రత్లాం
రత్లాం మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మాళ్వా ప్రాంతం, రత్లాం జిల్లా లోని నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. చారిత్రికంగా ఈ నగరం రత్నపురి (రత్నాల నగరం) గా ప్రసిద్ధి చెందింది. రత్లాం నగరం సముద్ర మట్టానికి 480 మీటర్ల ఎత్తున ఉంది. [4]
రత్లాం | |
---|---|
నగరం | |
Coordinates: 23°20′02″N 75°02′13″E / 23.334°N 75.037°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
ప్రాంతం | మాళ్వా |
జిల్లా | రత్లాం |
విస్తీర్ణం | |
• Total | 39 కి.మీ2 (15 చ. మై) |
Elevation | 480 మీ (1,570 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 2,64,914 |
• జనసాంద్రత | 6,800/కి.మీ2 (18,000/చ. మై.) |
Demonym | రత్లాం |
భాష | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 457001 |
టెలిఫోన్ కోడ్ | 0741 |
Vehicle registration | MP-43 |
Climate | Humid subtropical climate (Köppen) |
2019 లో భారతీయ జనతా పార్టీకి చెందిన గుమన్ సింగ్ డోమర్ రత్లం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. [5]
నగరం ఆహారం ప్రేమికులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధమైన చిరుతిండి 'రత్లామి సేవ్' (కారప్పూస) కు రత్లాం కేంద్రం. బంగారు ఆభరణాలకు, చీరల మార్కెట్‌కూ కూడా రత్లాం ప్రసిద్ధి.
రత్లాం బ్రిటిష్ పాలనా కాలంలో మధ్య భారతం లోని మాళ్వా ఏజెన్సీలో భాగంగా ఉండేది. రత్లాం నగరం దీనికి రాజధానిగా ఉండేది. రత్లాం మొదట పెద్ద రాజ్యం. కానీ అప్పటి పాలకుడు రతన్ సింగ్ ధర్మత్పూర్ యుద్ధంలో ఔరంగజేబును వ్యతిరేకించాడు. వీరోచితంగా పోరాడి మరణించాడు. అప్పుడు రాజ్యం నశించింది. మహారాజా బిరుదు పోయింది. తరువాత మహారాజా సజ్జన్ సింగ్ పాలనలో బ్రిటిష్ వారు మహారాజా బిరుదును పునరుద్ధరించారు. 1819 జనవరి 5 న రత్లాం సంస్థానం బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది.
భౌగోళికం
మార్చురత్లాం :23°19′0″N 75°04′0″E / 23.31667°N 75.06667°E నిర్దేశాంకాల వద్ద ఉంది. నగరం యొక్క వైశాల్యం 39 చ.కి.మీ. ఇది రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంది.
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం రత్లాం నగర జనాభా 2,64,914. అందులో 1,34,915 మంది పురుషులు, 1,29,999 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మగవారికి 964 స్త్రీలున్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 29,763 మంది ఉన్నారు. రత్లాంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 2,04,101, ఇది జనాభాలో 77.0%, పురుషుల అక్షరాస్యత 81.2%, స్త్రీల అక్షరాస్యత 72.8%. రత్లాంలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 86.8%. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.7%, స్త్రీల అక్షరాస్యత 81.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 27,124, షెడ్యూల్డ్ తెగల జనాభా 12,567. రత్లాంలో మొత్తం గృహాల సంఖ్య 53133. [2]
శీతోష్ణస్థితి
మార్చురత్లాంలో, మిగతా మధ్యప్రదేశ్ మాదిరిగానే, తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి (సిఎఫ్ఎ ) ఉంది. నగరంలో మూడు విభిన్న ఋతువులను గమనించవచ్చు: వేసవి, రుతుపవనాలు, శీతాకాలం. వేసవికాలం మార్చి మధ్యలో ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 oC వరకు చేరతాయి. వర్షాకాలం జూన్ చివరలో ప్రారంభమవుతుంది, ఉష్ణోగ్రతలు సగటున 38oC వరకు ఉంటాయి. స్థిరమైన, కుండపోత వర్షపాతం, అధిక తేమతో కూడుకుని ఉంటుంది. సగటు వర్షపాతం 940 మి.మీ.. శీతాకాలం నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. పొడి, చల్లగా, ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సగటున 4 - 8oC వరకు తగ్గుతాయి. కానీ కొన్ని రాత్రులలో సున్నా వరకు చేరవచ్చు. [6]
శీతోష్ణస్థితి డేటా - Ratlam (1981–2010, extremes 1948–2009) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.0 (93.2) |
37.8 (100.0) |
41.9 (107.4) |
45.2 (113.4) |
45.5 (113.9) |
45.0 (113.0) |
40.6 (105.1) |
38.7 (101.7) |
39.3 (102.7) |
39.0 (102.2) |
36.9 (98.4) |
33.8 (92.8) |
45.5 (113.9) |
సగటు అధిక °C (°F) | 26.3 (79.3) |
28.8 (83.8) |
34.1 (93.4) |
38.2 (100.8) |
39.8 (103.6) |
36.3 (97.3) |
30.3 (86.5) |
28.3 (82.9) |
30.9 (87.6) |
33.0 (91.4) |
30.6 (87.1) |
27.6 (81.7) |
32.0 (89.6) |
సగటు అల్ప °C (°F) | 10.9 (51.6) |
13.4 (56.1) |
18.2 (64.8) |
23.2 (73.8) |
26.2 (79.2) |
25.3 (77.5) |
23.5 (74.3) |
23.1 (73.6) |
22.2 (72.0) |
19.8 (67.6) |
15.9 (60.6) |
11.9 (53.4) |
19.5 (67.1) |
అత్యల్ప రికార్డు °C (°F) | 2.5 (36.5) |
2.6 (36.7) |
9.0 (48.2) |
11.6 (52.9) |
18.4 (65.1) |
17.3 (63.1) |
18.1 (64.6) |
16.9 (62.4) |
14.0 (57.2) |
12.5 (54.5) |
7.9 (46.2) |
3.9 (39.0) |
2.5 (36.5) |
సగటు వర్షపాతం mm (inches) | 6.8 (0.27) |
1.0 (0.04) |
1.2 (0.05) |
1.2 (0.05) |
8.8 (0.35) |
103.4 (4.07) |
332.8 (13.10) |
347.9 (13.70) |
97.5 (3.84) |
45.5 (1.79) |
5.7 (0.22) |
2.3 (0.09) |
954.0 (37.56) |
సగటు వర్షపాతపు రోజులు | 0.5 | 0.2 | 0.2 | 0.2 | 0.8 | 5.9 | 13.7 | 13.7 | 5.4 | 1.6 | 0.3 | 0.2 | 42.6 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 36 | 28 | 21 | 20 | 25 | 47 | 71 | 77 | 62 | 40 | 37 | 38 | 41 |
Source: India Meteorological Department[7][8] |
రవాణా
మార్చురైల్వేలు
మార్చురత్లాం జంక్షన్ పశ్చిమ రైల్వే జోన్లోని బ్రాడ్ గేజ్ లైన్లలో భారత రైల్వే యొక్క రైల్వే డివిజను. ఢిల్లీ-ముంబై, అజ్మీర్-ఖాండ్వా రైలు మార్గాల్లో ఇది ఒక ప్రధానమైన జంక్షన్. రత్లాం జంక్షన్ పశ్చిమ రైల్వే జోన్ యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయం. [9] రత్లాం సిటీ గుండా నాలుగు ప్రధాన రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి, ఇవి ముంబై, ఢిల్లీ అజ్మీర్, ఖండ్వాలకు వెళ్తాయి. రత్లాం జంక్షన్లో రోజూ 157 రైళ్ళు ఆగుతాయి. రాజధాని, గరీబ్ రథ్ వంటి అన్ని ప్రధాన సూపర్ ఫాస్ట్ రైళ్లు రత్లాం జంక్షన్ వద్ద ఆగుతాయి.
రోడ్లు
మార్చురత్లాం జాతీయ రహదారి 79 ద్వారా ఇండోర్, నీముచ్ లకు అనుసంధానించబడి ఉంది. ఈ నాలుగు లేన్ల రహదారి ఇండోర్ నుండి చితోర్‌గఢ్ వరకు వెళ్ళి స్వర్ణ చతుర్భుజితో కలుస్తుంది.
నగరం నుండి ఉదయపూర్, బాన్స్‌వరా, మంద్‌సౌర్, నీమచ్, ఇండోర్, భూపాల్, ధార్, ఉజ్జయినీ, పెట్లవాడ్, ఝాబువా మొదలైన ప్రాంతాలకు రత్లాం నుండి సాధారణ బస్సు సేవలు ఉన్నాయి.
నగరంలో విమానాశ్రయం లేదు. కానీ బంజాలిలో ఒక ఎయిర్‌స్ట్రిప్ ఉంది. సమీప విమానాశ్రయం ఇండోర్‌లోని దేవి అహిల్యా బాయి హోల్కార్ విమానాశ్రయం (137 కి.మీ.).
మూలాలు
మార్చు- ↑ "Welcome to Ratlam City". rmcratlam.in. Retrieved 22 November 2020.
- ↑ 2.0 2.1 "Ratlam - Census 2011". censusindia.gov.in. Retrieved 13 February 2020.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 7 జనవరి 2021.
- ↑ Ratlam District Information, ratlam.nic.in. Retrieved 15 March 2012.
- ↑ "Ratlam Election Results 2019 Live Updates (Jhabua ): Guman Singh Domar of BJP Wins". News18. Retrieved 23 May 2019.
- ↑ Indore, India Weather (closest to Ratlam), weatherbase.com, 15 March 2012.
- ↑ "Station: Ratlam Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 661–662. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M128. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
- ↑ "Ratlam Junction". Archived from the original on 2015-11-16. Retrieved 2021-01-07.