రావి వారి పాలెం, మోపిదేవి
రావి వారి పాలెం, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం.
రావివారి పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం. — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°56′12″E / 16.072762°N 80.936746°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521125 |
ఎస్.టి.డి కోడ్ | 08671. |
గ్రామ చరిత్ర
మార్చురావివారిపాలెం సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలగ్రామం. "రావి" అనే ఇంటి పేరు కలవారు ఎక్కువ ఉండటం వలన ఈ ఊరికి "రావి వారి పాలెం" అని పేరు వచ్చింది.[ఆధారం చూపాలి] 'రావి సీంగరప్ప ఈవూరికి మూలపురుషుడు.[ఆధారం చూపాలి] ఆయన 1700 సంవత్సరం నాటికి ఈ రావివారిపాలెం ఒక పెద్ద అరణ్యంగా వుండెడిది. ఆ కాలంలో ఈ గ్రామం దేవరకోట సంస్థానంలో వుండెడిది. రావి సింగరప్ప, వారి సొదరుల వారసులే ఈ గ్రామంలోని రావివారు. దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి.
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుఒకే ఒక ఎర్ర బస్సు సౌకర్యం ఉంది. మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ -64 కి.మీ.దూరంలో ఉంది
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా గ్రంథాలయ సంస్థ వారి పురాతన గ్రంథాలయం
మార్చు- ఈ గ్రంథాలయం ఏర్పాటుకు, 1966లో, శ్రీ కావూరు కోదండరామయ్య, 20 సెంట్లస్థలాన్ని ఉచితంగా అందజేసినారు. ఆ స్థలంలో ఒక పెంకుటిల్లు నిర్మించి, గ్రంథాలయం నిర్మించారు. అప్పటినుండి ఈ గ్రంథాలయం యువతకు, ప్రజలకు విఙానాన్ని అందించుచున్నది. [7]
- ఈ గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రు. 15 లక్షలను మంజూరు చేసింది. [6]
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల
మార్చుప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతూ, మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్నా, విద్యార్థుల సంఖ్య 40% పెంచి మనుగడకు నిర్వచనం చెప్పారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుచున్నది. బోడగుంట నుండి వచ్చే విద్యార్థులకోసం, ఒక రిక్షా ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయుల కృషికి గ్రామస్థులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామంలోని స్నేహితుల బృందం, రోటరీ క్లబ్ అడిగిందే తడవుగా మౌలిక వసతులు కల్పించుచూ, ఉపాధ్యాయుల ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి గాజుల పార్వతీదేవి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనారు. [1]
గ్రామంలో మౌలిక వసతులు
మార్చువైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ ఆసుపత్రి.
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
మార్చుపాల ఉత్పత్తి దారుల సహకార సంఘo
మార్చుగ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుపేరయ్య చెరువు.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ రామాలయం
మార్చుగ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం
మార్చుఈ ఆలయంలో 2014, ఆగష్టు-14 నుండి 17 వరకు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా, 15 మంది వేదపండితుల ఆధ్వర్యంలో, నూతనంగా పోతురాజు శిలల ప్రతిష్ఠాపన, దంపతులు, అత్యంత వైభవంగా నిర్వహించారు. రైతులు నైవేద్యాలు సమర్పించి కొలిచారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [3], [4]&[5]
చర్చి
మార్చుగ్రామంలో ప్రధాన పంటలు
మార్చురెండు చెరువులు, పారాయి చెరువు, నూకాలమ్మ చెరువు ఉన్నాయి. ఊరి ఉత్తరం వైపునుంచీ ఒక కృష్ణానది కాలువ పారుతుంది. ఇక్కడి ప్రధాన పంట వరి (సార్వా), అపరాలు మినుములు లేక పెసలు. నేల ఒండ్రు మన్ను.
గ్రామంలోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)
మార్చు- చరిత్ర కల ఈ ఊరు ఒకప్పటి కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించింది.
- అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు, కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య వంటి వారికి ఈ ఊరితో బాంధవ్యం ఉంది.
గ్రామ విశేషాలు
మార్చు- ఊరిలోని అనేక కుటుంబాల నుంచీ దేశ విదేశాలలో స్థిరపడి ప్రముఖ స్థానాలలో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు.
- ఈ గ్రామానికి 2014, ఫిబ్రవరి-4న, కంచికామకోటి పీఠాధిపతి గ్రామాన్ని సందర్శించారు. [2]
- ఈ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు శ్రీమతి పరుచూరి వెంకటసుబ్బమ్మ, 101 సంవత్సరాల వయస్సులో, 2015, నవంబరు-23వ తేదీనాడు పరమపదించారు. [8]
మూలాలు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-6; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-31; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-12; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-16; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-18; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-3; 3వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-28; 39వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-24; 40వపేజీ.