ప్రధాన మెనూను తెరువు

రేకందార్ గుణవతి ప్రముఖ రంగస్థల నటి.

రేకందార్ గుణవతి
జననంఆగష్టు 22, 1964
నర్సింగరావుపల్లి, విశాఖపట్టణం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
తండ్రివనారస బాబూరావు
తల్లిసత్యనారాయణమ్మ

జననంసవరించు

1964, ఆగష్టు 22విశాఖపట్టణం జిల్లా, నర్సింగరావుపల్లి లో శ్రీమతి వనారస సత్యనారాయణమ్మ, వనారస బాబూరావు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానంసవరించు

బాలపాత్రల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టింది.

సతీ అనసూయ లో (గంగ, పార్వతి, అనసూయ) శ్రీకృష్ణ లీలలు లో (దేవకి, మాయపూతన), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, కలహకంఠి), మాయాబజార్ లో (కృష్ణుడు, సుభద్ర, సత్యభామ, శశిరేఖ), సావిత్రిలో (సావిత్రి), గుణసుందరిలో (హేమసుందరి), కాంతామతిలో (కాంచనమాల), పాతాళభైరవి లో (నళిని), బొబ్బిలియుద్ధం లో (చిన వెంకటరావు), బాలనాగమ్మ లో (మాణిక్యాలదేవి, లచ్చి, సంగు), భూకైలాస్ లో (పార్వతి), లవకుశ లో (భూదేవి, లచ్చి, కుశుడు), విక్రమార్కలో (ప్రమద), కనకతార లో (తార), ప్రహ్లదలో (లీలావతి), విశ్వనాథ విజయంలో (శ్రీకృష్ణ దేవరాయలు), తులాభారంలో (సత్యభామ), చింతామణి లో (చింతామణి), బ్రహ్మంగారి చరిత్రలో (వనకన్య, ఎరుకలసాని), రంగూన్ రౌడీ లో (అన్నపూర్ణ కుమారుడు-గిరికుమారి), చెంచులక్ష్మి లో (లీలావతి), ముగ్గురు మరాఠీలు (రుక్కురాణి-రఘు) మొదలైన పాత్రలలో నటించింది.

మూలాలుసవరించు

  • రేకందార్ గుణవతి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 35.