వడలి రాధాకృష్ణ
వడలి రాధాకృష్ణ [1] ఒక తెలుగు కథా రచయిత
వడలి రాధాకృష్ణ | |
---|---|
జననం | వడలి రాధాకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ |
నివాస ప్రాంతం | చీరాల , ప్రకాశం జిల్లా |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత |
మతం | హిందువు |
రచయిత పరిచయం
మార్చు- పేరు:వడలి రాధాకృష్ణ
- విద్యార్హతలు:ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
- ఉద్యోగం: ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం.
రచనలు
మార్చుసుమారు 250 కథలు, 200 పైగా కవితలు అన్ని ప్రముఖ పత్రికలు, సంకలనాలలో ప్రచురితము. ప్రచురించిన పుస్తకాలు:'జీవనది', 'గూటిపడవ', 'మనసు మూలల్లోకి' కథా సంకలనాలు, 'జలఖడ్గం' కవితా సంకలనం', అంతర్నేత్రం' కథల సంపుటి, 'వట్టివేళ్ళు' నానీల సంపుటి మొదలైన వాటిని ప్రచురించి పలువురు ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు.
పొందిన పురస్కారాలు
మార్చు- క్షీరపురి సాహితీ సాంస్కృతిక సంస్థ, (పాలకొల్లు) వారు 'క్షీరపురి' విశిష్ట సాహితీ పురస్కారంతో,
- వెలది వెంకటేశ్వర్లు యువచైతన్య విజ్ఞానవేదిక, ఒంగోలువారి సాహితీ పురస్కారం,
- లక్కోజు కనకదుర్గాచార్యులు సాహితీ సంస్థ, విజయవాడ వారి సాహితీ సత్కారం.
- డా|| వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీ పురస్కారం - 2007,
- సోమేపల్లి సాహితీ పురస్కారం-2007
- కుర్రా కోటిసూరమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం - 2008,
- పోగుల వెంకటరత్నమ్మ స్మారక విశిష్ట పురస్కారం,
- ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్నం) వారి జి.ఉమాకాంతం, అన్నపూర్ణమ్మ స్మారక సాహిత్య ప్రతిభాపురస్కారం అందుకున్నారు.
వీరి సాహితిసేవకు ప్రతిభకు గుర్తింపుగా * పి.ఎం.కె.ఎఫ్ సంస్థ (ఒంగోలు) వారు 'కవిమిత్ర ' బిరుదుతో
- 'సెట్ ' సంద్థ (చీరాల) వారు 'సాహితీ మిత్ర ' బిరుదుతో
- శ్రీ చైతన్య భారతి సాహితీ సమాఖ్య (మార్కాపురం) వారు 'కథావిరంచి ' బిరుదుతో
- భావతరంగిణి (మచిలీపట్నం) వారు 'కథారత్న' బిరుదు ప్రదానం చేసి గౌరవించారు
- గుఱ్రం జాషువా కళా సమితి, దుగ్గిరాలవారి 'కథాప్రపూర్ణ ' బిరుదు ప్రధానం.
- కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లువారి 'కథాసుధానిధి ' బిరుదు,
- ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లా వారు 'భావ కవిత భారతి' బిరుదు ప్రదానం చేశారు.
- విశ్వభారతి (ఒంగోలు) వారిచే 'కథా బ్రహ్మ' బిరుదు ప్రధానం వంటి అనేక సత్కారాలు పొందారు.
ముఖ్యమైన ఘట్టాలు
మార్చు'జీవనది ' కథా సంపుటి బులుసు సీతాకుమారి సాహితీ ఫౌండేషన్, మచిలీపట్నంవారి విశిష్ట సాహితీ పురస్కారం 2004కు ఎంపిక అయినది...'అంతర్నేత్రం ' కథల కథల సంపుటికి 'జగన్నాధ సాహితీ సమాఖ్య - నల్లజర్ల' వారి పురస్కారం లభించింది.
- ఆరాధన సాహితీ సంస్థ, హైదరాబాద్‌వారి కథల పోటీలో 'శ్వేతసౌధం' అనే కథకు, పులికంటి సాహితీ సంస్కృతి, తిరుపతివారి కథలపోటీలలో 'రేపు ' అనే కథకు, అమ్మ, బాపుపత్రికలు, విజయవాడవారు నిర్వహించిన కథల పోటీలలో 'ముసుర ' అనే కథకు బహుమతి లభించడం. భావతరంగిణి, మచిలీపట్నం వారి కథల పాటీలలో 'మృగమానవి' కథకు ప్రథమ బహుమతి.
- 2007 సోమేపల్లి హనుమంతురావు స్మారక కథల పోటీలలో 'నింగినీడలు' కథకు, మళ్ళి 2017 లో 'నిమజ్జనం' కథకు రెండు సార్లు సోమేపల్లి సాహితీ పురస్కారం.
- ధ్యానమాలిక పత్రిక, విజయవాడవారి కథల పోటీలలో అనంతం కథకు, బిట్రగుంట అప్పారావు స్మారక కథల పోటీలలో 'మగతమనుషులు' కథకు బహుమతి లభించాయి.
- జీవనది కథా సంకలనంపై నాగార్జున విశ్వవిద్యాలయం, డిపార్టుమెంట్ ఆఫ్ తెలుగు విద్యార్థి పెదలంక సుధాకరబాబు, M.Phill. చేసారు.
'వడలి రాధాకృష్ణ - కవితానుశీలన' అన్న అంశమీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితి పీఠం రాజమండ్రి, పరిశోధక విద్యార్థి బొంతా రమేష్, M.Phil. పూర్తి చేశారు.
- నాగార్జున యూనివర్సిటీకి చెందినా అధ్యాపకులు జ్యోతీస్వరనాయుడు ప్రొఫెసర్ తేళ్ళ సత్యవతి పర్యవేక్షణలో 'వడలి రాధాకృష్ణ రచనలు' అనే అంశంపై PHD చేస్తున్నారు.
నిర్వహిస్తున్న పదవులు
మార్చు- 'సహజ సాహితి' చీరాల వ్యవస్థాపక అధ్యక్షులు
- -జిల్లా అధికార భాషా సంఘం మెంబరుగా ప్రకాశం జిల్లా కలెక్టరుచే నియామకం.
- ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు కార్యనిర్వాహక వర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబరు,
- సాహితీ స్రవంతి, చీరాలలో అదనపు కార్యదర్శి.
- క్షీరపురి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనానికి ఉపాద్యక్షుడు
- ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా శాఖ ఛైర్మన్.
సూచికలు
మార్చుబయటి మూలాలు
మార్చు- ఈ లింకు [1] చూడండి.