రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది[1].
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి | |
---|---|
![]() యోగివేమన విశ్వవిద్యాలయ వెబ్‌సైటు లో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చిత్రము | |
పుట్టిన తేదీ, స్థలం | 1948 అక్టోబరు 16 చిత్తూరు జిల్లా కుంట్రపాకం | 16 అక్టోబరు 1948
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
కాలం | 20వ శతాబ్దం |
విషయం | తెలుగు సాహిత్యము???? |
జీవిత భాగస్వామి | లక్ష్మీకాంతమ్మ |
తండ్రి | రామిరెడ్డి |
తల్లి | మంగమ్మ |
సంతానం | శ్రీవిద్య, ఆనందకుమార్ |
Website | |
rachapalem |
నేపధ్యముసవరించు
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోకి కుంట్రపాకం ఆయన స్వగ్రామం. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి 1948, అక్టోబరు 16న చిత్తూరుజిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామంలో జన్మించారు.[2] తల్లి మంగమ్మ, తండ్రి రామిరెడ్డి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్‌డీలతోపాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం (శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,అనంతపురము లో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు) గల ఆచార్య రాచపాలెం లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఈయన నేతృత్వంలో 25మంది పీహెచ్‌డీలు, 20 మంది ఎంఫిల్ చేశారు. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం నుంచి రాయలసీమ కల్పనా సాహిత్యం, స్థానిక పదకోశం, పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 2012 అక్టోబరు నుంచి వైఎస్సార్ జిల్లాలోని కవులు, రచయితలపై ‘నెలనెల మన జిల్లా సాహిత్యం’ పేరిట సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు. వేమన, సీపీ బ్రౌన్‌పై విమర్శనా వ్యాసాలు వెలువరించారు. సీమ సాహితి మాసపత్రికకు ప్రధాన సంపాదకునిగా ఉన్నారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మైసూరు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, గుల్బర్గా విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా వ్యవహారించారు. అరసం రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్ర అధికారభాషా సంఘం సభ్యునిగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి (న్యూఢిల్లీ) సభ్యునిగా పనిచేశారు. రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి మన నవలలు- మన కథానికలు అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా 2014 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[3] రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు తదితర రచనలను ఆయన వెలువరించారు.
ఆయన ప్రస్తుతం కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు[4]. తాను రాసిన విమర్శనాత్మక పుస్తకానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అందులో నవలలు, కథానికలపై 24 వ్యాసాలున్నాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా సాహిత్యంలో ఉన్న ఆయన 19 పుస్తకాలు ప్రచురించారు. ఇప్పుడు అవార్డు వచ్చిన మన నవలలు- మన కథలు పుస్తకాన్ని 2010లో రాశారు. 11 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తెలుగులో సాహితీ విమర్శ సరిగా ఎదగలేదన్న విమర్శలకు ఈ అవార్డే సమాధానమని ఆయన చెప్పారు. వీరి దీర్ఘకావ్యం "పొలి"ని పి.రమేష్ నారాయణ The Harvest పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు.
రచనలుసవరించు
- శిల్పప్రభావతి - ప్రభావతీప్రద్యుమ్నము కావ్యం పై విమర్శ (పి.హెచ్.డి.సిద్ధాంతగ్రంథము)
- కథాంశం
- చర్చ
- కొన్ని కావ్యాలు - కొందరు కవులు
- దరి/దాపు
- దీపధారి గురజాడ
- మన నవలలు-మన కథానికలు
- Literary theory of classical telugu poets
- Nannayya and his influence on later telugu poets
- Principals of Literary research
- జాతీయోద్యమ కథలు (సంకలనం - సంపాదకుడు)
- ప్రతిఫలనం
- రెండు ప్రపంచాలు (కవితా సంపుటి)
- సాహిత్య పరిశోధన సూత్రాలు (హెచ్.ఎస్.బ్రహ్మానందతో కలిసి)
- వేమన
- విమర్శ -2009
- పొలి (దీర్ఘకవిత)
- తెలుగు కవిత్వం - నన్నయ ఒరవడి
- గురజాడ - తెలుగు కథానిక
- గురజాడ - మన విమర్శకులు
- మహర్షి దేవేంద్రనాథ టాగూర్ (మోనోగ్రాఫ్ అనువాదం)
- దేవుడే బాలుడైతే (నవలిక అనువాదం)
దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రముసవరించు
దేవేంద్రనాథ్ ఠాగూర్ (1817 మే 15 – 1905 జనవరి 19) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మత సంస్కరణకు కృషిచేశరు. 1848 లో బ్రహ్మో మతం స్థాపించిన వ్యక్తి. ఈయన బెంగాల్ లో శ్రీలైదాహలో జన్మించారు. ఈ గ్రంథంలో చలమయ్య ఆయన జీవిత చరిత్రను వివరించారు.[5] దీనికి దేవేంద్రనాథ భట్టాచార్య బెంగాలీ భాషలో రచన మూలం. దీని ప్రథమ ముద్రణ 1934లో విడుదలవగా, ద్వితీయ ముద్రణు, 1936లోను, తృతీయ ముద్రణము 1937లో విడులైనవి. వీటిని శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల ముద్రించగా; శాంతి కుటీరము, పిఠాపురం వారు ప్రచురించారు. రచయిత ఈ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ రఘుపతి వేంకటరత్నం నాయుడు గారికి భక్తితో సమర్పించారు.
పురస్కారాలుసవరించు
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం 2007
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహితీ విమర్శ పురస్కారం 2008
- కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం 2014
- కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం[6]. - 2000
మూలాలుసవరించు
- ↑ https://www.youtube.com/watch?v=IWWeHMA9hDQ
- ↑ ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి వివరాలు - కడప. ఇన్ఫో[permanent dead link]
- ↑ రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-20.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో దేవేంద్రనాథ ఠాకూరు చరిత్రము పుస్తకం.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in:
|date=
(help)