ఎస్.పి.భయంకర్

(యస్.పి. భయంకర్ నుండి దారిమార్పు చెందింది)

ఎస్.పి.భయంకర్ 1984లో విడుదలైన ధ్రిల్లర్ తెలుగు సినిమా. ఈ సినిమాకు వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించబడినది.[1] అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణం రాజు, శ్రీదేవి, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[2][3] ఈ సినిమా 1962 మలయాళ చిత్రం పోస్ట్ మార్టం కు రీమేక్ చేయబడిన చిత్రం.[4] ఈ చిత్రం తమిళంలో 1983లో "వెల్లా రోజా" పేరుతో శివాజీ గణేశన్, ప్రభు తారాగణంగా, 1986లో కన్నడంలో "ధర్మాత్మా" పేరుతో టైగర్ ప్రభాకర్ చే నిర్మించబడినది. ఈ సినిమా హిందీలో జితేంద్ర, ఆదిత్య పాంచోలీ తారాగణంగా "తెహకీకాత్" గా నిర్మించబడింది.[5]

ఎస్.పి.భయంకర్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
కృష్ణంరాజు,
సురేష్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కళ : ఎస్.కృష్ణారావు
  • నృత్యాలు : ప్రకాష్
  • పోరాటాలు : మాధవన్
  • డైలాగులు - సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గానం : ఎస్పీ బాలు, పి.సుశీల
  • సంగీతం : కె. వి. మహదేవన్
  • కథ- చిత్రానువాదం : పుష్పరాజన్
  • కూర్పు : ఎ. సంజీవి
  • ఛాయాగ్రహణం : ఎస్.వవంత్
  • నిర్మాత - దర్శకుడు : వి. బి. రాజేంద్ర ప్రసాద్
  • నిర్మాణ సంస్థ : జగపతి ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల తేదీ : 1985 మే 1

పాటల జాబితా

మార్చు

1: నేను ఒకసారి , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

2.కస్సు బుస్సు మంటోంది వయసు ఎప్పుడెప్పుడంటోంద్ది, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల

3 . కానీ కాని కానీ రాతిరి కానీ రానీ రాని రాని చీకటి రాని, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

4 . వస్తూ వస్తూ ఏం తెచ్చావు వెళ్తూ వెళ్తూ ఏమిస్తావు , రచన: ఆత్రేయ , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

5.ఆజా దేఖో మజా పీజా మర్ జా , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం.

మూలాలు

మార్చు
  1. "S.P. Bhayankar (Banner)". Know Your Films.
  2. "S.P. Bhayankar (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-18. Retrieved 2020-08-20.
  3. "S.P. Bhayankar (Review)". Filmiclub.
  4. "S.P. Bhayankar (Original)". Saina. Archived from the original on 2017-03-05. Retrieved 2020-08-20.
  5. "S.P. Bhayankar (Remakes)". Movie Buff.

. 6..ఘంటసాల గలామృతం, కొల్లూరిభాస్కరరావు బ్లాగ్ .

బాహ్య లంకెలు

మార్చు