పడిగే ప్రశాంత్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

పడిగే ప్రశాంత్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --కె.వెంకటరమణచర్చ 09:17, 29 ఏప్రిల్ 2017 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 09:17, 29 ఏప్రిల్ 2017 (UTC)Reply

భూసేకరణ చట్టం2013 మార్చు

2013 భూసేకరణ చట్టంలో ఏముంది? Posted On: పడిగే ప్రశాంత్

                    బ్రిటీషు ప్రభుత్వం 1894లో భూ సేకరణ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగానే దాదాపు 120 సంవత్సరాల పాటు మన దేశ పాలకవర్గాలు భూ సేకరణ చేశారు. బూజుపట్టిన ఈ చట్టాన్ని మార్చాలని వామపక్షాల, ప్రజాస్వామిక వాదుల సుదీర్ఘ పోరాట ఫలితంగా యుపిఎ-2 ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని తెచ్చింది. ఉన్న చట్టాలలో కొద్దోగొప్పో రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు కొంత ఊరటనిచ్చే విధంగా ఇది ఉంది. ఈ చట్టాన్ని ఉన్నదున్నట్లుగా అమలు చేసినా కొంత ప్రయోజనం ఒనగూుంతుంది. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం భూమి కావాల్సి వస్తే రెండు పంటలు పండే భూములు తీసుకోరాదు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన చట్టాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి అందులోని ముఖ్యమైన అంశాలను తొలగించాలని లోక్‌సభలో చట్ట సవరణ చేయడానికి పెట్టింది. అక్కడ నెగ్గినా రాజ్యసభలో బలం లేనందున ఉపసంహరించుకొని రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ ఆధారంగానే కార్పొరేట్ల ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు బలవంతంగా భూ సేకరణ చేయడానికి ఆగష్టు 31 అర్ధరాత్రి వరకు దొంగ చాటుగా నోటీసులు రోడ్ల వెంబడి విసిరేయించారు. కాలం చెల్లిన ఆర్డినెన్స్‌ ఆధారంగా ఆనాడు ఇచ్చిన నోటీసులతో నేటికీ రైతుల, పేదల ఆమోదంలేకుండానే భూ సేకరణ చేస్తున్నారు.

ప్రశ్నించిన వారందరిపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తోంది. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు, ప్రశ్నించే హక్కును కాలరాస్తోంది. ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు తమ అభివృద్ధి కోసం భూమి కావాల్సి వస్తే 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని, భూమి కోల్పోయిన రైతాంగం ఆమోదం, దీని మీద ఆధార పడిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిరు వ్యాపారు లకు చట్టంలో పొందుపర్చిన అన్ని హక్కులు కల్పించిన తరువాతనే భూ సేకరణ చేయాలని చట్టం చెబుతోంది. దీనికి విరుద్ధంగా రైతాంగం, పేదల నిరసనను పోలీసుల ద్వారా అణచివేయించి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తోంది. దీనివల్ల లక్షలాది రైతులు, కూలీలు, వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆహారధాన్యాల కొరత రానున్నది. కాబట్టి తక్షణమే బలవంతపు భూ సేకరణ ఆపాలి. 2013 భూ సేకరణ చట్టం ఆధారంగా భూ సేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ చట్టంలో ఏముందో ప్రజలందరూ తెలుసుకొని ప్రభుత్వ తప్పుడు ప్రచారానికి మోసపోకుండా తమ హక్కులను రక్షించుకోగలుగుతారని ఆశిస్తున్నాము. 2013 భూ సేకరణ చట్టంలో ఏముంది ? సెక్షన్‌ 4.1 ప్రకారం సామాజిక ప్రభావంపై అంచనా వేయాలి. ఇలా అంచనా వేసిన తర్వాత ఈ నివేదికను ప్రజల మధ్య ఉంచి, బహిరంగ విచారణ చేసి తెలియజెప్పాలి. ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లలో సమాచారం ఉంచి ఆయా కమిటీల ఆమోదం పొందాలి. ఇదంతా స్థానిక ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అధికా రులతో ఏడుగురు సభ్యులతో కమిటీ వేసి విచారించాలి. అయితే ప్రస్తుతం దానికి విరుద్ధంగా జరుగుతున్నది. సెక్షన్‌ 10.1 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగులో ఉన్న బహుళ పంటలు పండే భూమిని సేకరించరాదు. అనివార్యమైతే ఆ భూమికి బదులు ప్రత్యామ్నాయ భూమికి నీటి సౌకర్యం కల్పించి, ఆ భూమిని అభివృద్ధి చేసి ఆహార ధాన్యాల కొరత రాకుండా చూడాలి. అలాగే అధ్యాయం-1.2.బి ప్రకారం ప్రభుత్వం అభివృద్ధి అవసరాల కోసం భూమిని తీసుకుంటే 70 శాతం, ప్రయివేటు సంస్థలకైతే 80 శాతం బాధిత కుటుం బాలు ఆమోదిస్తేనే భూసేకరణ మొదలు పెట్టాలి. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన భూములైతే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకొని బదిలీ చేయరాదు. కానీ, ప్రభుత్వం ఎవ్వరితో సంప్రదించకుండా బాధితుల ఆమోదం లేకుండా నేడు భూమిని లాక్కుంటోంది. సెక్షన్‌- 3 ప్రకారం పట్టా భూములతో పాటు సేకరణ చేయదలిచిన భూమిలో భూమిలేని కూలీలు, కౌలుదారులు, వృత్తిదారులు ఎవరైనా సరే భూ సేకరణకు ముందు మూడు సంవత్సరాల పాటు భూమిపై ఆధారపడితే వారందరూ అర్హులుగా పరిగణింప బడతారు. అయితే అస్సైన్డ్‌ భూమి, ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వానివేనంటూ సాగుదార్లకు ఎటువంటి హక్కులు లేవని బోర్డులు పెట్టి, పంటలు నాశనంచేసి నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభిస్తున్నది. అధ్యాయం 4, సెక్షన్‌12(ఇ)ని అనుసరించి హక్కు దారుని అనుమతి లేకుండా సదరు భూమిలోకి వెళ్ళి ఎట్టి పనులూ చేయడానికి వీలులేదు. కనీసం సర్వే కూడా చేయ రాదు. అయితే నేడు దానికి భిన్నంగా యజమానులను పొలాల్లోకి రాకుండా అనేక చోట్ల కంచెవేసి అడ్డుకుం టున్నారు. సెక్షన్‌ 21(1) ప్రకారం సేకరించే భూముల హక్కుదారులకు కలెక్టర్‌ ద్వారా నోటీసులు నేరుగా నోటీసులు ఇవ్వాలి లేదా వారి దగ్గర బంధువులకు, అదీ కాకపోతే వారు నివాసముంటున్న ఇంటికి నోటీసులు అంటించాలి. వీటితోపాటు రెండు దిన పత్రికలలో ప్రకటనల రూపంలో అభ్యతరాలు తెలపమని చెప్పాలి. కానీ నేడు కనీసం భూ యజమానికి తెలియజేయకుండానే నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే సెక్షన్‌ 26(1) ప్రకారం భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా లేదా ఎక్కువ ధరకు అమ్ముడు పోయుంటే దాని ఆధారంగా నాలుగు రెట్లు అధికంగా ఇవ్వాలి. (మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు 1.25 శాతం, తెలంగాణ ప్రభుత్వం 1.50 శాతం అధికంగా ఇవ్వాలని నిర్ణయించాయి). పట్టణాభివృద్ధికైతే సేకరించిన భూమిలో అభివృద్ధి చేసి హక్కుదార్లకు 20 శాతం భూమి ఇవ్వాలి. పరిశ్రమల్లోనైతే 25 శాతం షేర్లు ఇవ్వాలి. సకాలంలో నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే 9 శాతం వడ్డీతో ఇవ్వాలి. భూమిసేకరించిన తర్వాత సంవత్సరం అయినా నష్టపరిహారం చెల్లించకపోతే ఆనాటి భూమి విలువ కట్టి ఇవ్వాలి. రాష్ట్రాలు ఇవి అమలు చేయకపోతే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని అమలుకోసం అధికారులను నియమిం చాలి. కానీ ప్రస్తుతం దానికి విరుద్ధంగా జరుగుతున్నది. అధ్యాయం 6 పునరావాసం-రీసెటిల్‌మెంట్‌లోని సెక్షన్‌ 45 ప్రకారం ప్రాజెక్ట్‌ కోసం 99 ఎకరాలు మించితే పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ కోసం బాధిత మహిళలు, స్వచ్ఛంద సంస్థ, జాతీయ బ్యాంకు అధికారి, స్థానిక సంఘాల ప్రతినిధి, ఎమ్యెల్యేతో కమిటీ వేసి బాధితులకు పరిహారం అందించాలి. దేనికి కొనుగోలు చేస్తారో, ఏ ఉద్దేశంతో భూమిని సేకరిస్తారో ప్రకటించాలి. సెక్షన్‌ 48 ప్రకారం ఆ భూమి వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుపోతే (ఉదాహరణకు ఉపాధి హామీ చట్టం) వాటిని నష్టపోకుండా చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇదేమీ పరిగణలోకి తీసుకోవడం లేదు. రాజధాని ప్రాంతంలో సాగుభూమి లేదు కాబట్టి ఉపాధి పనులు లేవని చెబుతోంది. సెక్షన్‌ 102ననుసరించి చట్టం ప్రకారం సేకరించిన భూమిని ఐదు సంవత్సరాలలోపు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోతే తిరిగి భూమి కోల్పోయిన వారికి గానీ, వారి వారసులకు గానీ ఇవ్వాలి. షెడ్యూల్‌ 2, సెక్షన్‌ 30(7) కింద ఇళ్ళు కోల్పోతే ఐఏవై క్రింద ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. పట్టణ ప్రాంతాలలోనైతే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. దీనికి బాధితులు ఆమోదించకపోతే ఒకేసారి రూ.1.50 లక్షలకు తగ్గకుండా ఎక్కువ ఎంతైనా ఇవ్వవచ్చు. సాగునీటి ప్రాజెక్టు క్రింద భూమి కోల్పోయిన చిన్నస్థాయి రైతు కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలి. ఎస్సీ,ఎస్టీలకైతే కోల్పోయిన భూమికి సమానంగా మరోచోట భూమి ఇవ్వాలి. ఇళ్ళు పోతే ఆ ఇంటి నిర్మాణ ఖర్చు అంచనా కట్టి అంతే మొత్తంలో చెల్లించాలి. సెక్షన్‌ 4 ప్రకారం వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిరువ్యాపారులు, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఒకరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలి లేదా ఒకేసారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి లేదా 20 సంవత్సరాల పాటు రూ.2వేల చొప్పున నెలకు చెల్లించాలి. వీటితోపాటు సంవత్సరకాలం నెలకు రూ.3 వేల చొప్పున జీవన మనుగడ కోసం వేతనం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు అదనంగా చెల్లించాలి. నిర్వాసితులై ఇతర చోట్లకు తరలించాల్సి వస్తే రవాణాకు రూ.50 వేలు, పశువుల పాకలకు రూ.25 వేలు, చిరుదుకాణదారులకు రూ.25 వేలకు తక్కువకాకుండా చెల్లించాలి. కానీ నేడు అలా జరగడం లేదు. సర్వం కోల్పోయి నిర్వాసితులై ఇతర ప్రాంతాలకు పోవాల్సివస్తే దాదాపు 25 రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయించి అక్కడికి తరలించాలి. కానీ అలా చేయకుండా బలవంతంగా బుల్డోజర్లతో ఇళ్ళను కూలగొట్టి వెళ్ళగొడుతున్నారు. పోలవరం, వంశధార మొదలగు ప్రాంతాలలో నిలువనీడ లేక నేడు చెట్టుకొకరు, పుట్టకొకరు దిక్కులేని అనాథలుగా ఉన్నారు. పరిహారం, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌కు సంబంధించి ఏ అంశాల నైనా ప్రభుత్వ అధికారులు, కంపెనీలు ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులకు కనీసంగా ఆరు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నేడు మన రాష్ట్రంలో పరిశ్రమలు, విమానాశ్రయాలు, పోర్టులు, రాజధాని కోసమని 15 లక్షల ఎకరాల భూమిని తీసుకొని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోంది. వీరికోసం 2013 చట్టంలోని అంశాలన్నీ తుంగలో తొక్కి, వ్యతిరేకించిన వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకంకాదు. అందరినీ ఒప్పించి, అన్ని సౌకర్యాలు కల్పించి, ఎంత భూమికావాలో నిర్దిష్టంగా నిర్ణయించి తీసుకోవాలి. బలవంతపు భూ సేకరణ ఆపి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని హక్కులూ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ చట్టంలోని అంశాలను అవగాహన చేసుకొని బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. (సేకరణ :- భూ సేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌లో సరైన నష్ట పరిహారం, పారదర్శకత హక్కు చట్టం -2013, కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ్ర శాఖ, భారతప్రభుత్వం)

- పడిగే ప్రశాంత్ (వ్యాసకర్త భారత కమ్యూనిస్టు ..మార్క్సిస్టు పార్టీ సభ్యుడు .సిద్దిపేట జిల్లా) పశి 12:21, 29 ఏప్రిల్ 2017 (UTC)

భూ సేకరణ చట్టం2014 మార్చు

అభ్యంతరాలు తెలపమని చెప్పాలి. కానీ నేడు కనీసం భూ యజమానికి తెలియజేయకుండానే నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే సెక్షన్‌ 26(1) ప్రకారం భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా లేదా ఎక్కువ ధరకు అమ్ముడు పోయుంటే దాని ఆధారంగా నాలుగు రెట్లు అధికంగా ఇవ్వాలి. (మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు 1.25 శాతం, తెలంగాణ ప్రభుత్వం 1.50 శాతం అధికంగా ఇవ్వాలని నిర్ణయించాయి). పట్టణాభివృద్ధికైతే సేకరించిన భూమిలో అభివృద్ధి చేసి హక్కుదార్లకు 20 శాతం భూమి ఇవ్వాలి. పరిశ్రమల్లోనైతే 25 శాతం షేర్లు ఇవ్వాలి. సకాలంలో నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే 9 శాతం వడ్డీతో ఇవ్వాలి. భూమిసేకరించిన తర్వాత సంవత్సరం అయినా నష్టపరిహారం చెల్లించకపోతే ఆనాటి భూమి విలువ కట్టి ఇవ్వాలి. రాష్ట్రాలు ఇవి అమలు చేయకపోతే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని అమలుకోసం అధికారులను నియమిం చాలి. కానీ ప్రస్తుతం దానికి విరుద్ధంగా జరుగుతున్నది. అధ్యాయం 6 పునరావాసం-రీసెటిల్‌మెంట్‌లోని సెక్షన్‌ 45 ప్రకారం ప్రాజెక్ట్‌ కోసం 99 ఎకరాలు మించితే పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ కోసం బాధిత మహిళలు, స్వచ్ఛంద సంస్థ, జాతీయ బ్యాంకు అధికారి, స్థానిక సంఘాల ప్రతినిధి, ఎమ్యెల్యేతో కమిటీ వేసి బాధితులకు పరిహారం అందించాలి. దేనికి కొనుగోలు చేస్తారో, ఏ ఉద్దేశంతో భూమిని సేకరిస్తారో ప్రకటించాలి. సెక్షన్‌ 48 ప్రకారం ఆ భూమి వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుపోతే (ఉదాహరణకు ఉపాధి హామీ చట్టం) వాటిని నష్టపోకుండా చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇదేమీ పరిగణలోకి తీసుకోవడం లేదు. రాజధాని ప్రాంతంలో సాగుభూమి లేదు కాబట్టి ఉపాధి పనులు లేవని చెబుతోంది. సెక్షన్‌ 102ననుసరించి చట్టం ప్రకారం సేకరించిన భూమిని ఐదు సంవత్సరాలలోపు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోతే తిరిగి భూమి కోల్పోయిన వారికి గానీ, వారి వారసులకు గానీ ఇవ్వాలి. షెడ్యూల్‌ 2, సెక్షన్‌ 30(7) కింద ఇళ్ళు కోల్పోతే ఐఏవై క్రింద ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. పట్టణ ప్రాంతాలలోనైతే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. దీనికి బాధితులు ఆమోదించకపోతే ఒకేసారి రూ.1.50 లక్షలకు తగ్గకుండా ఎక్కువ ఎంతైనా ఇవ్వవచ్చు. సాగునీటి ప్రాజెక్టు క్రింద భూమి కోల్పోయిన చిన్నస్థాయి రైతు కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలి. ఎస్సీ,ఎస్టీలకైతే కోల్పోయిన భూమికి సమానంగా మరోచోట భూమి ఇవ్వాలి. ఇళ్ళు పోతే ఆ ఇంటి నిర్మాణ ఖర్చు అంచనా కట్టి అంతే మొత్తంలో చెల్లించాలి. సెక్షన్‌ 4 ప్రకారం వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిరువ్యాపారులు, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఒకరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలి లేదా ఒకేసారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి లేదా 20 సంవత్సరాల పాటు రూ.2వేల చొప్పున నెలకు చెల్లించాలి. వీటితోపాటు సంవత్సరకాలం నెలకు రూ.3 వేల చొప్పున జీవన మనుగడ కోసం వేతనం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు అదనంగా చెల్లించాలి. నిర్వాసితులై ఇతర చోట్లకు తరలించాల్సి వస్తే రవాణాకు రూ.50 వేలు, పశువుల పాకలకు రూ.25 వేలు, చిరుదుకాణదారులకు రూ.25 వేలకు తక్కువకాకుండా చెల్లించాలి. కానీ నేడు అలా జరగడం లేదు. సర్వం కోల్పోయి నిర్వాసితులై ఇతర ప్రాంతాలకు పోవాల్సివస్తే దాదాపు 25 రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయించి అక్కడికి తరలించాలి. కానీ అలా చేయకుండా బలవంతంగా బుల్డోజర్లతో ఇళ్ళను కూలగొట్టి వెళ్ళగొడుతున్నారు. పోలవరం, వంశధార మొదలగు ప్రాంతాలలో నిలువనీడ లేక నేడు చెట్టుకొకరు, పుట్టకొకరు దిక్కులేని అనాథలుగా ఉన్నారు. పరిహారం, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌కు సంబంధించి ఏ అంశాల నైనా ప్రభుత్వ అధికారులు, కంపెనీలు ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులకు కనీసంగా ఆరు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నేడు మన రాష్ట్రంలో పరిశ్రమలు, విమానాశ్రయాలు, పోర్టులు, రాజధాని కోసమని 15 లక్షల ఎకరాల భూమిని తీసుకొని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోంది. వీరికోసం 2013 చట్టంలోని అంశాలన్నీ తుంగలో తొక్కి, వ్యతిరేకించిన వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకంకాదు. అందరినీ ఒప్పించి, అన్ని సౌకర్యాలు కల్పించి, ఎంత భూమికావాలో నిర్దిష్టంగా నిర్ణయించి తీసుకోవాలి. బలవంతపు భూ సేకరణ ఆపి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని హక్కులూ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ చట్టంలోని అంశాలను అవగాహన చేసుకొని బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. (సేకరణ :- భూ సేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌లో సరైన నష్ట పరిహారం, పారదర్శకత హక్కు చట్టం -2013, కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ్ర శాఖ, భారతప్రభుత్వం)

- పడిగే ప్రశాంత్ (వ్యాసకర్త భారత కమ్యూనిస్టు ..మార్క్సిస్టు పార్టీ సభ్యుడు .సిద్దిపేట జిల్లా) పశి 12:22, 29 ఏప్రిల్ 2017 (UTC)

భూసేకరణ పై అవగాహనా మార్చు

|| భూసేకరణ చట్టం – ఒక అవగాహన ||

// భూసేకరణ చట్టం – ఒక అవగాహన //


.>> ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలామంది నోట వినిపిస్తున్న అంశం “ప్రాజెక్టులకు భూసేకరణ” . చాలా రాష్ట్రాల్లో ఈ అంశం పెను వివాదాలకు మూలకారణమయ్యింది. ప్రత్యేకించి మరీ మన “తెలుగు రాష్ట్రాల్లో” అయితే చెప్పనక్ఖరలేదు. ఈ విషయంలో రాజకీయ వివాదాలతోబాటు మరెన్నో సామాజికపరమైన క్లిష్టమైన అంశాలతో ప్రస్తుతం మన దేశం సతమతమవుతూ ఉంది. – కారణం, “భూసేకరణ చట్టం, 2013” లో భూయజమానుల పాలిట సానుకూలమైన ఎన్నో అంశాలు ఉండి, వారి అంగీకారం లేకుండా బలవంతపు సేకరణ చేసే అవకాశం ప్రభుత్వాలకు లేకుండడమే కాకుండా ఇంకా ఎన్నో రక్షణాలు ఈ చట్టంలో ఉన్నాయి. – దీనివల్లే, ఆయా రాష్ట్రాలు ఎన్నో అడ్డదారులు తొక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భూములు సేకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి “ల్యాండ్ పూలింగ్” అయితేనేమి, చంద్రశేఖర రావు గారి “జి‌ఓ-123” అయితేనేమి, ఈ చట్టం నుండి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు.

>> ఎందుకు ప్రభుత్వాలు ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నాయి ? చట్టప్రకారం వెళితే వాళ్ళకు ఇబ్బందులేమిటి ? అసలు ఇంతకీ ఆ చట్టంలో ఏముంది ?? – దీనిపై ఒక అవగాహనకొరకు వ్రాస్తున్నదే ఈ వ్యాసం. కాస్త పెద్దదే, ఓపిక చేసుకొని చదవండి.

>> స్వాతంత్ర్యానంతరం మనం రూపొందించుకొన్న ఎన్నో చట్టాల్లో అత్యంత ఉత్తమమైన & సంచలనమైన వాటిలో ఒకటి 2013 లో కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూ‌పి‌ఏ ప్రభుత్వం రూపొందించిన “భూసేకరణ చట్టం”. ఈ చట్టం అసలు పేరు Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013″ . బ్రిటిష్ కాలంనాటి భూసేకరణ చట్టానికి (The Land Acquisition Act 1894), అనేక మార్పులూ చేర్పులూ చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. షుమారు 65పేజీలున్న ఈ చట్టాన్ని, సంక్లిష్టంగా రూపొందించారు. ఈ చట్టంలోని అంశాలను క్లుప్తంగా వివరించి, సాధ్యమైనంత ఎక్కువమందికి కనీస అవగాహన కల్గించే ప్రయత్నమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

.…. కాస్త పెద్దదే, ఓపిక చేసుకొని చదవండి.

అంతకుముందున్న 1894 నాటి బ్రిటిష్ చట్టంలో ఉన్న సమస్యలు ఏమిటి ?

.>> 1894 నాటి బ్రిటిష్ చట్టంలో లెక్కలేనన్ని లోపాలుండడం వలన, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గమూ, సామాజిక శాస్త్రవేత్తలూ అందరూ సమూల మార్పులు చేయవలసిందేనని మూకుమ్మడిగా నినదించారు. దాని పర్యావసానమే 2013 లో అప్పటి UPA ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం.. అదికూడా చాలా సుదీర్ఘ ప్రక్రియ తరువాతనే చట్టంగా రూపొందింది. ఇక మురిగిపోయిన ఆ బ్రిటిష్ చట్టంలో ఉన్న లోటుపాట్లు ఏమిటో ఓసారి చూద్దాం.. 1. బలవంతపు సేకరణకు ప్రభుత్వానికి సర్వహక్కులూ ఉండడం 2. బలవంతపు సేకరణపై భూయజమానులకు రక్షణ లేకపోవడం 3. సహాయ పునరావాస కార్యక్రమాల ఊసే లేకపోవడం 4. అత్యవసర పరిస్థితుల్లో భూసేకరణకు అసాధారణమైన అధికారాలను కలిగి ఉండడం 5. అత్యల్ప నష్ట పరిహారం 6. న్యాయపరమైన చిక్కులుంటే మొత్తం ప్రాజెక్టునే ఆపివేసే పరిస్థితులుండడం 7. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం మోసపూరితమైనదిగా ఉంది అంటూ సాక్ష్యాత్తూ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడడం 8. ఇంకో కేసు విషయంలో కూడా సుప్రీమ్ కోర్ట్ ఈ చట్టం అసలు ఇప్పటి సమాజానికి ఎటువంటి మేలూ కలగజేసేదిగా లేదు అంటూ అభిప్రాయపడడం…

ఇలాంటివి ఎన్నో లెక్కలేనన్నిసమస్యలున్నాయి ఆ బ్రిటిష్ చట్టంలో.. అందుకే ఎన్నో అవకతవకలున్న ఆ బ్రిటిష్ చట్టాన్ని సమూలమార్పులకు గురిచేసి షుమారు రెండేళ్ళ పాటు చర్చోపచర్చలూ, ఎన్నెన్నో మార్పులూచేర్పులూ చేసిన తరువాత 2013 లో ఓ చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆ చట్టం పేరే “The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013”

2013 లో తెచ్చిన ఈ “భూసేకరణ చట్టం” లోని ముఖ్యమైన అంశాలను చూద్దాం.

>> 1894 నాటి బ్రిటిష్ రాజ్ బిల్లుకు 157 సవరణలు చేసిన ఈ కొత్త బిల్లులో 103 సవరణలు టైపోగ్రఫీ లేదా డెఫినేషన్ కు సంబందినవి. 28 స్వల్ప సవరణలు. మిగతా 26 సవరణలు మాత్రం అత్యంత ముఖ్యమైనవి, విస్తారమైనవీను. ఈ 26 ముఖ్యమైన సవరణలలోని అంశాలలో కొన్నింటిని మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. . >> బ్రిటిష్ చట్టంలో లేనటువంటి

“నష్ట పరిహారం” “సహాయ-పునరావాస” కార్యక్రమాలు “భూ యజమానుల హక్కుల పరిరక్షణ” “సామాజిక ప్రభావ మదింపు”

“బహువిధ పంటలు” పండే భూములపై విధించిన రక్షణ”

“ఆహార భద్రతకు” సంబంధించిన రక్షణలు” “గిరిజనులకు ప్రత్యేక రక్షణలు” .. ఇలా బ్రిటిష్ చట్టంలో లేనటువంటి ఎన్నో అంశాలను ఈ బిల్లులో పొందుపరచారు. ఓరకంగా చెప్పాలంటే “కార్పొరేట్ల కు ఇది కొరకరాని కొయ్య” & భూ యాజమానుల పాలిట, రైతుల పాలిట ఇది ఒక రక్షణ కవచం అని చెప్పవచ్చు. ఈమాత్రం పకడ్బందీగా లేకపోతే ఇష్టారాజ్యంగా అరాచకం రాజ్యమేలేది.

[ ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ]

1. నష్ట పరిహారం ప్రస్తుతమున్న అసంబద్ధమైన నష్టపరిహార విధానంవల్ల తీవ్రంగా నష్టపోతున్న భూ యజమానులకు వెనుదన్నుగా ఉండేలా, ఈ బిల్లులో “మార్కెట్ వేల్యూ పై నాలుగురెట్లు వరకూ అదనంగా పల్లె ప్రాంతాలలోనూ”, “రెండు రెట్లు వరకూ అదనంగా పట్టణ ప్రాంతాలలోనూ” నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన విధించారు. దీనివల్ల భూమిని కోల్పోయేవారికి పరిహారంపై భరోసా ఉంటుంది.

. 2. సహాయ – పునరావాసం భూ సేకరణ దాని సంబంధిత సహాయ పునరావాస కార్యక్రమాలను కలిపి ఒకటే చట్టంలో తేవడం బహుశా ఇదే మొదటిదనుకొంటాను. ఈ బిల్లులో ఏకంగా ఐదు అధ్యాయాలు, రెండు ప్రత్యేక అనుబంధ పత్రాలూ (షెడ్యూల్) కేవలం సహాయ పునరావాసానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయించారు.

3. భూ యజమానుల అంగీకారం పరిహారం, సహాయ-పునరావాసం తరువాత అత్యంత ముఖ్యమైన మరో సవరణ ఈ “భూ యజమానుల అంగీకారం”. ఈ నిబంధన ప్రకారం, “ప్రభుత్వ ప్రైవేటు బాగాస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు 70% భూ యజమానుల అంగీకారం తప్పనిసరి”. అలాగే ప్రైవేటు ప్రాజెక్టులకు 80% భూ యజమానుల అంగీకారం తప్పనిసరి. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు సేకరణ జరగదు. ఆవిధంగా భూ యజమానులకు ఇది ఒక మహా రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది ఖచ్చితంగా భూ యజమానుల హక్కులను కాపాడే నిబంధన..

4. సామాజిక ప్రభావ అంచనా ఇది ఇంకో అతి ముఖ్యమైన అంశం. భూసేకరణ జరిగే ప్రాంతంలో, సదరు భూమిని సేకరించడం వలన కలిగే “సామాజిక ప్రభావాన్ని” అంచనా వేయడానికి గ్రామ స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి, వివిధ అంశాలను అధ్యయనం చేసి, ప్రభావాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. ఇది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో నిపుణుల కమిటీలు వెళ్లి గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలను నమోదు చేసి, సవివర నివేదికను సమర్పించాలి. తదుపరి ఆ నివేదికను మదింపు చేసినతరువాత మాత్రమే భూసేకరణకు పచ్చజండా. ఈ ప్రక్రియ మొత్తం ఆరునెలలలోపు పూర్తి కావలసి ఉంటుంది.

5. గతానికి వర్తించే నిబంధనలు ఈ బిల్లు ఆచరణలోనికి రావడానికి ముందే భూ సేకరణ జరిగీ, పరిహారం ప్రకటించిన తరువాత కూడా ఆ పరిహారం చెల్లించకుండా ఉండీ, ఆ భూమిని స్వాధీనపరచుకోకుండా ఉండి ఉంటే, అటువంటి వాటికి కూడా ఈ బిల్లులోని అన్ని అంశాలు వర్తిస్తాయి. ఇటువంటి పెండింగ్ లో ఉన్న వాటికి గత ఐదేళ్ళ క్రితం వరకూ జరిగిన సేకరణలకు, ఈ మొత్తం తతంగం, కొత్త చట్టం ప్రకారం మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టవలసి ఉంటుంది.

6. విభిన్నమైన తనిఖీలు- సంతులనాలు విస్తారమైన, భాగస్వామ్యం గల, అర్థవంతమైన ఈ ప్రక్రియ వలన ఎక్కడికక్కడ, గ్రామ పంచాయతీ స్థాయి నుండి, జాతీయ స్థాయి మానిటరింగ్ కమీటీల వరకూ ప్రతిఒక్కరి భాగస్వామ్యాన్ని ఖచ్చితంగా ఉండేలా చేసి, భూ సేకరణకు పూర్వరంగం నుండి, పరిహార, సహాయ-పునరావాస కార్యక్రమాలన్నీ పకడ్బందీగా అమలయ్యేలాగా చేయడానికి అవకాశముంది.

7. గిరిజనులకు, మిగతా ప్రతికూల సమూహాలకూ ప్రత్యేక రక్షణలు ఈ నిబంధనల వల్ల గిరిజనుల, అటవీ ప్రాంత ప్రజలకు ఉన్న హక్కులు పరిరక్షించే వివిధ చట్టాలలో పేర్కొన్న అంశాలు, అటవీ చట్టాలు, షెడ్యూల్ కులాలకు చెందిన చట్టాలూ ఇవన్నీ వర్తిస్తాయి. దీనివల్ల భూ సేకరణ చట్టంలోని నిబంధనలే కాకుండా వీరికి ప్రత్యేక రక్షణలు కూడా ఉంటాయి.

8. నిర్వాసితులకు ప్రత్యేక రక్షణలు ఈ నిబంధనల వలన, భూమిని కోల్పోయేవారికి పరిహారం అంది, సహాయ పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేసి, వారిని సాధారణ పరిస్థితుల్లో నివసింపజేసేవరకూ భూమిని స్వాదీనం చేసుకోకుండా వీలు ఉంటుంది.

9. జీవనోపాధి కోల్పోయేవారికి పరిహారం భూ సేకరణ వలన, కేవలం భూ యజమానులకే కాకుండా ఆ భూమిపై ఆధారపడి బ్రతికే వారికి కూడా ఉపాది కోల్పోయే ప్రమాదముంది, కావున అటువంటివారికి కూడా పరిహారం అందేలా ఈ నిబంధనను రూపొందించారు.

10. బహుళ పంటలు పండే భూములపై నియంత్రణలు “ఆహార భద్రత”ను ఉద్దేశ్యించి రూపొందించిన ఈ నిబంధన వల్ల “బహుళ పంటలు” పండించే అత్యంత సారవంతమైన భూముల సేకరణపై కట్టుదిట్టమైన నియంత్రణ ఉంటుంది. ఇటువంటి భూముల సేకరణకు అనుమతులు రావాలంటే చాలా జటిలమైన ప్రక్రియ ఉంటుంది.

11. వాడని భూములు తిరిగి అప్పగించడం ఈ ప్రకరణం వల్ల సేకరించిన భూమిని ఒకవేళ ఉపయోగించకపోతే, తిరిగి సొంతదారులకు అప్పగించే సౌలభ్యం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. లేదా ప్రభుత్వందగ్గరే ఉంచుకొనే వీలు ఉంటుంది.

12. ఆదాయపు పన్ను మినహాయింపు భూమిని కోల్పోయిన వారికి అందే పరిహారంపై ఎటువంటి ఆదాయపన్ను ఉండదు. అంతేకాకుండా మిగతా స్టాంప్ డ్యూటీలు కూడా ఉండవు.

13. లాభంలో వాటా సేకరించిన భూమిని వివిధ కారణాల వలన ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ రేటుకు అమ్మడం గనక జరిగే పక్షంలో ఆ పెంచిన రేటులో 40% వాటా భూమిని కోల్పోయినవారికి అందుతుంది పడిగే ప్రశాంత్ ప్రశాంత్ కమ్యూనిస్ట్ 07:37, 30 ఏప్రిల్ 2017 (UTC)