లైమ్ ఆయిల్

(లైమ్‌ ఆయిల్ నుండి దారిమార్పు చెందింది)

లైమ్ ఆయిల్ లేదా పచ్చనిమ్మకాయ నూనె ఒక ఆవశ్యక నూనె, సుగంధ తైలం. లైమ్ ఆయిల్ ఔషధ గుణాలున్న నూనె.. లైమ్ ను మెక్సికన్ నిమ్మ, పశ్చిమ భారత నిమ్మ అని అంటారు.పుల్ల నిమ్మ అనికూడా అంటారు.లైం^ ఆసియా ప్రాంతానికి చెందినదైనప్పటికి, ఇతర వెచ్చని ప్రాంతాల్లో కూదా పెరుగును.లైమ్ చెట్టు రూటేసి కుటుంబానికి చెందిన మొక్క.లైమ్ చెట్టు వృక్షశాస్త్ర పేరు సిట్రస్ ఆరంటి ఫోలియా.

పూలు
పళ్లు
లైమ్‌ ఆయిల్

లైమ్‌/పచ్చ నిమ్మ చెట్టు

మార్చు

లైమ్ /పులుపు నిమ్మ ఆసియా ప్రాంతానికి చెందినది, అయిననూ వెచ్చని వాతావరణం వున్న ఇటలీ, వెస్ట్ఇండీస్, అమెరికా దేశాల్లో కూడా పెరుగును. ఇది సతతహరిత చెట్టు. 45 మీటర్ల (15 ఆడుగులు) ఎత్తు పెరుగును. ఆకుపచ్చిని నున్నని ఆకులను కల్గి వుండును. బిరుస్గా వుండే చిన్నని ముళ్లు వుండును.[1] పళ్ళు అండాకారంలో వుండును. నారింజ చెట్టాకన్న తక్కువ పరిమాణంలో వుండును. లైమ్ లో చాలా రకాలున్న ప్రధానమైనవి మెక్సికన్ లైమ్ (key lime), తహితి/Tahiti లైమ్ (పెర్సియన్ లైమ్).ఆగ్నేయ ఆసియా నుండి ఈ చెట్టు ఈజిప్టు, ఆఫ్రికాకు వ్యాప్తిచెందినది.[2]

నూనె సంగ్రహణం

మార్చు

చిన్నపచ్చ నిమ్మ నుండి రెండు రకాలుగా నూనెను సంగ్రహిస్తారు. ఒకటి కోల్డ్ ఎక్స్ప్రెసన్, మరొకటి స్టీము డిస్టిలేసను పద్ధతి. పక్వానికిరాని పళ్ల తొక్కల నుండి కోల్డ్ ఎక్సుప్రెసన్ ద్వారా లేదా తొక్కాల నుండి లేదా పండిన మొత్తం పండు నుండి ఆవిరి స్వేదన క్రియ/ స్టీము డిస్టిలేసను ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు.కోల్డ్ ఎక్సుప్రెసన్ ద్వారా తీసిన నూన్ పోటో టాక్సిక్ (ఎండ, వెలుతురు తగిలిన విష ప్రభావం కనపరచు) గుణం కల్గి వుండగా, స్టీము డిస్టిలేసను ద్వారా తీసిన నూనెలో పోటో టాక్సిక్ ప్రభావం వుండదు.[1]

లైమ్‌ ఆయిల్

మార్చు

లైమ్‌ నూనె నిమ్మ వంటి వాసనతో, పాలిపోయిన పసుపు లేదా ఒలివ్ రంగులో వుండును. పచ్చనిమ్మనూనెను కోలాపానీయాల్లో కమ్మఁదనము కై చేర్చుతారు. పరిమళ ద్రవ్య పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.

లైమ్‌ ఆయిల్ ఔషధ గుణాలు

మార్చు

లైమ్‌ ఆయిల్ యాంటి సెప్టిక్, యాంటి వైరల్, సంకోచశీలగుణం, ఆకలిని పుట్తించే గుణం, బాక్టిరిసిడల్, సంక్రమణ నిరోధకం కల్గినది.

నూనెలోని రసాయన పదార్థాలు

మార్చు
 
లిమోనెన్
 
సబినెన్

లైమ్ నూనెలో చాలా రసాయన పదార్థాలు వున్నప్పటికి వాటిలో కొన్ని ప్రధానమైనవి ఆల్ఫా-పైనేన్న్ బీటా పైనేన్, మైర్సేన్, లిమోనేన్,1,8-టెర్పినోలేన్, లినలూల్, బోర్నీయోల్, సిట్రాల్ లు . నేరాల్ అసిటెట్,, జెరానైల్ అసిటెల్ తక్కువ ప్రామాణంలో వున్న ప్రధాన రసాయన పదార్థాలు.[1] ప్రధానమైనవి ఆల్ఫా పైనెన్, బీటా పైనేన్, సబినెన్, మైర్సేన్, లిమోనెన్, y-టెర్పినేన్, టెర్పినోలెన్, ఆక్టానాల్, నోనానాల్, టెట్రాడేకనాల్, పెంటా డేకనాల్, ట్రాన్స్-బెర్గప్టెన్, కారియో పీల్లెన్, బీటా బిసబోలెన్, జెరానియోల్, జెరానైల్ అసిటెట్, అల్ఫాటెర్పినోల్, లినలూల్.[3]

లైమ్‌ ఆయిల్ లోని కొన్ని ప్రధాన రసాయనాల శాతం పట్టిక[4]

వరుస సంఖ్య రసాయన సమ్మేళనం శాతం ఔషధ గుణం
1 లిమోనెన్ 65.4 క్యాన్సరు నిరోధకం, యాంటీ ఆక్సిడెంట్,.కేమో ప్రివెంటివ్
2 బీటా-పైనేన్ 11.2 యాంటి డేప్రెసెంట్, యాంటి బాక్టీరియాల్, యాంటీ మైక్రో బియల్, సైటో టాక్సిక్
3 గామా టెర్పినేన్ 10.2 రెఫ్రేసింగ్, యాంటి ఆక్సిడెంట్,
4 జెరానియల్ 2.3 యాంటి మైక్రోబియల్, క్రీమి కీటక సంహరిణి
5 సబినేన్ 2.1 యాంటి మైక్రోబియల్, యాంటిసెప్టిక్,
6 ఆల్ఫా పైనేన్ 2.0 శ్వాస కోశనాళాలనసవిస్తరణ/వ్యాకోచం.యాంటి ఇన్ఫ్లమెటరి

లైమ్‌ ఆయిల్ భౌతిక గుణాలు

మార్చు

లైమ్‌ ఆయిల్ భౌతిక గుణాల పట్టిక[5]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 రంగు పసుపు
2 విశిష్ట గురుత్వం 0.855-0.863
3 వక్రీభవన సూచిక 1.474-1.477

ముందు జాగ్రత్తలు

మార్చు

కోల్డ్ ఎక్సుప్రెసన్ ద్వారా తీసిన నూనె వలన ఎక్కువ సూర్య కాంతివలన చర్మం పై ఇరిటేశన్ (ప్రకోప గుణం) కలుగ వచ్చును.[1]

ఉపయోగాలు

మార్చు
  • మొటిమలు, జలుబు, గొంతు వాపు (గొంతునొప్పి) తగ్గించును.[3]
  • దగ్గును తగ్గించును.శ్వాసకోశ రుగ్మతలు తగ్గించును.
  • లైమ్ నూనెను ఆకార, బేవరేజి (పానీయాల) పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా గృహలలో క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. డెటెర్జెంట్ సబ్బుల్లో ఉపయోగిస్తారు. అలాగే సబ్బుల్లో,, సౌందర్య ద్రవ్యాలలో ఉపయోగిస్రారు. ఆరోమా థెరపిలో కూడా లైమ్ ఆయిల్ నూ ఉపయోగిస్తారు.[2]

బయటి వీడియో లింకు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Lime essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-04-02. Retrieved 2018-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "If You Love Lime, Try Lime Oil". articles.mercola.com. Archived from the original on 2018-01-24. Retrieved 2018-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "Lime Essential Oil". aromaweb.com. Archived from the original on 2018-02-19. Retrieved 2018-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Lime Essential Oil". ayurvedicoils.com. Archived from the original on 2018-02-11. Retrieved 2018-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Citrus aurantifolia". nowfoods.com. Archived from the original on 2017-07-12. Retrieved 2018-10-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)