వరకవుల నరహరిరాజు
వరకవుల నరహరిరాజు, తెలంగాణకు చెందిన నాటక రచయిత, దర్శకుడు, సంగీతకారుడు. జనతా సేవా సమితి అనే కళా సంస్థను స్థాపించి ఆ సంస్థ ఆధ్వర్యంలో తన రచన, దర్శకత్వంలో అనేక నాటక ప్రదర్శనలు చేశాడు.[1]
వరకవుల నరహరిరాజు | |
---|---|
జననం | |
వృత్తి | నాటక రచయిత, దర్శకుడు, సంగీతకారుడు. |
జీవిత భాగస్వామి | పరమేశ్వరమ్మ |
పిల్లలు | ఒక కుమార్తె (వనజమ్మ), ఇద్దరు కుమారులు (మార్కేండేయ రాజు, దుర్వాస రాజు) |
తల్లిదండ్రులు | వీరభద్ర రాజు - సుగుణమ్మ |
జననం
మార్చునరహరిరాజు తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ పట్టణంలో జన్మించాడు. తండ్రి వీరభద్ర రాజు, తల్లి సుగుణమ్మ.
వ్యక్తిగత జీవితం
మార్చునరహరిరాజుకు పరమేశ్వరమ్మతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (వనజమ్మ), ఇద్దరు కుమారులు (మార్కేండేయ రాజు, దుర్వాస రాజు) ఉన్నారు.[1]
రచనాప్రస్థానం
మార్చుగ్రామీణ భాషలోనే తన రచనలు చేశాడు. సుమారు 200 పద్యాలతో 'జర్ర ఇనుకోండ్రీ మా నాయ్న' అనే పద్య కావ్యాన్ని రాయగా, మంచి గుర్తింపు వచ్చింది. 'కసిరెడ్డి కలలో సరస్వతి' పేరుతో కావ్యభాషలో ఓ పుస్తకం రాశాడు.[2]
- అచ్చయినవి: స్నేహసుధ, సుత్తభారతి, కరుణభారతి, షిరిడీసాయి శతకం, మారుతి శతకం, విరాట్ బ్రహ్మంగారి పద్య నాటకం, కలి నిగ్రహాం, వివేకానంద, భువన విజయం
- అచ్చుకానివి: చీకుముల్లు, ఏకాదశి మహాత్యం, శివపార్వతి కళ్యాణం, తెలుగు కందం ముక్తకాలు, అభినవ పడక దృశ్యం, స్వామి దయానంద, లలిత గేయాలు లఘు కృతులు
నాటకరంగం
మార్చు1974 నుంచి నాటకరంగంలో ఉంటూ ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. తొలినాళ్ళలో దివాకర్ల వెంకటావధాని, కందుకూరి నారాయణల దగ్గర నాటకరంగంలో శిక్షణ పొందాడు. హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసి, అనేకమందికి నాటకరంగంలో శిక్షణ అందించాడు. మిత్ర కళామండలి, మహబూబ్‌నగర్ ఆర్ట్స్ థియేటర్, శారదానికేతన్, వేంకటేశ్వర కళానికేతన్ వంటి కళా సంస్థలను ఏర్పాటుచేశాడు.
- రాసిన నాటకాలు: అభినవ కురుక్షేత్రం, భువన విజయం, స్వామి వివేకానంద, శ్రీవిరాట్ వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శివపార్వతి కళ్యాణం, విప్రనారాయణ, కలి విగ్రహం, శ్రీకృష్ణార్జున విలాపం,[3] అన్నమాచార్య,
- దర్శకత్వం చేసినవి: సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, శ్రీకృష్ణరాయబారం, కురుక్షేత్రం, రామానంజనేయ యుద్ధం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, చింతామణి, తులాభారం, శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం, కాళహస్తీశ్వర మహాత్యం, శ్రీకృష్ణార్జున విలాపం అన్నమాచార్య[4]
పురస్కారాలు
మార్చునరహరిరాజు నాటకరంగంలో అనేక బహుమతులు, పురస్కారాలు అందుకున్నాడు. వాటిలో కొన్ని:[1]
- ఉత్తమ నాటక రచయిత విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[5]
- వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారం (2014)
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ గిరిజాశంకర్‌చే పురస్కారం (2014)
- ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిచేతుల మీదుగా పురస్కారం (2007)
- ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా పురస్కారం (2007)
- పద్య నాటకోత్సవాల్లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే ప్రత్యేక పురస్కారం (2001)
- కలెక్టర్ రేమాండ్ పిటర్‌చే కళానీరాజన పురస్కారాలు (1996)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "లేచింది మొదలు లేడి పరుగులే | అంకురం | www.NavaTelangana.com". NavaTelangana. 2015-07-07. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.
- ↑ "కాళన్న బాటలో కదిలిండ్రు కవులు". EENADU. 2022-09-09. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.
- ↑ "అలరించిన శ్రీకృష్ణార్జున విలాపం పౌరాణిక నాటకం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-11-27. Archived from the original on 2021-11-27. Retrieved 2022-09-18.
- ↑ "పద్య నాటకం.. పౌరాణిక పరిమళం". Sakshi. 2017-01-28. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-18.