రాజుపాలెం లక్ష్మీపురం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని గ్రామం

రాజుపాలెం లక్ష్మీపురం, (R.L.PURAM) (కంభంపాడు లేదా కమ్మంపాడు ) ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్ నం. 523 226., యస్.టీ.డీ.కోడ్ 08592.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°35′17″N 79°48′14″E / 15.588°N 79.804°E / 15.588; 79.804Coordinates: 15°35′17″N 79°48′14″E / 15.588°N 79.804°E / 15.588; 79.804
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
విస్తీర్ణం
 • మొత్తం9.25 కి.మీ2 (3.57 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం3,437
 • సాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి946
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523226 Edit this on Wikidata


గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

పూర్వం ఈ గ్రామం ఉన్న స్థలంలో ఎటువంటి గ్రామం ఉండేది కాదు అంతకు ముందు ఈ గ్రామస్థులు మైలవరం చెరువు దగ్గర నివసిస్తూ ఉండేవారు అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమ్మంపాడు దగ్గర ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు.గ్రామానికి చెందిన రాజు రాజుపాలెం ఉండటం ఆ గ్రామానికి రాజుపాలెం అనే పేరు వచ్చింది అలాగే లక్ష్మీపురంని మొదట లక్ష్మీపురం అని తర్వాత ప్రస్తుతం కమ్మంపాడు లేదా కంభంపాడు అని వ్యవహరిస్తున్నారు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప మండలాలుసవరించు

తూర్పున సంతనూతలపాడు మండలం, పడమరన మద్దిపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీసవరించు

  1. ఈ గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయ వనరులు వచ్చే పంచాయతీల జాబితాలలో ఒకటి. [9]
  2. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలు:- రాజుపాలెం, లక్ష్మీపురం (కంభంపాడు లేదా కమ్మంపాడు ), రామతీర్ధం, రామతీర్ధం ఆలయప్రాంతం. [2]
  3. 25 ఏళ్ళక్రితంనిర్మించిన ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి మొదటిసారి కొత్త హంగులు వచ్చినవి. [3]
  4. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ పమిడి వెంకటరావు, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు తరువాత జిల్లా సర్పంచిల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన్నారు. వీరు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [4]&[6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం, రామతీర్ధంసవరించు

చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రంలో, దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మార్చి-23, సోమవారం నాడు ప్రాంభించారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. [7]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంసవరించు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- రామతీర్ధంలోని శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయానికి నైఋతిదిశగా రెండున్నర ఎకరాలలో విస్తరించియున్న ఈ ఆలయ జీర్ణోద్ధరణ కొరకు, 2015, డిసెంబరు-14వ తేదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8]

==గ్రామంలో ప్రధాన పంటలు== వాన కాలంలో వరి, సజ్జలు అలాగే అలాగే ఎండాకాలంలో నువ్వులు చలికాలంలో ఎక్కువగా కంది, పొగాకు, వరి సాగు చేస్తారు. అలాగే అలాగే కొన్ని పొలాలలో జామాయిల్, సుబాబులు వంటివి కలప కోసం వేస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలుసవరించు

గెలాక్సీ గ్రానైట్ గనులతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గ్రామం. గ్రానైట్ సీనరేజ్ రూపంలో ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న గ్రామం. ఇన్ని వసతులున్నా ఈ గ్రామంలో మౌలిక వసతులు కరవు. 1990 లో ఈ గ్రామంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూసేవరకూ రాజుపాలెం లక్ష్మీపురం (ఆర్.ఎల్.పురం) గ్రామ ఆదాయం, గుర్తింపు గూడా అంతంతమాత్రమే. గ్రానైట్ పరిశ్రమ వచ్చాక గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. తమ భూములకు విలువ పెరిగి కొందరు ధనవంతులైనారు. గ్రానైట్ క్వారీలకు అనుబంధంగా సమీపంలోనే, పరిశ్రమలు వెలిశాయి. గ్రామ ఆదాయం పెరిగి సుమారు కోటి రూపాయల వరకూ చేరింది. [5]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,437 - పురుషుల సంఖ్య 1,766 - స్త్రీల సంఖ్య 1,671 - గృహాల సంఖ్య 879

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,864.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,471, మహిళల సంఖ్య 1,393, గ్రామంలో నివాస గృహాలు 637 ఉన్నాయి.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-27; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, అక్టోబరు-28; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2,2013; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూలై-8; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, నవంబరు-26; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-24,25&26. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-7; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-26; 1వపేజీ.