చిల్లర భావనారాయణరావు

చిల్లర భావనారాయణరావు కవి, నాటక, నాటిక, సినీ రచయితగా సుప్రసిద్ధుడు.

చిల్లర భావనారాయణరావు
జననంచిల్లర భావనారాయణరావు
(1925-08-06)1925 ఆగస్టు 6
India బాపట్ల పట్టణం, గుంటూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2010 జనవరి 22
హైదరాబాదు
వృత్తితెలుగు పండితుడు
ప్రసిద్ధినాటక రచయిత, సినీ రచయిత, ఆధ్యాత్మిక రచయిత
మతంహిందూ
భార్య / భర్తనందిరాజు ఇందిర
తండ్రిచిల్లర పున్నయ్యశర్మ
తల్లిరంగనాయకమ్మ

జీవిత విశేషాలుసవరించు

చిల్లర భావనారాయణరావు గుంటూరుజిల్లా బాపట్లలో 1925వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ పున్నయ్యశర్మ, రంగనాయకమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు[1]. ఇతడు బాల్యంలోనే గద్వాలలో స్థిరపడ్డాడు. గద్వాల సమీపంలోని దాసరిపల్లి గ్రామంలో వీధిబడిలోనూ, గద్వాల హైస్కూలులోను 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాదులు చదువుకున్నాడు. పాఠశాలలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి ఇతనికి గురువు. ఉర్దూలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. 1944లో అన్నగారి వద్దకు హైదరాబాదుకు మకాం మార్చాడు. మిలటరీ ఆర్డినెన్స్ డిపోలో కొంతకాలం పనిచేసి తరువాత రైల్వేలో 16 సంవత్సరాలు టి.టి.గా పనిచేశాడు. 1947లో నందిరాజు ఇందిరతో ఇతడికి వివాహం జరిగింది. ఎం.ఎ., బి.ఒ.ఎల్. పట్టాలు పొంది సికిందరాబాదులో ఉన్న వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగుపండితునిగా కొంతకాలం పనిచేశాడు. 1972లో మద్రాసులోని ముత్యాలపేట ఉన్నతపాఠశాలలో, 1973లో మద్రాసు క్రిస్టియన్ కాలేజీ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసి 1984లో పదవీ విరమణ చేశాడు. పదవీ విరమణ తరువాత హైదరాబాదులో స్థిరపడి ఆధ్యాత్మిక రచనలపై దృష్టి సారించాడు. ఇతడు 2010, జనవరి 22న మరణించాడు.

సాహిత్య సేవసవరించు

బాల్యంలో గద్వాల ఆస్థాన పండితులు నిర్వహించిన పండిత సభల ప్రభావం ఇతడిపై బాగా పనిచేసింది. ఇతడు అనేక నాటకాలు, నవలలు, కథలు, కథానికలు రచించాడు. ఇతని రచనలు మీజాన్, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 1948లో మిత్రులతో కలిసి నవ్యకళాసమితిని స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా తను వ్రాసిన నాటకాలను తెలంగాణా ప్రాంతమంతా వందలాది ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. దక్కన్ రేడియో, ఆకాశవాణిలలో వందలాది నాటికలను రచించి ప్రసారం చేశాడు. 1968లో సినిమా రంగంలో ప్రవేశించి పేదరాశి పెద్దమ్మ కథ, లక్ష్మీ కటాక్షం, సుగుణసుందరి కథ, రాజకోట రహస్యం, పాతాళనాగు, లక్ష్మీ పూజ, శ్రీ సంతోషిమాతా వ్రత మహత్యం, సీతారామ వనవాసం, విక్రమార్క విజయం, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం మొదలైన సినిమాలకు కథ, మాటలు, పాటలు అందించాడు.

భక్తి సాహిత్యంసవరించు

  1. శ్రీ షిరిడీ సాయి భాగవతం
  2. శ్రీ దత్తాత్రేయ చరిత్రం
  3. ఉపనిషత్కథా భారతి
  4. బాసర సరస్వతీ శతకం
  5. శ్రీ శ్రీనివాస పద్మావతీ పరిణయం
  6. శ్రీ వెంగమాంబ చరిత్ర
  7. శ్రీ వేంకటేశ్వర పారిజాత కుసుమాలు

నాటకాలు, నాటికలుసవరించు

  1. ఉమర్ ఖయ్యామ్[2]
  2. గుడిగంటలు[3]
  3. మట్టే బంగారం[4]
  4. కళాభిమాని
  5. దేశద్రోహం
  6. ఉప్పెన
  7. కామందు
  8. పరిణామం
  9. కొత్త మనిషి
  10. పదవులు-పెదవులు[5]
  11. శకుంతల [6]
  12. యోగి వేమన (చారిత్రక నాటకం)
  13. అగ్నిగుండెలు
  14. ఉయ్యాల చిలుకలు
  15. జీవనశిఖరం
  16. సెయింట్ పాల్
  17. శ్రీనాథమహాకవి కనకాభిషేకం
  18. వియ్యాలవారి కయ్యాలు
  19. కృష్ణవేణి

కథలుసవరించు

  1. అద్దెకొంప
  2. అబద్దమాడరాదు
  3. ఉద్యోగం
  4. గొడుగు
  5. భార్యా రూపవతీ శత్రుః
  6. సత్యన్నారాయణ వ్రతం

సినీగీతాలు[7]సవరించు

  1. శివ మనోరంజని వరపాణీ సర్వరాణీ కనవే జననీ కృప బూనీ - పేదరాశి పెద్దమ్మ కథ
  2. విజయా ధీరా రణవిక్రమా - విక్రమార్క విజయం
  3. జయజయ సుదాసార డిండీర నీహిర కర్పూర (శ్లోకం) - విక్రమార్క విజయం
  4. తులువా కూయకు విక్రమార్కుడవని (పద్యం) - విక్రమార్క విజయం
  5. విన్నారా ఓ జనులారా ఈ కథనూ విక్రమార్కుడు - విక్రమార్క విజయం
  6. గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల కల్పించితివి తల్లి - లక్ష్మీకటాక్షం
  7. ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా.. శ్రీమన్‌మహాసర్వ (దండకం) - లక్ష్మీకటాక్షం
  8. నాదు గురుదేవు కార్యార్ధినవుచు నేడు వచ్చితిని (పద్యం) - లక్ష్మీకటాక్షం
  9. సకల విద్యామయీ ఘనశారదేందురమ్య (పద్యం) - లక్ష్మీకటాక్షం
  10. జయ జయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి - లక్ష్మీకటాక్షం
  11. నా వయసు సుమగంధం నా మనసు - లక్ష్మీకటాక్షం
  12. శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్వె నూదగవద్దు - లక్ష్మీకటాక్షం
  13. స్వాగతం స్వాగతం క్షాత్రవజనజైత - లక్ష్మీకటాక్షం
  14. జో జో లాలి లాలి లాలీ చిన్నారి పాపాయి లాలి - లక్ష్మీకటాక్షం
  15. ఓ మంగళగౌరీ శివనారి కలలే ఫలియించునా నా కలలే - సుగుణసుందరి కథ
  16. ఓం నమో ఓం నమో శివ శివ భవహర మహాదేవ - సుగుణసుందరి కథ
  17. జయ జయ మహాదేవ మృత్యుంజయా జయ దివ్య - సుగుణసుందరి కథ
  18. లాహిరి మోహన లలన శృంగారపారీణా - సుగుణసుందరి కథ
  19. ఓ దయకర నీలనీరద శరీర (పద్యాలు) - పల్లెటూరి చిన్నోడు

పురస్కారాలుసవరించు

  1. కృష్ణవేణి నాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ప్రథమ బహుమతి
  2. శ్రీ సంతోషమాతా వ్రతమహాత్మ్యం చిత్రానికి ఉత్తమ పాటల రచయితగా, ఉత్తమ మాటల రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి అవార్డులు
  3. శ్రీ షిర్డీసాయి భాగవతం కావ్యానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం

బిరుదులుసవరించు

  • సహజ కవితా విలాస
  • సాయి తత్త్వ సందర్శన

కలంపేరుసవరించు

  • భారవి

మూలాలుసవరించు

  1. చిల్లర భవానీదేవి (2015). దృష్టి (తెలుగు నాటక రచయితల ప్రత్యేక సంచిక) (1 ed.). హైదరాబాదు: పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్. pp. 182–184.
  2. చిల్లర భావనారాయణరావు (1957). ఉమర్‌ఖయ్యాం. విజయవాడ: దేశికవితామండలి. Retrieved 7 April 2015.
  3. చిల్లర భావనారాయణరావు (1962). గుడిగంటలు. విజయవాడ: దేశి కవితామండలి. Retrieved 7 April 2015.
  4. చిల్లర భావనారాయణరావు (1962). మాటే బంగారం. విజయవాడ: దేశి కవితామండలి. Retrieved 7 April 2015.
  5. చిల్లర భావనారాయణరావు (1965). పదవులు పెదవులు. విజయవాడ: విశాలాంధ్ర ప్రచురణాలయం. Retrieved 7 April 2015.
  6. చిల్లర భావనారాయణరావు (1964). శకుంతల. అన్నపూర్ణ పబ్లిషర్స్. Retrieved 7 April 2015.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-19. Retrieved 2015-04-07.