రంగనాయకసాగర్ జలాశయం
రంగనాయకసాగర్ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం. 2,300 ఎకరాల్లో రూ. 3,300 కోట్ల ఖర్చుతో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. 2020, ఏప్రిల్ 24న మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్ రావు చేతులమీదుగా ఈ జలాశయం ప్రారంభించబడింది.[1] కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7వ లిఫ్టు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయానికి చేరుకున్న గోదావరిజలాలు, రంగనాయకసాగర్ పంప్‌హౌజ్ ప్రారంభంతో రంగనాయకసాగర్ జలాశయంలోకి చేరుతున్నాయి.
రంగనాయకసాగర్ జలాశయం | |
---|---|
ప్రదేశం | చంద్లాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా |
స్థితి | వాడుకలో ఉంది |
ప్రారంభ తేదీ | 24 ఏప్రిల్, 2020 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
జలాశయం | |
సృష్టించేది | రంగనాయకసాగర్ జలాశయం |
మొత్తం సామర్థ్యం | 3 టీఎంసీ |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | జలాశయం |
నిర్మాణం
మార్చుఅన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ (1.746కి.మీ)లో ప్రవహించిన గోదావరి జలాలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి హెడ్‌రెగ్యులేటరీకి చేరుకొని, అక్కడినుండి గ్రావిటీ కెనాల్ (0.354కి.మీ), సొరంగం (8.59కి.మీ) ద్వారా రంగనాయక్‌సాగర్ సర్జ్‌పూల్ (చంద్లాపూర్ పంప్‌హౌజ్)కు వస్తాయి. చంద్లాపూర్ పంప్‌హౌజ్‌లో 134.5 మెగావాట్లతో ఏర్పాటుచేసిన 4 మోటర్లతో 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక్‌సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు.[2]
ప్రారంభం
మార్చు2020, ఏప్రిల్ 24న చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి దేవాలయంలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత సొరంగంలోని పంప్‌హౌజ్ దగ్గర నాలుగు మోటర్లలో ఒక మోటర్‌ను పంప్‌ను ప్రారంభించి, జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్, జనగామ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ వెంకటరామారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.[3][4]
వివరాలు
మార్చు- సామర్థ్యం: 3 టీఎంసీలు
- వలయాకారం కట్ట: 8.65 కిలోమీటర్లు
- ప్రాజెక్టు ఖర్చు: 3,300 కోట్లు
- మొత్తం ఆయకట్టు: 1,14,000 ఎకరాలు
- జలాశయం ఎఫ్ఆర్ఎల్: 196 మీటర్లు
- కట్ట ఎత్తు: 32.4 మీటర్లు
- కట్ట వెడల్పు: మీటర్లు
- రెగ్యులేటర్లు: 4
- ప్రధాన స్లూయిస్‌లు:
- లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల
- ప్రధాన కాల్వలు:
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు, తాజావార్తలు. "సిద్దిపేట ఒడిలో గోదారమ్మ". www.eenadu.net. Archived from the original on 18 May 2020. Retrieved 9 July 2020.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (23 April 2020). "రంగనాయకుడి పాదాల చెంతకు!". ntnews. Archived from the original on 9 July 2020. Retrieved 9 July 2020.
- ↑ The Hans India, Telangana (24 April 2020). "Harish Rao, KTR release Godavari water into Ranganayaka Sagar". www.thehansindia.com (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 30 May 2020. Retrieved 9 July 2020.
- ↑ Telangana Today, Siddipet (25 April 2020). "KTR all praise for Harish Rao's leadership". Archived from the original on 27 April 2020. Retrieved 9 July 2020.