రజాకార్
'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' 2024లో విడుదలైన తెలుగు సినిమా. హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దరకత్వం వహించాడు[3]. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 18న[4], ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 12న విడుదల చేసి సినిమాను మార్చి 1న విడుదల చేశారు.
రజాకార్ | |
---|---|
దర్శకత్వం | యాటా సత్యనారాయణ[1] |
రచన | యాటా సత్యనారాయణ |
నిర్మాత | గూడూరు నారాయణ రెడ్డి[2] |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కుశేందర్ రమేష్ రెడ్డి |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీ | 1 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుభారతదేశానికి స్వాతం త్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒప్పుకోడు. నిజాం ప్రభువు అండగా రజాకార్ చీఫ్ ఖాసీం రిజ్వీ హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. మతమార్పిడులకు పాల్పడటంతో పాటు ఉర్దూ మాట్లాడని వారిని కఠినంగా శిక్షించాడు. చాలా మందిని అంతమొందించాడు. రజాకార్ల కుట్రలను కొంత మంది పోరాట యోధులు ఎలా ఎదురించి తమ ప్రాణాలను త్యాగం చేశారు? హైదరాబాద్‌ను భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా విలీనం చేశాడు? ఖాసీం రిజ్వీ జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- బాబీ సింహ - రాజిరెడ్డి
- వేదిక - శాంతవ్వ
- ప్రేమ - అంతమ్మ
- ఇంద్రజ - చాకలి ఐలమ్మ
- అనసూయ భరధ్వాజ్ - పోచమ్మ
- మకరంద్ దేశ్‌పాండే - నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
- తేజ్ సప్రు - సర్దార్ వల్లభాయ్ పటేల్
- రాజ్ అర్జున్ - కాసిమ్ రజ్వీ
- అన్నూస్రియా త్రిపాఠి - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భార్యలలో ఒకరు
- తలైవాసల్ విజయ్ - కెఎమ్ మున్షీ
- చందు నాథ్ నాయర్ - భీమిరెడ్డి నరసింహారెడ్డి
- తారక్ పొన్నప్ప - నారాయణరావు పవార్
- ఆరవ్ చౌదరి - మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి
- జాన్ విజయ్ - మీర్ లైక్ అలీ
- చెలువ రాజ్ - బస్వ మాణయ్య
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "భారతి భారతి ఉయ్యాలో[5]" | కాసర్ల శ్యామ్ | మోహన భోగరాజు, భీమ్స్ సిసిరోలియో, స్ఫూర్తి జితేందర్ | 4:21 |
2. | "పోతుగడ్డ" | సుద్దాల అశోక్ తేజ[6] | భీమ్స్ సిసిరోలియో, స్వాతి రెడ్డి (యూకే) | 5:29 |
మూలాలు
మార్చు- ↑ Eenadu (30 March 2024). "ఆ రోజులే వేరు." Archived from the original on 30 March 2024. Retrieved 30 March 2024.
- ↑ Eenadu (13 March 2024). "అంతా ఏకమవ్వాలనే 'రజాకార్' నిర్మించా". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.
- ↑ Eenadu (11 October 2023). "'రజాకార్'లో వాస్తవ చరిత్రను చూపించారు". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ News18 తెలుగు (18 September 2023). "నేటి యువతకు మన చరిత్ర తెలియాలి.. అందుకే ఈ రజాకార్: నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (10 October 2023). "భారతి భారతి ఉయ్యాలో..." Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ Sakshi (30 November 2023). "ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.