లక్ష్మీ రావే మా ఇంటికి

నంద్యాల రవి దర్శకత్వంలో 2014లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

లక్ష్మీ రావే మా ఇంటికి 2014, డిసెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. నంద్యాల ర‌వి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ శౌర్య, అవికా గోర్ జంటగా నటించగా, కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు.

లక్ష్మీ రావే మా ఇంటికి
Lakshmi Raave Maa Intiki Movie Poster.jpg
లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా పోస్టర్
దర్శకత్వంనంద్యాల ర‌వి
రచననంద్యాల రవి
నిర్మాతగిరిధర్ మామిడిపల్లి
నటవర్గంనాగ శౌర్య
అవికా గోర్
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పురామాంజనేయులు
సంగీతంకె. ఎం. రాధాకృష్ణన్
విడుదల తేదీలు
2014 డిసెంబరు 5 (2014-12-05)
నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

లక్ష్మీ నిలయం సర్వేశ్ ఆనంద్ రావు (రావు రమేష్) కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు లక్ష్మీ (అవిక గోర్). అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉండే సర్వేశ్ రావు తన కుటుంబ సభ్యులను కూడా ఎంతో పద్దతిగా పెంచుతాడు. చదువు పూర్తి చేసుకొని జాబు తెచ్చుకున్న లక్ష్మీకి పెళ్లికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. బిటెక్ పూర్తిచేసి స్నేహితులతో జులాయిగా తిరిగే సాయి (నాగ శౌర్య) ఒకరోజు లక్ష్మీని చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే లక్ష్మీకి నిశ్చితార్ధం అయిపోయిందని తెలుసుకున్న సాయి, లక్ష్మీని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తుంటాడు. తన ప్రేమని సక్సెస్ చేసుకోవడానికి సాయి ఏం చేసాడు, లక్ష్మీ సాయిని ప్రేమించిందా, లక్ష్మీ – సాయి ఒకటయ్యారా అన్నది మిగతా కథ.[1]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించాడు. [3]

 • "దేవతల్లే" - (రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం: కె. ఎం. రాధాకృష్ణన్) - 3:45
 • "కాటుక దిద్దిన కాంచనమాల" - హేమచంద్రన్ - 3:58
 • "ఆ వెన్నెలదైనా" - కార్తీక్, సునీత ఉపద్రష్ట - 5:01
 • "ఎంత సొగసు చేరేనో" - గాయత్రి నారాయణ్ - 2:12
 • "రావ మా ఇంటిదాక" - దీపు - 4:10
 • "మనసులో ఉన్న ప్రేమ" - శ్రీకృష్ణ - 4:13
 • "అమ్మ కడుపు చల్లగా" - శ్రీదేవి - 2:13
 • "వేణుగాన లోలుడే" - సునీత - 2:12

నిర్మాణంసవరించు

2014 మే నెల వరకి చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. పాటలను కూర్గ్‌, పుదుచ్చేరిలో చిత్రీకరించారు. నాగశౌర్య, అవికా గోర్ లతోపాటు, రావు రమేష్, నరేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఈ చిత్రంలో ఉన్నారు.[4]

విడుదలసవరించు

టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[5][6]

మూలాలుసవరించు

 1. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.
 2. సాక్షి, సినిమా (3 December 2014). "'బొమ్మరిల్లు'లో...'ఇడియట్' కుర్రాణ్ణి!". Sakshi. Archived from the original on 7 July 2018. Retrieved 8 August 2020.
 3. "Lakshmi Raave Maa Intiki (2014)". Raaga. Archived from the original on 15 జనవరి 2021. Retrieved 8 August 2020.
 4. "Avika Gor gets busy in Tollywood". Deccan Chronicle. 4 May 2014. Retrieved 8 August 2020.
 5. Kumar, Hemanth (28 April 2016). "Lakshmi Raave Maa Intiki Movie Review {2/5}: Critic Review of Lakshmi Raave Maa Intiki". The Times of India. Retrieved 8 August 2020.
 6. Dundoo, Sangeetha Devi (5 December 2014). "Lakshmi Raave Maa Intiki: Wait, what was that?". Retrieved 8 August 2020 – via www.thehindu.com.

ఇతర లంకెలుసవరించు