రాణి గైదిన్ల్యు

భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు

రాణి గైదిన్ల్యు (26 జనవరి 1915 - 17 ఫిబ్రవరి 1993) భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు.[1][2][3] ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు శాసనోల్లంఘన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

రాణి

గైదిన్ల్యు
1996 భారత పోస్టల్ స్టాంపుపై రాణి గైదిన్ల్యు
జననం(1915-01-26)1915 జనవరి 26
నుంగ్కావో గ్రామం, టౌసెంసబ్ డివిజన్‌, తామేంగ్‌లాంగ్ జిల్లా, మణిపూర్‌
మరణం1993 ఫిబ్రవరి 17(1993-02-17) (వయసు 78)
నుంగ్కావో, మణిపూర్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినాగ ప్రజల ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ నాయకురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్రిటిష్ పాలనకు కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం
తల్లిదండ్రులు
  • లోథోనాంగ్ పమేయి (తండ్రి)
  • కచక్లెన్లియు (తల్లి)
పురస్కారాలుపద్మ భూషణ్ (1982), తామ్రపత్ర ఫ్రీడమ్ ఫైటర్ అవార్డు (1972), వివేకానంద సేవా అవార్డు (1983)

జననం, కుటుంబం మార్చు

గైదిన్ల్యు 1915 జనవరి 26మణిపూర్‌లోని తామేంగ్‌లాంగ్ జిల్లాలోని టౌసెంసబ్ డివిజన్‌లో గల నుంగ్కావో (లేదా లాంగ్‌కావో) గ్రామంలో జన్మించింది. ఆమె రోంగ్‌మై నాగ తెగకు చెందినది (కబుయ్ అని కూడా పిలుస్తారు). లోథోనాంగ్ పమేయి, కచక్లెన్లియు అనే దంపతులకు జన్మించిన ఎనిమిదిగురు సంతానంలో గైదిన్ల్యు ఐదో సంతానం.[4] ఈమె కుటుంబం గ్రామంలోని పాలక కులానికి చెందినది. ఈ ప్రాంతంలో పాఠశాలలు లేకపోవడం వల్ల ఆమెకు అధికారిక విద్య అందలేదు.[5][6][7][8]

స్వాతంత్ర్యోద్యమంలో మార్చు

గైదిన్ల్యు 13 సంవత్సరాల వయస్సులో, కజిన్ హైపో జాడోనాంగ్ హెరాకా మత ఉద్యమంలో చేరింది. ఈ ఉద్యమం తరువాత మణిపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని కోరుతూ మరో ఉద్యమాన్ని ప్రారంభించింది. గైదిన్ల్యును 1932లో 16 సంవత్సరాల వయస్సులోనే బ్రిటిష్ పాలకులు అరెస్టు చేసి, జీవిత ఖైదు విధించారు. జవహర్‌లాల్ నెహ్రూ 1937 లో షిల్లాంగ్ జైలులో ఉన్న ఆమెను కలుసుకుని, ఆమెను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఆమెకు "రాణి" ("క్వీన్") అనే బిరుదు ప్రదానం చేశాడు.[9] అప్పటి నుండి ఆమె రాణి గైదిన్ల్యుగా ప్రజాదరణ పొందింది. హెరాక ప్రజల నమ్మకం ప్రకారం, ఆమె చెరచమ్దిన్లీ దేవత అవతారంగా పరిగణించబడుతుంది.[10][11]

జైలు నుండి విడుదల మార్చు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె 1947లో విడుదలైంది. జైలు నుండి విడుదలయ్యాక కూడా ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తూనే ఉండేది. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలిగా గౌరవించబడింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.

క్రైస్తవ మత తిరస్కరణ మార్చు

ఈమె జైలు నుండి విడుదలైన తర్వాత, నాగ మత పెద్దలు క్రైస్తవుల మత ప్రచారం పట్ల ఆసక్తి చూపి నాగ మత సంప్రదాయాన్ని వదిలి క్రైస్తవ మతం స్వీకరించాలని చెప్పినపుడు ఆమె దీన్ని గట్టిగా ప్రతిఘటించి నాగ మతంలోనే కొనసాగింది.[12] క్రైస్తవ మత ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, హెరాక ఉద్యమానికి ఈమె మద్దతు ఇచ్చిన కారణంగా ఈమెను నాగా జాతి ప్రజలు వ్యతిరేకించారు. వీరిలో చాలా మంది 1960 నాటికి క్రైస్తవ మతంలోకి మారారు. ఆమె భారత ప్రభుత్వానికి మద్దతు పలకడంతో నాగ జాతీయవాద సమూహాలు కూడా ఆమెను గుర్తించలేదు. 1970లో హిందూ జాతీయవాద సంస్థ సంఘ్ పరివార్ హెరాకా ఉద్యమంతో కలిసి పనిచేసినపుడు, ఆమె హిందూమతానికి ప్రమోటర్ అనే భావన క్రైస్తవ నాగాలలో బలపడింది.[13]

మరణం మార్చు

1991 లో, గైదిన్ల్యు తన జన్మస్థలం లాంగ్‌కావోకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె 78 సంవత్సరాల వయసులో 1993 ఫిబ్రవరి 17 న మరణించింది.[14]

పురస్కారాలు, గుర్తింపులు మార్చు

గైదిన్ల్యు కొహిమాలో ఉన్న సమయంలో ఈ అవార్డులు లభించాయి.

  1. 1972లో తామ్రపత్ర ఫ్రీడమ్ ఫైటర్ అవార్డు
  2. 1982లో పద్మభూషణ్ అవార్డు[11]
  3. 1983లో వివేకానంద సేవా అవార్డు.

రాణి గైదిన్లియుకు మరణానంతరం బిర్సా ముండా అవార్డు లభించింది. భారత ప్రభుత్వం 1996లో ఆమె గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2015లో ఆమె గౌరవార్థం భారత ప్రభుత్వం స్మారక నాణేన్ని విడుదల చేసింది.

స్మారక మందిరం మార్చు

 
రాణి గైదిన్ల్యు శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం, న్యూఢిల్లీ, 2015

2015లో కేంద్ర ప్రభుత్వం, T. R. జెలియాంగ్ రాష్ట్ర ప్రభుత్వం గైదిన్ల్యు స్మారక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించినప్పుడు, నాగాలాండ్ రాష్ట్రంలోని అనేక పౌర సమాజ సంస్థలు దీనిని వ్యతిరేకించాయి.[15]

మూలాలు మార్చు

  1. Kusumlata Nayyar (2002). Rani Gaidinliu. Ocean Books. ISBN 978-81-88322-09-1. Retrieved 12 June 2013.
  2. Arkotong Longkumer (4 May 2010). Reform, Identity and Narratives of Belonging: The Heraka Movement in Northeast India. Continuum International Publishing Group. pp. 162–176. ISBN 978-0-8264-3970-3. Retrieved 12 June 2013.
  3. Rani Gaidinliu – the true freedom fighter Archived 2017-09-09 at the Wayback Machine, India-north-east.com
  4. 97th birth anniversary of Rani Gaidinliu observed Archived 2018-11-29 at the Wayback Machine. Assam Tribune, 30 January 2012.
  5. S. S. Shashi (1996). Encyclopaedia Indica: India, Pakistan, Bangladesh. Anmol Publications. p. 1270. ISBN 978-81-7041-859-7. Retrieved 12 June 2013.
  6. History Of the Frontier Areas Bordering On Assam 1883–1941 by Sir Robert Reid, page 86.
  7. Tribal Freedom Fighters of India. Publications Division Ministry of Information & Broadcasting. 30 August 2017. ISBN 9788123025216.
  8. The Rani Of The Nagas by Pritam Sengupta. Outlook, 22 August 2005.
  9. Amit Kumar Nag (1976). Rani Gaidinliu: A Study of the Jadonang Movement of the Nagas. Tribal Mirror Publications. p. 18. Retrieved 12 June 2013.
  10. Rani Gaidinliu. Eastern Panorama.
  11. 11.0 11.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
  12. Rahul Karmakar (14 June 2015). "Rani Gaidinliu: A Naga queen and BJP's spin machine". Hindustan Times. Archived from the original on 14 June 2015.
  13. Commemorative Coin. Indianexpress.com. Retrieved on 29 November 2018.
  14. Prasanta Mazumdar (23 August 2015). "Nagaland Outfit Joins Chorus Against Rani Memorial". Indian Express. Archived from the original on 4 మే 2016. Retrieved 3 అక్టోబర్ 2021. {{cite news}}: Check date values in: |access-date= (help)
  15. Remembering Rani Gaidinliu and her legacy. E-pao.net. Retrieved on 29 November 2018.