమంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయినప్పుడు గూడా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారంటే ఈ గ్రామస్తుల దీక్ష, పట్టుదలలు ఎంతగొప్పవో అర్ధమగుచున్నది. 2017,ఫిబ్రవరి-7న వచ్చిన భీష్మ ఏకాదశి రోజున గూడా ఈ గ్రామస్థులు ఈ నగర సంకీర్తన కొనసాగించారు. ఆరోజుకి ఈ కార్యక్రమం ప్రారంభించి 85 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ఆ రోజున ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు.

ఇతర విశేషాలు

మార్చు
  • గాంధీజీకి తులాభారం వేసిన ముప్పాళ్ళలో ఆయన ఆశయాలకు అణుగుణంగా మద్యనిషేధం పూర్తి స్థాయిలో అమలు చేయాలని గ్రామస్థులు, గాంధీ జయంతి (2-10-2013) నాడు పంచాయతీలో తీర్మానం చేసుకున్నారు. ఎం.ఎల్.ఏ జి.వి.ఆంజనేయులు, ఎం.ఎల్.సి. కె.యస్.లక్ష్మణరావు గార్ల సమక్షంలో, పంచాయతీ సర్పంచి మోదుగుల నరసింహారావు మరియూ వార్డు సభ్యులూ తీర్మానంలో సంతకాలు చేశారు. అనంతరం జరిగిన గ్రామసభలో గ్రామస్థులు గూడా తీర్మానంపై సంతకాలు చేశారు.
  • ఈ గ్రామానికి చెందిన కందుల వరప్రసాదు అను విద్యార్థి, డిల్లీలో 2014,సెప్టెంబరు నెలాఖరులో, ఎన్.సి.సి. ఆధ్వర్యంలో జరుగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనాడు.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ సూరే వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీ శాంతారాం, ప్రస్తుతం ఢిల్లీలోని భారత వాయుసేనలో వింగ్ కమాండరుగా పనిచేస్తున్నారు. శ్రీ శాంతారాం, 7వ తరగతి వరకు నర్సరావుపేటలోనే చదివినారు. తరువాత యు.పి.ఎస్.సి. పరీక్ష వ్రాసి, అందులో తన ప్రతిభ ప్రదర్శించి, 8వ తరగతి నుండి ఇంటరు వరకు, డెహ్రాడూనులో చదివినారు. ఇక్కడ దేశం మొత్తంలో ఉన్న 25 సీట్లలో, ఈయన సీటు సంపాదించడం విశేషం. అనంతరం ఈయన యు.పి.ఎస్.సి. పరీక్ష వ్రాసి, అందులో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులై, పూనాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ చదివినారు. ఆ పిమ్మట హైదరాబాదులోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఒక సంవత్సరం శిక్షణ తీసికొని, భారత వాయుసేనలో పైలట్ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆ రకంగా తన కృషి, పట్టుదలతో ఆయన అంచెలంచెలుగా పైకి వచ్చి, నేడు వింగ్ కమాండరుగా పనిచేస్తున్నారు.
  • ఈ గ్రామ సమీపంలో అత్యధిక సామర్ధ్యం గల పవర్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల అవసరాలకొరకు అత్యధిక సామర్ధ్యం గల పవర్ గ్రిడ్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ రాష్ట్రంలో తూర్పు గ్రిడ్ కు ఈ గ్రిడ్ ను అనుసంధానం చేసి, మిగులు విద్యుత్తును విక్రయించడం, అవసరమైతే తూర్పు గ్రిడ్ నుండి మన రాష్ట్రానికి కొనుగోలు చేయడం చేయవచ్చు. దీనికొరకు ముప్పాళ్ళ, చిత్తాపురం గ్రామాల పరిధిలోని 14 మంది రైతులకు చెందిన 103.362 ఎకరాల భూమిని పవర్ గ్రిడ్ కు అనుకూలమని గుర్తించారు. నిర్మాణం పూర్తి అయినచో ఈ గ్రిడ్ రాష్ట్రంలోనే అత్యధిక సామర్ధ్యం గలది అవుతుంది.

గ్రామంలో గాంధీజీ

మార్చు

గాంధీజీ 1929వ సంవత్సరం,ఏప్రిల్ నెలలో ఈ గ్రామానికి విచ్చేసి 3 రోజులపాటు బసచేసినారు. ఆయన పాదస్పర్శతో గ్రామం పులకించిపోయినది. గ్రామానికి చెందిన గోపాలుని రామలింగయ్యకు గాంధీజీ అంటే ఇష్టం. రామలింగయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఒక సంవత్సరంపాటు కారాగారశిక్షను అనుభవించినారు. వారు జైలులో ఉండగా, కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినవి. గాంధీజీ వచ్చినారని తెలుసుకొని రామలింగయ్య లేఖ వ్రాసినారు. గ్రామాభివృద్ధి అంటే అంతస్తులు పెరగడం కాదు,పేదవాడికి కూడు,గుడ్డ,నీడకు ఇబ్బంది లేకుండా ఉండటమే అని లేఖలో పేర్కొన్నారు. లేఖను చదివిన గాంధీజీ రామలింగయ్యను గురించి తెలుసుకున్నారు. సహాయనిరాకరణ ఉద్యమం జరుగుచున్న రోజులలో,రామంలీంగయ్య కోరిక మేరకు గాంధీజీ 1929లో ముప్పాళ్ళ గ్రామాన్ని సందర్శించినారు. గ్రామములో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నూతన భవనాలకు, గాంధీజీ పేరు పెట్టుకున్నారు. గ్రామ కూడలిలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, మందిరం కట్టించినారు. గాంధీజీ స్పూర్తికి నిదర్శనంగా, చాలా సంవత్సరాల నుండి గ్రామములో మద్యనిషేదం కొనసాగుచున్నది. [9]

గణాంకాలు

మార్చు
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 6408, పురుషుల సంఖ్య 3150, మహిళలు 3258,నివాసగృహాలు 1541,విస్తీర్ణం 2124 హెక్టారులు

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

మార్చు