M.narender reddy
M.narender reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 15:08, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
మార్చునేను వ్యాస0 ప0పాలనుకున్నాను.ఎలా ప0పాలి.
- సాధరణంగా ఇక్కడ వ్యాసాలను మీరే చేర్చవచ్చు. కానీ మెయిల్ చెయ్యాలంటే teluguwiki@yahoo.co.in కి పంపండి --వైజాసత్య 19:20, 4 ఫిబ్రవరి 2008 (UTC)
- నరేందర్ గారు, అక్షరం సున్నా వ్రాయాలంటే M నొక్కండి.--C.Chandra Kanth Rao 19:22, 4 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:MotherDreamCatcher.jpg లైసెన్సు వివరాలు
మార్చుM.narender reddyగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:MotherDreamCatcher.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:01, 13 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}} నేను పంపిన వ్యాసం మరియు బొమ్మఏందుకు చేర్చబడలేదు.బొమ్మను గురించి వివరణ కూడా ఇచ్చాను.
- మీరు బొమ్మను సరైన కాపీ హక్కుల లైసెన్సులతో చేర్చలేరు. దానికి లైసెన్సు వివరాలు ఇస్తే సరిపోతుంది.--C.Chandra Kanth Rao 16:02, 20 ఫిబ్రవరి 2008 (UTC)
దీనికి ఏ లైసెన్సు అవసరము లేదు.నేను వివరణ కూడా ఇచ్చాను.
వికీకి అనుగుణం కాని వ్యాసాలు
మార్చునరేందర్ రెడ్డి గారూ! మీరు "పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి" గారి గురించి, సహజ యోగం గురించి అనేక చోట్ల వ్రాశారు. మీరు వ్రాసిన విషయాలతో నేను విభేదించడం లేదు గాని అవి వికిపీడియా విధానాలకు అనుగుణంగా లేవు. ఇది మీరు వికీపీడియా వ్యాసాల నియమాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వలన జరిగిందను కొంటున్నాను. మీరు వ్రాసిన వ్యాసాలలో ఉన్న సమస్యలు ఇక్కడ తెలియ జేస్తున్నాను.
- మీరు వ్రాసిన వ్యాసాలు వికీపీడియా:పేజీని తరలించడం ఎలా, వికి వంటి పేజీలలో ఉన్నాయి. అవి నిర్వహణకు సంబంధించిన పేజీలు. కనుక వ్యాసం శీర్షికకు, అందులో ఉన్న విషయానికి పొంతన లేకుండా పోయింది.
- వ్యాసం అధికంగా మాతాజీ ఔన్నత్యాన్ని, ఆమె సందేశంలో మహత్యాన్ని, సహజ యోగం ఉపయోగాలను తెలుపున్నవి. ఇవి మీరు ప్రగాఢంగా విశ్వసించే విషయాలు కావచ్చును. కాని వికీపీడియాలో ఈ విధమైన వ్యాసాలు ప్రచార వ్యాసాల శైలిలో ఉన్నందున అనుమతించబడవు.
- అంతే గాకుండా "ఒకసారి ప్రయత్నించి చూడండి", "అని నా నమ్మకం" వంటి పంథాలో వ్రాసిన వ్యాసం "స్వీయ అభిప్రాయం"గా పరిగణింపబడుతుంది. కనుక కూడా వికీ శైలికి, విధానాలకు విరుద్ధం.
అందువలన ప్రస్తుతం ఇలా చేయవచ్చునని సూచిస్తున్నాను.
- ఇవన్నీ మీరు వికీపీడియా లక్ష్యాన్ని, విధానాలను వేరు విధంగా అర్ధం చేసుకోవడం వలన జరిగాయనిపిస్తుంది. కనుక దయచేసి ఇతర వ్యాసాలు కొంచెం పరిశీలించండి. మీకు వికీ గురించిన అవగాహన వస్తుంది.
- ప్రస్తుతం మీరు వ్యాసాలుగా వ్రాసినవి తొలగిస్తున్నాను. అయితే విషయాన్ని తీసివేయడంలేదు. అందులోని విషయాలను మాతాజీ నిర్మలాదేవి, సహజ యోగం అనే క్రొత్త వ్యాసాలలోకి తరలిస్తున్నాను. అలాగయితే ఆ పేర్లకు, అందులో ఉన్న విషయాలకు సంబంధం ఉంటుంది.
- ఈ రెండు వ్యాసాలను వికీ శైలిక అనుగుణంగా వికీకరించవలసి ఉంది. ఇతర వ్యాసాలు పరిశీలిస్తే మీరు గమనించ గలరు. ఉదాహరణకు సత్యసాయిబాబా అనే వ్యాసం చూడగలరు.
మీరు అన్యధా భావించకుండా, నిరుత్సాహపడకుండా ఈ రెండు వ్యాసాలను వికీ విధానాలకు అనుగుణంగా మరింత విస్తృతం చేయమని కోరుతున్నాను. అలాగే మీకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్టుల గురించి కూడా వ్యాసాలు వ్రాఐమని కోరుతున్నాను. ఏమైనా సందేహాలుంటే తప్పకుండా వా చర్చా పేజీలో వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:33, 8 ఏప్రిల్ 2008 (UTC)