లక్ష్మణ్ చదలవాడ (జననం 1985 అక్టోబరు 9) భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత. ఆయనను వృత్తిరీత్యా లక్ష్ చదలవాడ అని పిలుస్తారు. ఆయన వలయం (2020), గ్యాంగ్‌స్టర్ గంగరాజు (2021) వంటి చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందాడు. ఆయన 1994లో జీవిత ఖైదీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్రసీమలో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. 2003లో, ఆయన నీతో వస్తా చిత్రంతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఆయన యాక్షన్ థ్రిల్లర్ ధీర (2023)లో నటించిమెప్పించాడు [2][3][4][5]

లక్ష్ చదలవాడ
2019లో లక్ష చదలవాడ
జననం
లక్ష్మణరావు చదలవాడ

(1985-10-09) 1985 అక్టోబరు 9 (వయసు 38) [1]
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుశశికాంత్
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1994 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికిన్నెర రూపినేని చదలవాడ
తల్లిదండ్రులుశ్రీనివాసరావు చదలవాడ
పద్మావతి చదలవాడ

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆయన 1985 అక్టోబరు 9న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఒక తెలుగు వ్యాపార కుటుంబంలో జన్మించాడు.[6][7] ఆయన ఐదు సంవత్సరాల వయస్సులో వారి కుటుంబం హైదరాబాద్‌కు మారింది. ఆయన అక్కడే డిగ్రీ పూర్తిచేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2009లో సింగపూర్‌కు చేరాడు.

వ్యక్తిగతం మార్చు

2011లో సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చిన ఆయన కిన్నెరను వివాహం చేసుకున్నాడు. 2016లో వీరికి ఖ్యాతి చదలవాడ అనే కుమార్తె ఉంది.[8][9][10]

కెరీర్ మార్చు

జీవిత ఖైదీ (1994)తో ఆయన బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన రిక్షా రుద్రయ్య (1994), హెచ్చరిక (1997) వంటి చిత్రాలలో నటించాడు. కాగా 2003లో నీతో వస్తా (2003)లో ప్రధానపాత్రలో నటించాడు.[11] 2020లో వలయం, 2022లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు, 2023లో ధీర చిత్రాలలోనూ నటించాడు.[12][13]

ఆయన బిచ్చగాడు (2016)[14][15], పిల్ల రాక్షసి (2016), D16 - ఎవ్రీ డీటైల్ కౌంట్స్ (2017), టిక్ టిక్ టిక్ (2018)[16] వంటి అనేక డబ్బింగ్ చిత్రాలను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్(STTV Films) అనే నిర్మాణ సంస్థ ద్వారా అందించాడు.[17][18][19]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా భాష నటుడు/నిర్మాత మూలాలు
1994 జీవిత ఖైదీ తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్
1994 రిక్షా రుద్రాయ తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్
1997 హెచ్చరిక తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్
2003 నీతో వస్తా తెలుగు నటుడు [20]
2005 786 తెలుగు నటుడు [21]
2005 మేస్త్రీ - ఫర్ ది సొసైటీ తెలుగు నటుడు [22]
2006 శంకర్ తెలుగు నిర్మాత, నటుడు [23]
2020 వలయం తెలుగు నిర్మాత, నటుడు [24]
2022 గ్యాంగ్‌స్టర్ గంగరాజు తెలుగు నిర్మాత, నటుడు [25]
2023 ధీర తెలుగు నిర్మాత, నటుడు [26]

మూలాలు మార్చు

  1. "First-Look Motion Poster of Laksh Chadalavada-Starrer Dheera is Out". news18. 10 October 2022.
  2. "Laksh Chadalavada". The Times of India. 15 February 2023.
  3. "'Adharam Madhuram' Song from Laksh Chadalavada's 'Dheera' released on Valentine's Day". The Times of India. 15 February 2023.
  4. "Laksh Chadalavada's 'Dheera' pre-look released on the occasion of Vijaya Dashami". The Times of India. 6 October 2022.
  5. "Actor Laksh Chadalavada is all Set for Dheera". www.Outlookindia.com. 14 September 2022.
  6. "Dheera: ధీర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ లుక్‌లో లక్ష్ చదలవాడ". News18 Telugu. 9 October 2022.
  7. "Dheera Motion Poster". Official Youtube Channel of STTV Films. 9 October 2022.
  8. "Laksh Chadalavada". nettv4u.com.
  9. "'Dheera' First look unveiled on the occasion of Laksh Chadalavada's Birthday". The Times of India.
  10. "Laksh Chadalavada Interview". www.idlebrain.com. 22 June 2023.
  11. "Neetho Vastha Telugu Full Movie - Laksh Chadalavada". STTV Films. 20 July 2019.
  12. "Laksh's 'Gangster Gangaraju' to hit the screens on June 24". Telangana Today. 14 May 2022.
  13. "Actor Laksh Chadalavada is all Set for Dheera". outlookindia. 14 September 2022.
  14. "Laksh Chadalavada signs new project with director Vikranth Srinivas, film formally launched". www.ottplay.com. 15 December 2021.
  15. "Laksh Chadalavada Interview". www.idlebrain.com. 22 June 2023.
  16. "Digangana and Laksh Chadalavada's next is 'Valayam'". India Times. 2 October 2019.
  17. "LAKSHMANA RAO CHADALAVADA". zaubacorp.com.
  18. "Laksh is all set to prove himself once again with Gangster Gangaraju". Telanganatoday.com. 23 June 2022.
  19. "'Tik Tik Tik' censor done, final release date out". indiaglitz.com. 12 June 2018.
  20. "Neetho Vastha Telugu Full Movie - Laksh Chadalavada". STTV Films. 20 July 2019.
  21. "786 Khaidi Prema Katha Telugu Full Movie - Laksh Chadalavada - Hamsa Nandini". STTV Films.
  22. "Mestri Telugu Full Movie - Sashikanth, Neha, Poonam - Sri Balaji Video". SriBalajiMovies.
  23. "Shankar Telugu Full Movie - Laksh Chadalavada". STTV Films.
  24. "Digangana and Laksh Chadalavada's next is 'Valayam'". The Times of India. 2 October 2019.
  25. "Laksh Chadalavada's "Gangster Gangaraju" first look poster is out". The Times of India. 24 August 2021.
  26. "Laksh Chadalavada's 'Dheera' pre-look released on the occasion of Vijaya Dashami". The Times of India. 6 October 2022.