రావి శోభనాద్రి చౌదరి
రావి శోభనాద్రి చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గానికి 1985-89,[1] 1994-99[2] కాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.[3]
బాల్యం
మార్చుఆయన 1924, మార్చి 24వ తేదీన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో రావిభద్రయ్య, మాణిక్యం దంపతులకి జన్మించాడు.
కుటుంబం
మార్చుఈయన భార్య విమలాంబ కొద్ది సంవత్సరాల క్రితం మరణించారు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు హరగోపాల్ 1999 ఎన్నికల్లో గెలుపొందినా ప్రమాణస్వీకారం చేయకముందే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండో కుమారుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడో కుమారుడు శివరామకృష్ణ కూడా హరగోపాల్ మరణించిన ఏడాది లోపే కారులో రైలుగేటు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.
జీవిత విశేషాలు
మార్చువామపక్ష భావాలు గల ఆయన నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు కమ్యూనిస్ట్ సానుభూతిపరునిగా ఉన్నాడు. అప్పట్లో పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసును గుడివాడ రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహించాడు. అనంతరం 1984లో టీడీపీలో చేరాడు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టాడు. 1999 ఎన్నికల్లోనూ విజయం సాధించి మొత్తం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సేవలందించాడు. గుడివాడ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా 25సంవత్సరాలు ఏకధాటిగా కొనసాగాడు. ముక్కుసూటితనం, రాజకీయాల్లో నైతికత, నిజాయితీలకు పెద్దపీట వేస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. [4]
అతడు 2018 ఏప్రిల్ 13 న తుదిశ్వాస విడిచాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985".
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1994". Archived from the original on 2016-09-05. Retrieved 2018-04-14.
- ↑ "గుడివాడ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 2018-04-13. Retrieved 2018-04-14.
- ↑ "సీనియర్ నేత రావి శోభనాద్రి కన్నుమూత". Archived from the original on 2018-04-15. Retrieved 2018-04-14.
- ↑ "Former TDP MLA Ravi Sobhanadri passes away". The Hans India. Retrieved 2018-04-14.