వివినమూర్తి
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
గ్రామాల పేర్లు
మార్చువివినమూర్తి గారూ, గ్రామాల పేర్లు సరిద్ది తెలుగు వికీకి తోడ్పడుతున్నందుకు ధన్యవాదములు. వీటిని ఆంగ్లమునుండి పెద్దఎత్తున అనువాదము చేయటములో తప్పులు దొర్లినాయి. మీలా ఆయా గ్రామాలు తెల్సినవారు దిద్దితే బాగుంటుంది. --వైఙాసత్య 07:49, 23 నవంబర్ 2006 (UTC)
ప్రసిద్ధ రచయిత
మార్చువివినమూర్తి గారూ! మీ పరిచయం మీ సభ్యునిపేజీ లో ఇంకా రాసుకోలేదు; కుతూహలం కొద్దీ అడుగుతున్నాను.. ప్రసిద్ధ రచయిత వివినమూర్తి మీరేనా? __చదువరి (చర్చ, రచనలు) 08:08, 23 నవంబర్ 2006 (UTC)
- అవును నేనే వివిన మూర్తి పేరుతో రాస్తుంటాను. నాదో ఆలోచన. తెలుగులో సమగ్రమైన నిఘంటువు రావలసి ఉంది. నా ఊహలలో దాని రూపం ఏంటంటే ఒక పదంకి వివిధ ప్రాంతాలలో ఉన్న మాండలికాలన్నీ ఒకేచోట లభించాలి. ఉదా- ఒళ్లు = పెయి (తెలంగాణా) శరీరము(సం)
- మనం అందరం కలిసి తయారుచేసి అచ్చురూపంలో కూడా తేగలమా- మన తెలుగుని సంపన్నం చేసుకోగలమా మూర్తి
- వివిన మూర్తి గారూ, మీలాంటి రచయితలు కూడా ఈ కృషిలో పాల్గొనడము మహద్భాగ్యము. మీరన్నట్ట్లు సరిగ్గా అలాంటి నిఘంటువు ప్రయత్నము తెలుగు విక్షనరీలో ప్రారంభించాము. అది ఇంకా అంత ఊపందుకోలేదు. వికిపీడియా, విక్షనరీలను అచ్చురూపములో తేవడానికి ఇబ్బందులేమీ లేవు --వైఙాసత్య 14:28, 1 డిసెంబర్ 2006 (UTC)
- వివినమూర్తిగారూ! నమస్కారం. రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు అంత ఉత్సాహంగా పాల్గొనడంలేదనే లోటు తెవికీలో బాగా ఉన్నది. వారు ముందుకొస్తే అద్భుతమైన ప్రగతి సాధ్యమని నా అభిప్రాయం. స్వాగతం. కాసుబాబు 16:57, 1 డిసెంబర్ 2006 (UTC)
- కాసుబాబు గారూ వైఙాసత్య గారూ చదువరి గారూ !మీ విక్షనరీలో కూడా చేరాను. మీ ఈ ప్రయత్నాలు నాకు భవిష్యత్తు మీద అంతులేని ఆశ కలిగించాయి. మనుషులు తమ కష్టసుఖాలను, ఎరుకను కలబోసుకునే తత్వం నుంచే సమస్త శాస్త్రాలూ, సాహిత్యం, ప్రగతీ మొదలయాయి. ఈ వికీపీడియా అదే తత్వానికి ఆధునిక రూపం. పట్టు విడవకండి. మూర్తి
- వివినమూర్తిగారూ! నమస్కారం. రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు అంత ఉత్సాహంగా పాల్గొనడంలేదనే లోటు తెవికీలో బాగా ఉన్నది. వారు ముందుకొస్తే అద్భుతమైన ప్రగతి సాధ్యమని నా అభిప్రాయం. స్వాగతం. కాసుబాబు 16:57, 1 డిసెంబర్ 2006 (UTC)
తెలుగు వికీపీడియా ఆభివృద్ధికి సహకారం
మార్చువివినమూర్తి గారు, చాలా కాలం తరువాత మరల మీరు తెవికీలో క్రియాశీలం ఐనందులకు ఆనందంగా వుంది. బెంగుళూరులో తెలుగు వికీపీడియా సముదాయాన్ని బలపరచటంలో మీ సహకారము కోరుతున్నాను.--అర్జున 01:58, 21 సెప్టెంబర్ 2010 (UTC)