లింగోజిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
(లింగోజిపల్లి (కంభం మండలం) నుండి దారిమార్పు చెందింది)


లింగొజిపల్లి, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లింగోజిపల్లి
గ్రామం
పటం
లింగోజిపల్లి is located in ఆంధ్రప్రదేశ్
లింగోజిపల్లి
లింగోజిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°37′9.660″N 79°10′8.184″E / 15.61935000°N 79.16894000°E / 15.61935000; 79.16894000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకంభం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523370

గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం కంభం తర్లుపాడు మీదుగా పోవు మార్కాపురం రహదారిలో వచ్చును.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

ఈ గ్రామం లోని గ్రామస్థులు కులాలకు అతీతంగా శ్రీరామ నవమి, మొహరమ్ (పీర్ల) పండుగలు చాల బాగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీతా రామ కల్యాణం, హనుమ, గరుడ, రథోత్సవం, వసంతోత్సవం చాల ఘనంగా జరుప బడును. ఈ సందర్భంగా ఎడ్ల పొటీలు, ముగ్గుల పొటీలు, క్రికెట్, పరుగు, రకరకాల పొటీలు జరుపుదురు. ఆ సాయంత్రాలు విద్యుత్ దీపాలతో అలంకరణలు, సంగీత విభావరి, నృత్యాలు వంటి కార్యక్రమాలు ఉండును.

శ్రీ ఉపదేశరామస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో 2017,ఏప్రిల్-8వతేదీ శనివారంనాడు, స్వామివారి రథోత్సవం, విద్యుత్తు కాంతులమధ్య, కన్నులపండువగా నిర్వహించారు.

ప్రధాన పంటలు

మార్చు

గ్రామంలో వర్షాధార పంటలు అయిన ప్రత్తి, పొగాకు, కంది, శనగలు, మిరప వంటి పూర్తి వర్షాధార పంటలు పండును.

ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, మిలిటరీ, పోలీసు, వ్యవసాయదారులు, వ్యాపారులు, తాపీ మేస్త్రీలు గలరు.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామంలో ఎక్కువగా కమ్మ, ముస్లిం, కొద్దిగా శెట్టి, బ్రాహ్మణ కులస్తులు నివసిస్తారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు