రమాకాంత్ దేశాయ్

1939, జూన్ 20న ముంబాయిలో జన్మించిన రమాకాంత్ దేశాయ్ (Ramakant Bhikaji Desai) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.[1] 1959లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఇతను ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలందించాడు.వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టినాడు. 1959లో ఇంగ్లాండు, 1961-62లో వెస్టీండీస్, 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1960-61లో పాకిస్తాన్ పై జరిగిన సీరీస్‌లో 21 వికెట్లు సాధించాడు. ముంబాయి టెస్టులో 10వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా ప్రవేశించి 85 పరుగులు సాధించాడు. ఇది జాతీయ రికార్డు. అంతేకాకుండా 9 వికెట్టుకు నానా జోషితో కలిసి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినాడు. 1998, ఏప్రిల్ 28న మరణించినాడు.

రమాకాంత్ దేశాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రమాకాంత్ భికాజీ దేశాయ్
పుట్టిన తేదీ(1939-06-20)1939 జూన్ 20
ముంబై
మరణించిన తేదీ1998 ఏప్రిల్ 27(1998-04-27) (వయసు 58)
ముంబై, India
మారుపేరుTiny
ఎత్తు5 అ. 4 అం. (1.63 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 90)1959 ఫిబ్రవరి 6 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1968 ఫిబ్రవరి 15 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 28 150
చేసిన పరుగులు 418 2,384
బ్యాటింగు సగటు 13.48 18.19
100లు/50లు 0/1 1/9
అత్యధిక స్కోరు 85 107
వేసిన బంతులు 5,597 23,906
వికెట్లు 74 468
బౌలింగు సగటు 37.31 24.10
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 22
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2
అత్యుత్తమ బౌలింగు 6/56 7/46
క్యాచ్‌లు/స్టంపింగులు 9/0 50/0
మూలం: ESPNcricinfo, 3 February 2021

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

మార్చు

రమాకాంత్ దేశాయ్ 28 టెస్టులు ఆడి 37.31 సగటుతో 74 వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను రెండు సార్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 56 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 13.48 సగటుతో 418 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 85 పరుగులు. ఇదే టెస్టులలో అతని ఏకైక అర్థసెంచరీ.

రంజీ ట్రోఫి గణాంకాలు

మార్చు

దేశాయ్ రంజీ ట్రోఫిలో ప్రవేశించిన తొలి సంవత్సరమే 7 మ్యాచ్‌లలో 50 వికెట్లు సాధించాడు. ముంబాతి జట్టు తరఫున ఇది ఇప్పటికీ రికార్డుగా కొనసాగుతోంది. 1958-59 నుంచి 1968-69 వరకు 11 సంవత్సరాలు ముంబాతి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

సెలెక్షన్ కమిటీ చైర్మెన్

మార్చు

1996-97లో రమాకాంత్ దేశాయ్ సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కొనసాగినాడు. చనిపోవడానికి ఒక మాసం ముందే ఆ పదవికి రాజీనామా చేశాడు.

బయటి లింకులు

మార్చు

సూచికలు

మార్చు