గుంటూరు కారం

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించి, దర్శకత్వం వహించిన చిత్రం

గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించి, దర్శకత్వం వహించిన, హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన భారతీయ తెలుగు-భాష ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం. ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల, జగపతి బాబు నటించారు.

Guntur Kaaram
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రం శ్రీనివాస్
నిర్మాతఎస్.రాధాకృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంపి.ఎస్.వినోద్
కూర్పునవీన్ నూలి
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్
విడుదల తేదీ
13 జనవరి 2024 (2024-01-13)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్150 కోట్లు[1]
బాక్సాఫీసు₹250 కోట్లు[2]

ఈ చిత్రం 2021 మేలో SSMB28 అనే తాత్కాలిక పేరుతో అధికారికంగా ప్రకటించబడింది, ఎందుకంటే ఇది ప్రధాన నటుడిగా మహేష్ బాబు 28వ చిత్రం. 2023 మే 31న చిత్ర అధికారిక టైటిల్‌ను గుంటూరు కారం అని వెల్లడించారు. చిత్రీకరణ 2022 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. నేపథ్య సంగీతం, పాటలను థమన్ ఎస్ స్వరపరిచారు, సినిమాటోగ్రఫీ పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి నిర్వహించారు.

గుంటూరు కారం 2024 జనవరి 13న సంక్రాంతితో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు: రామజోగయ్య శాస్త్రి

సం.పాటగాయకులుపాట నిడివి
1."దమ్ మసాలా"సంజిత్ హెగ్డే , జ్యోతి నూరన్3:26
2."ఓ మై బేబీ"శిల్పా రావు2:36
3."కూర్చి మడతపెట్టి[4]"సాహితీ చాగంటి, శ్రీ కృష్ణ3:36
మొత్తం నిడివి:9:47

మూలాలు

మార్చు
  1. "Mahesh Babu Charges A Huge Amount For Trivikram's Next To Be Made On A Budget Of Rs 200 Cr". MensXP. 2 June 2022.
  2. "Guntur Kaaram Box Office". Box Office Adda. 14 January 2024. Retrieved 28 January 2024.
  3. A. B. P. Desam (4 January 2024). "'గుంటూరు కారం'లో రెండో హీరోయిన్ లుక్ - రమణతో రాజీని చూశారా?". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  4. Eenadu (7 January 2024). "ఎవరి బాధలకు ఆడే లిరిక్‌ రైటరు". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.

బయటి లింకులు

మార్చు