టక్ జగదీష్
టక్ జగదీష్ 2021లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. నాని పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 23న చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.[1] టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు.[2]
టక్ జగదీష్ | |
---|---|
దర్శకత్వం | శివ నిర్వాణ |
రచన | శివ నిర్వాణ |
నిర్మాత | సాహు గారపాటి, హరీశ్ పెద్ది |
తారాగణం | నాని, జగపతిబాబు, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | షైన్ స్క్రీన్స్ |
విడుదల తేదీ | 10 సెప్టెంబరు 2021 |
సినిమా నిడివి | 146 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమా 2021 సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదయింది
తారాగణం
మార్చు- నాని - జగదీష్ నాయుడు
- రీతు వర్మ - గుమ్మడి వరలక్ష్మి[3]
- ఐశ్వర్య రాజేష్ - చంద్ర
- జగపతి బాబు - బోసు బాబు
- నాజర్ - ఆదిశేషు నాయుడు
- మాల పార్వతి - అర్జునమ్మ
- జయప్రకాష్
- డేనియల్ బాలాజీ - వీరేంద్ర [4]
- తిరువీర్ - తిరుమల నాయుడు
- ఆడుకలం నరేన్ - సోమరాజు
- రఘుబాబు - సూర్యనారాయణ
- రోహిణి - కుమార అక్క
- వైష్ణవి చైతన్య- నీలవేణి
- దేవదర్శిని - గంగ భవాని
- విజయ నరేష్ - సత్తి బాబు
- రావు రమేశ్ - దేవుడు బాబు
- ప్రవీణ్ - సాయి
- భద్రం
- బిందు చంద్రమౌళి - జ్యోతి
- బేబీ సిదిక్ష - నిత్య
పాటల జాబితా
మార్చుఇంకోసారి ఇంకోసారి , రచన: చైతన్య ప్రసాద్ గానం.శ్రేయాఘోషల్, కాలభైరవ
కోలో కోలన్న కోలో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.అర్మన్ మాలిక్, శ్రీకృష్ణ , హరిణి ఇవటూరీ
నీటి నీటి చుక్క , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.మోహన భోగరాజు
టక్ సాంగ్, రచన: శివ నిర్వాణ , గానం.శివ నిర్వాణ
ఏటికొక్కపూట , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.మోహనభోగరాజు
నీదినాదనుంట్ రచన: కళ్యాణ చక్రవర్తి, గానం.శ్రీకృష్ణ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్
- నిర్మాతలు: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ
మూలాలు
మార్చు- ↑ Eenadu. "'టక్ జగదీష్' విడుదల వాయిదా - due to present situations we decided to postpone tuckjagadish". www.eenadu.net. Archived from the original on 15 April 2021. Retrieved 20 April 2021.
- ↑ "#InkosaariInkosaari Lyrical | Tuck Jagadish Songs | Nani, Ritu Varma | Shiva Nirvana | Thaman S". Youtube. 12 February 2021. Retrieved 2021-02-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Telangana Today (26 December 2020). "Nani looks intense in 'Tuck Jagadish' first look". Telangana Today. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.