సురేష్ కలవల గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 00:01, 2 జనవరి 2008 (UTC)Reply


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సభ్యుని పేరు మార్పు

మార్చు

సురేష్ గారూ! మీరు వైజాసత్య గారి చర్చా పేజీ లో అడగండి. ఆయన మార్చగలరు. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నా చర్చా పేజీలో రాయండి. రవిచంద్ర(చర్చ) 05:07, 31 ఆగష్టు 2008 (UTC)

మీ సభ్యుని పేరు "సురేష్ కలవల" గా మార్పుచేశాను --వైజాసత్య 19:42, 31 ఆగష్టు 2008 (UTC)

చాగంటి కోటేశ్వరరావు పేజీ గురించి

మార్చు

చాగంటి కోటేశ్వరరావు పేజీలో కొన్ని సవరణలు అవసరమని భావించాను. వివరాలను అక్కడి చర్చాపేజీలో రాసాను. నా సూచనలను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తున్నాను. ఆ విషయమై నా అభిప్రాయంతో విభేదించే పనైతే అక్కడి చర్చాపేజీలోగానీ నా సభ్యుని చర్చాపేజీలోగానీ ఇక్కడగానీ రాయండి. వికీలో మీతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.

అన్నట్టు, చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడలో చేసిన రామాయణ ప్రవచనం దించుకోవడానికి సురసలో లభిస్తుంది. నేను దించుకుని విన్నాను. వారివి ఇంకా ఇతర ప్రవచనాలు కూడా ఉన్నాయక్కడ. (మీకు ఇప్పటికే తెలిస్తే సరే.) _చదువరి (చర్చరచనలు) 19:54, 29 జూలై 2009 (UTC)Reply