రజీందర్ పాల్ (1937 నవంబరు 18 – 2018 మే 9) [1] [2] 1964 లో ఒక టెస్టులో ఆడిన భారతీయ క్రికెటరు. అతను 1954 నుండి 1973 వరకు భారతదేశంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

రజీందర్ పాల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1937-11-18)1937 నవంబరు 18
ఢిల్లీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2018 మే 9(2018-05-09) (వయసు 80)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 107)1964 జనవరి 21 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 98
చేసిన పరుగులు 6 1046
బ్యాటింగు సగటు 6.00 11.12
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3 45
వేసిన బంతులు 78 14826
వికెట్లు 0 337
బౌలింగు సగటు  – 21.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు  – 23
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు  – 2
అత్యుత్తమ బౌలింగు  – 8/27
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 49/-
మూలం: Cricinfo

తొలి ఎదుగుదల

మార్చు

ఓపెనింగ్ బౌలరైన రజీందర్ పాల్ 1954-55లో [3] 17 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ తరపున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ ఆడాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అతను 1955-56లో న్యూజిలాండ్‌, 1959-60లో ఆస్ట్రేలియాలతో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఇండియన్ యూనివర్శిటీల తరపున ఆడాడు. అలాగే ఇంటర్-యూనివర్శిటీ పోటీలో రోహింటన్ బారియా ట్రోఫీ టోర్నమెంటులో ఢిల్లీ యూనివర్సిటీ తరపున ఆడాడు. 1959-60 లో ఢిల్లీ యూనివర్సిటీ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు అతను ఫైనల్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.[4]

అతను 1959-60లో రంజీ ట్రోఫీలో రైల్వేస్‌పై ఢిల్లీ తరపున 54 పరుగులకు 8, 125 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. 1960-61, 1961-62లో ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్నాడు. [5] కెప్టెన్‌గా అతని మొదటి మ్యాచ్‌లో అతను జమ్మూ కాశ్మీర్‌పై 17 పరుగులకు 3 వికెట్లు, 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్సులో మార్పు లేకుండా వరుసగా బౌలింగు చేసాడు అయితే జమ్మూ కాశ్మీర్ 23, 28 పరుగులు మాత్రమే చేసింది.[6]

1961–62లో పాల్ MCC కి వ్యతిరేకంగా ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. టెడ్ డెక్స్టర్‌ను 3 పరుగులకు బౌల్డ్‌ చేయడంతో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు.[7] అతను 1963-64లో ఇంగ్లండ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆడి, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, కొంతకాలం తర్వాత రెండో టెస్టులో ఆడేందుకు ఎంపికయ్యాడు. [8]

1963-64లో టెస్ట్ మ్యాచ్

మార్చు

1963-64 సిరీస్ చాలా స్లో పిచ్‌లపై ఆడారు. మొత్తం ఐదు టెస్టులూ డ్రా అయ్యాయి. విజ్డెన్‌లో తన నివేదికలో, EM వెల్లింగ్స్ "పిచ్‌లు ఎంత నెమ్మదిగా ఉన్నాయంటే, ఒక సమర్థుడైన హస్తకళాకారుడు చీపురు హ్యాండిల్‌తో కూడా విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు ... మ్యాచ్‌లు మొదలైనప్పుడే డ్రా అవుతాయి అనిపించేది" అని పిచ్‌లను వర్ణించాడు. [9] ఇయాన్ వూల్డ్రిడ్జ్ భారతదేశం "ఒక ఫాస్ట్ బౌలర్‌ను కూడా జట్టులో తీసుకుంది. అది వ్యూహాత్మక ప్రయోజనం కోసం కాదు, ఏదో సంప్రదాయం కోసం లాగా ఉంది" అని రాసాడు. [10] తొలి టెస్టులో ఆ ఫాస్ట్ బౌలరు, వసంత్ రంజానే, ఒక వికెట్ తీసుకున్నాడు.

రెండో టెస్టులో రంజానే స్థానంలో రజీందర్ పాల్ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి వికెట్ లేకుండా పోయాడు. [11] వూల్‌డ్రిడ్జ్ అతని ఆటతీరును కొట్టిపారేస్తూ, అతని పేస్‌ను ఆస్ట్రేలియన్ స్పిన్నర్ జానీ మార్టిన్‌తో పోల్చాడు. అతని డెలివరీలు బౌన్స్ అయినప్పుడు, "బ్యాట్స్‌మన్ దాదాపుగా నిలబడి ఉన్న బంతిని కొట్టాడు" అని చెప్పాడు. [10] తదుపరి రెండు టెస్టులకు రజీందర్ పాల్ స్థానంలో రమాకాంత్ దేశాయ్ ఆడాడు. ఐదవ టెస్టులో భారతదేశం పేస్ బౌలర్‌ను ఆడించలేదు. [12]

తర్వాతి కెరీర్

మార్చు

రజీందర్ పాల్ 1965-66 సీజన్ వరకు ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడటం కొనసాగించాడు, అతను 1966-67లో అతను కెప్టెన్‌గా దక్షిణ పంజాబ్‌కు ఆడాడు. అతను 1968-69లో కొత్త జట్టు పంజాబ్‌కు తొలి కెప్టెన్‌గా ఆడాడు. తర్వాత 1969-70లో మల్హోత్రా చమన్‌లాల్ నేతృత్వంలో ఆడాడు. అతను 1971-72 లో ఢిల్లీకి తిరిగి వచ్చాడు. 1972-73, 1973-74లో హర్యానాతో తన కెరీర్‌ను ముగించాడు.

అతని కెరీర్‌లో 21.89 సగటుతో 337 వికెట్లు పడగొట్టడం బలహీన జట్లపై రాణించే ధోరణిని దాచిపెడుతూండవచ్చు. అయితే బలమైన జట్లతో పోటీలో అతను ఇబ్బంది పడేవాడు. జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన 12 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అతను 9.53 సగటుతో 60 వికెట్లు తీశాడు, [13] కానీ దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున అతను 10 మ్యాచ్‌ల్లో 41.87 సగటుతో 16 వికెట్లు తీశాడు. [14]

అతని సోదరుడు రవీందర్ పాల్ [15] 1960లలో ఢిల్లీ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. వారు 1964-65లో కలిసి ఆడిన ఏకైక మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్‌పై కలిసి బౌలింగ్‌ను ప్రారంభించారు, తర్వాత 1965-66లో వాళ్ళు ఢిల్లీ, దక్షిణ పంజాబ్‌ ల ఆటలో చెరొక జట్టు తరఫున ఆడినప్పుడు వారు ప్రత్యర్థి జట్ల తరఫున బౌలింగు చేస్తూ, ఇద్దరూ కలిసి 15 వికెట్లు తీశారు. [16]


అతను న్యూ ఢిల్లీలో రజీందర్ పాల్ క్రికెట్ అకాడమీని నడుపుతూ కోచ్ అయ్యాడు. కపిల్ దేవ్ 1979లో మొదటి సారి ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఒక వారం పాటు అతని వద్ద శిక్షణ పొందాడు.[17]

2004లో భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ టెస్టు ఆటగాళ్లకు పెన్షన్ పథకాన్ని ప్రకటించినప్పుడు, "భవిష్యత్ ఉత్తరాంచల్ క్రికెటర్ల అభివృద్ధికి" తన విరాళాన్ని అందజేస్తానని రజీందర్ పాల్ చెప్పాడు.[18]

రజీందర్ పాల్ 2018 మే 9న డెహ్రాడూన్‌లోని తన నివాసంలో మరణించారు.[19] రజీందర్ పాల్ ఆడుకునే రోజుల్లో అతని సహచరుడైన ఎంపి పాండోవ్, అతని మరణం పట్ల సంతాపం తెలిపిన వారిలో ఉన్నాడు.[20]

మూలాలు

మార్చు
  1. Sportskeeda (10 May 2018). "Former Test cricketer Rajinder Pal passes away". Retrieved 10 May 2018.
  2. "Former Test cricketer Rajinder Pal passes away". The Times of India. Retrieved 2018-05-10.
  3. "Delhi v Services 1954-55". CricketArchive. Retrieved 10 October 2022.
  4. "Delhi University v Bombay University 1959-60". CricketArchive. Retrieved 10 May 2018.
  5. "Delhi v Railways 1959-60". Cricinfo. Retrieved 10 October 2022.
  6. "Jammu and Kashmir v Delhi 1960-61". CricketArchive. Retrieved 10 May 2018.
  7. "Indian Board President's XI v MCC 1961-62". CricketArchive. Retrieved 10 May 2018.
  8. Wisden 1965, pp. 807–12.
  9. E.M. Wellings, "M.C.C. Team in India, 1963–64", Wisden 1965, p. 800.
  10. ఇక్కడికి దుముకు: 10.0 10.1 Ian Wooldridge, "Indian Summer for England", Australian Cricket, December 1968, p. 45.
  11. "2nd Test, Mumbai (BS), Jan 21 - 26 1964, England tour of India". Cricinfo. Retrieved 28 October 2021.
  12. Wisden 1965, pp. 809–17.
  13. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 10 May 2018.
  14. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 10 May 2018.
  15. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 10 May 2018.
  16. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 10 May 2018.
  17. Mihir Bose, A History of Indian Cricket, Andre Deutsch, London, 1990, p. 303.
  18. "Kapil Dev donates his pension to orphanage" Archived 4 మార్చి 2016 at the Wayback Machine Retrieved 11 July 2013
  19. "Former Test cricketer Rajinder Pal passes away". India TV. 10 May 2018. Retrieved 23 May 2018.
  20. "MP Pandove condoles death of Rajinder Pal". Retrieved 23 May 2018.