మౌనశ్రీ మల్లిక్
మౌనశ్రీ మల్లిక్ (జననం. మార్చి 4, 1974) ప్రముఖ కవి, జర్నలిస్టు, సినీగేయ రచయిత.[1]
మౌనశ్రీ మల్లిక్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.సి.జె |
వృత్తి | కవి, రచయిత, జర్నలిస్టు |
తల్లిదండ్రులు | వెంకటమ్మ, బక్కయ్య |
జీవిత విశేషాలు
మార్చుమౌనశ్రీ మల్లిక్ 1974, మార్చి 4న బక్కయ్య - వెంకటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో జన్మించారు. వర్ధన్నపేటలో ఇంటర్మీడియట్, వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంసీజే చదివారు.[1]
వ్యక్తిగత జీవితం
మార్చుమౌనశ్రీ మల్లిక్ కు స్వప్నతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (సృజన్)
కవిత్వం
మార్చుదిగంబర, గరళం, తప్తస్పృహ, మంటల స్నానం
సినీగేయ రచయితగా
మార్చు2010లో సింహశ్రీ మిద్దె దర్శకత్వంలో వచ్చిన 'చేతిలో చెయ్యేసి' చిత్రంలో మూడు పాటలు రాసి, సినీగేయ రచయితగా మారారు.
చేతిలో చెయ్యేసి, గుడ్ మార్నింగ్, థ్రిల్లింగ్, జంక్షన్లో జయమాలిని, చెంబు చిన సత్యం, ఐపీసీ సెక్షన్ భార్య బంధు, బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, కైనీడ , అన్నపూర్ణమ్మ గారి మనవడు, చేతిలో చెయ్యేసి చెప్పు బావ, ఒక అమ్మాయితో, దేవినేని, బెంగళూరు, కర్మణ్యే వాధికారస్తే, సెక్సీ స్టార్, శరపంజరం[2] వంటి మొదలగు చిత్రాలకు పాటలు రాశారు.[1]
టీవీ సీరియల్ గేయరచయితగా
మార్చుదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన కోయిలమ్మ సీరియల్ లో 500 పాటలు రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు.[3] ఒకే సీరియల్ లో ఎక్కువ పాటలు రాసిన రచయిత గా రికార్డు నమోదు అయింది. ఇదే ఆర్కే టెలీ షో జీ తెలుగులో వచ్చిన కృష్ణతులసి మెగా సీరియల్ లో పాటలు రాశారు.[1]
సినిమా జాబితా
మార్చుమౌనశ్రీ ఇప్పటికే చాలా సినిమాలకు పాటలు రాశారు.[4][5]
సం. | సినిమా |
---|---|
2007 | నాలో తొలిసారిగా |
2010 | చేతిలో చెయ్యేసి |
2011 | థ్రిల్లింగ్ |
2012 | గుడ్ మార్నింగ్ |
2015 | చెంబు చినసత్యం |
2017 | పోరాటం |
2018 | జంక్షన్ లో జయమాలిని
IPC సెక్షన్ భార్యా బంధు |
2019 | కైనీడ |
2021 | అన్నపూర్ణమ్మ గారి మనవడు |
2021 | చేతిలో చెయ్యేసి చెప్పు బావ |
2021 | దేవినేని |
2021 | తెలంగాణ దేవుడు |
2021 | జాతీయ రహదారి |
2021 | మధురవాణి |
2023 | బెంగళూరు 69 |
2024 | మూడో కన్ను (అడిషనల్ డైలాగ్స్) |
2024 | శరపంజరం |
2024 | లవ్ Mocktail 2 |
రచనలు
మార్చు- దిగంబర - కవితా సంపుటి.
- గరళం - కవితా సంపుటి.
- సమున్నత శిఖరం.
- తప్తస్పృహ.
అవార్డులు
మార్చుమౌనశ్రీ మల్లిక్ అందుకున్న అవార్డులు, పురస్కారాలు[6]
- రంజని కుందుర్తి అవార్డు
- యువసాహితీ అవార్డు (సిఎఓయు)
- ఎక్స్ రే అవార్డు
- రాధేయ కవితా పురస్కారం
- కలర్స్ అవార్డు (ఉత్తమ సినీ గీతరచయిత..(గుడ్ మార్నింగ్ సినిమా)
- జీవిఆర్ ఆరాధన 5 సార్లు ప్రథమ బహుమతి
- అభ్యుదయ ఫౌండేషన్ అవార్డు
- షీ ఫౌండేషన్ అవార్డు
- ఆసరా అవార్డు
- జనరంజక సహజకవి అవార్డు
- పెన్నా అవార్డు
- సృజన ఉగాది అవార్డు
- సృజన సాహితీ సమితి
- యంవి నర్సింహారెడ్డి సాహిత్య పురస్కారం
- బోవేరా అవార్డు
- కిన్నెర-ద్వానా అవార్డు
- అస్తిత్వం అవార్డు
- ఆర్వీ రమణమూర్తి సాహిత్య పురస్కారం
- దాస్యం వెంకట స్వామి సమైఖ్యసాహితీ పురస్కారం
- ఘంటసాల బంగారు తెలంగాణ పురస్కారం
- భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ పురస్కారం - 2018
- అద్దేపల్లి సృజన పురస్కారం, విజయవాడ
- ప్రతిభా పురస్కారం - తెలుగు సినీ రచయితల సంఘం
- సినారె కవితా పురస్కారం - సాహితీ గౌతమి, కరీంనగర్
- గిడుగు రామ్మూర్తి పురస్కారం, హైదరాబాద్
- కాళోజీ కవితా పురస్కారం - తెలుగు సాహిత్య పీఠం, సిద్దిపేట
- కాళోజీ కవితా పురస్కారం - తెలుగు టెలివిజన్ రచయితల సంఘం
- సినారె - వంశీ ఫిలిం అవార్డు
- హరివిల్లు అవార్డు - గుంటూరు
- జివిఆర్ ఆరాధన టీవీ అవార్డు (ఉత్తమ గేయ రచయిత కోయిలమ్మ సీరియల్)
- కళా వెంకట దీక్షితులు పురస్కారం - త్యాగరాయ గాన సభ, శంకరం వేదిక సంయుక్తంగా
- తేజ రాష్ట్రస్థాయి పురస్కారం - ఆలేరు
- ఉత్తమ కవి పురస్కారం - భారతీయ నాటక కళా సమితి- వర్ధన్నపేట
- ఉత్తమకవి పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం
- సప్తపదిలో తోడు నీడ పురస్కారం, జివిఆర్ ఆరాధన హైదరాబాద్
- రంజని కుందుర్తి అత్యుత్తమ కవితా అవార్డు, ఏ.జి. ఆఫీస్, హైదరాబాద్
- ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం - మచిలీపట్నం
- డాక్టర్ పట్టాభి కళాపీఠం సాహిత్య పురస్కారం - మచిలీపట్నం
- బహుజన సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం
- సృజన కళల వేదిక విశిష్ట కవి ప్రతిభా పురస్కారం -2021, నాగార్జునసాగర్
- పోతుగంటి రామకృష్ణయ్య గుప్త స్మారక జాతీయ సాహిత్య సేవా పురస్కారం-2022
- సినీగేయ సవ్యసాచి వెన్నెల జాతీయ పురస్కారం-2022
- అక్షరదీక్ష జాతీయ విశిష్ట సేవా పురస్కారం- 2022.
- సినారె సాహిత్య పురస్కారం - 2022, తేజస్విని కల్చరల్ అసోసియేషన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ చేతుల మీదుగా
- "బుల్లితెర - సినీ గేయకౌముది" బిరుదు స్వీకారం , తెలుగు సాహిత్య కళా పీఠం - 2022
- కళావేదిక నేషనల్ ఫిలిం అవార్డు - 2022 ( సినిమా - జాతీయ రహదారి)
- 'తానా' ప్రపంచ కవితల పోటీల్లో ప్రథమ బహుమతి - 2020
- కొలకలూరి ఇనాక్ సాహిత్య పురస్కారం -2023
- తెలుగు సాహిత్య కళా పీఠం ఉత్తమ కవి పురస్కారం - 2023.
- వీరశైవ సాహిత్యరత్న పురస్కార్ -2023 (ప్రగతిశీల వీరశైవ సమాజం. పార్లమెంటు సభ్యులు శ్రీ బీబీ పాటిల్ పరి చేతుల మీదుగా)
- ఉత్తమ బుల్లితెర సినీగేయ కవి పురస్కారం - 2024. ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్.
- జివిఆర్ ఆరాధన ఆత్మీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయిత (కలిసుందాం రా సీరియల్, ఈటీవీ) - 2024.
- కవికోవిద కొటికలపూడి కూర్మనాథం 'వంశీ - తిరుమల బ్యాంక్ ఉగాది కామధేను పురస్కారం - 2024.
- అశ్వం అవార్డు, వే ఫౌండేషన్, తిరుపతి -2024.
- తెలుగు సినీ రచయితల సంఘం త్రిదశాబ్ది గౌరవ పురస్కారం -2024.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "మౌనశ్రీ పాటలతో ప్రపంచ రికార్డు... | జోష్ | www.NavaTelangana.com". NavaTelangana. 2020-10-25. Archived from the original on 2023-04-20. Retrieved 2023-04-20.
- ↑ Velugu, V6 (2022-10-08). ""శరపంజరం" నుంచి 2వ సాంగ్ రిలీజ్". V6 Velugu. Archived from the original on 2022-10-08. Retrieved 2023-04-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించనున్న మౌనశ్రీ మల్లిక్". NTN News. 2020-09-18. Archived from the original on 2023-04-20. Retrieved 2023-04-20.
- ↑ "Mounasri Mallik movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2023-04-20. Retrieved 2023-04-20.
- ↑ "Mounasri Mallik on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2023-04-20.
- ↑ "Tollywood Lyricist Mounasri Mallik Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2017-09-21. Retrieved 2023-04-20.