వాడుకరి చర్చ:Mpradeep/పాత చర్చ 5

Active discussions

కృతజ్ఞతలుసవరించు

నా స్వీయ నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.--C.Chandra Kanth Rao 13:59, 16 ఫిబ్రవరి 2008 (UTC)

Botsసవరించు

ప్రదీపు గారు. నేను తెవికీ కోసం bots తయారు చేయాలనుకుంటున్నాను. నాకు C++ వచ్చు. అది పనికివస్తుందా? వేరే భాషలేమైనా నేర్చుకోవాలా? Bots ఎట్లా పనిచేస్తాయి అవి ఎట్లా తయారుచేయాలో చెప్తారా? సాయీ(చర్చ) 11:40, 28 ఫిబ్రవరి 2008 (UTC)

బాట్లను తయారు చేయడం చాలా సులువు. మొదటగా WP:BOT పేజీని చదివి తెలుగు వికీపీడియాలో బాట్లను ఉపయోగించే ముందు ఏమేమి చేయాలో తెలుసుకోండి. ఆ తరువాత pythonలో తయారు చేసిన బాట్ framework (pywikipedia) ఉపయోగించి పైథానులో ప్రోగ్రాములను రాయడాన్ని నేర్చుకోండి. (python నేర్చుకోవడం చాలా సులువు, ఒక్క రోజు కంటే ఎక్కువ సేపు పట్టదు). పైవికీపీడియాను ఉపయోగించి బాటు ప్రోగ్రాములు రాస్తున్నప్పుడు, వికీపీడియాలోని ఏదయినా పేజీని తెమ్మన్నప్పుడు ఆ పేజీని "మార్చు" నొక్కినప్పుడు, edit డబ్బాలో కనిపించే సమాచారాన్ని మాత్రమే మన ప్రోగ్రాముకు ఇస్తుంది, అలా మన పని సులువవుతుంది. ఉదాహరణల కోసం, బాటుద్వారా చేపించటానికి నేను రాసిన ప్రోగ్రాములన్నీ నా బాటు పేజీ నుండి ఉన్న లింకుల ద్వారా చూసుకోవచ్చు. చివరిగా మీరు బాటుకోసం ప్రోగ్రాములను రాసేముందు, ఏఏ పనులకు దానిని తెలుగు వికీపీడియా వాడతారో పేర్కుంటూ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:58, 28 ఫిబ్రవరి 2008 (UTC)
ప్రదీపు గారు. నేను ఈ పేజి కి వెళ్ళాను. python download చేసాను. pywikipedia కూడా download చేసాను. download చేసిన pywikipedia folder లో .py files చాలా ఉన్నాయి. వాటినే వాడుకోవచ్చా? ఎలా వాడాలి? ఇంకొకటి, మీ బాటు సంతకం లో p వ్రాయకుండా Mradeepbot అని సంతకంచేస్తూంది... సాయీ(చర్చ) 23:38, 28 ఫిబ్రవరి 2008 (UTC)

బాటు సంతకాన్ని సరిచేసాను. తెలిపినందుకు ధన్యవాదాలు. బాటును నడపటానికి మీరు ఈ క్రింది సూచనలను పాటించండి:

 1. మొదటగా pywikipediaను python install చేసిన folderలోనే ఉంచండి.
 2. ఆ తరువాత pywikipedia ఫోల్డరులో user-config.py అనే ఫైలును సృష్టించి అందులో క్రింది వాక్యాలను ఉందండి
  1. mylang='te'
  2. family='wikipedia'
  3. usernames['wikipedia']['te']='UserBot' #ఇక్కడ మీ బాటు పేరు ఉండాలి లేదా పరీక్షించడానికి మీ సభ్యనామాన్ని ఉపయోగించవచ్చు.
 3. పై సూచనలను పాటించడంతో బాటు నడపటానికి తయారుగా ఉంటుంది. దానిని పరీక్షించడానికి, మొదటగా login.py అనే పైథాను ప్రోగ్రామును నడుపుదాం. ఇందుకోసం command prompt తెరచి, అక్కడ pywikipedia స్థాపించిన ఫోల్డరుకు వెళ్లండి. అక్కడ python login.py అనే కమాండుకు type చేసి నడపండి. కొంత సేపటికి మీరు ఇంతకు ముందు configure చేసిన usernameకి పాస్వార్డు అడుగుతుంది, ఇచ్చి ఎంటరు నొక్కండి. లాగిన్ అయ్యిపోతారు.
 4. దాని తరువాత ఏదయినా వ్యాసాన్ని మార్చడానికి "python editarticle.py article_name" అనే ప్రోగ్రామును ఉపయోగించి వ్యాసాలను మార్చవచ్చు.

__మాకినేని ప్రదీపు (+/-మా) 04:09, 4 మార్చి 2008 (UTC)

user-config.py నేను ముందే తయారు చేసాను. నాది విండోస్ కాదు. మ్యాక్ ఓయస్ టెన్. ఓయస్ టెన్ లో టెర్మినల్ ఓపెన్ చేసాను. మీరు చెప్పిన command టైపు చేసాను. error message వచ్చింది. python: can't open file 'login.py' నన్నేంచేయమంటారు? ఇంకో రెండు నెలల తరవాతైతే నాతో విండోస్ ఉంటుంది. సాయీ(చర్చ) 02:30, 5 మార్చి 2008 (UTC)

సరిపోయింది ప్రదీపు గారు. నేను బాటుగా టెర్మినల్ ద్వారా లాగిన్ అవగలుగుతున్నాను. తరువాత? సాయీ(చర్చ) 08:49, 13 మార్చి 2008 (UTC)

నేను ఒక Image deletion bot తయారు చేయాలనుకుంటున్నాను. అంటే, అప్లోడ్ చేసి వారం రోజుల దాటిన తరువాత, లైసెన్సు లేని బొమ్మలను తుడిపేయాలని. en:User:SineBot లాంటిది కూడ ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను download చేసిన pywikipedia folder లో నే చాలా .py files ఉన్నాయి. అవి ఎట్లా వాడాలో నాకు తెలీదు. సాయీ(చర్చ) 12:05, 13 మార్చి 2008 (UTC)
ఇంకొకటి. en:User:MiszaBot III లాంటిది కూడాను సాయీ(చర్చ) 12:08, 13 మార్చి 2008 (UTC)

హ! హ! హ!సవరించు

బొమ్మ:Vijayanagaram.jpg కాపీ హక్కులు ఇవ్వనందున నీ బాటు నీకే హెచ్చరిక పంపింది! బాటా, మజాకానా? - మరొక విషయం. నీ బాటు ద్వారా హెచ్చరిక ఆ బొమ్మ అప్‌లోడ్ చేసిన సభ్యుల చర్చా పేజీకి వెళ్తుంది. అది ఓ.కే. కాని ఆ హెచ్చరిక కాపీ ఒకటి సదరు బొమ్మ చర్చాపేజీలో కూడా ఉంటే మంచిదననుకొంటాను. వేరెవరైనా దాని లైసెన్సు హక్కుల గురించి వ్రాసినపుడు అక్కడ వారి వివరణ వ్రాయవచ్చును గదా! (ప్రస్తుతం నీవు బిజీగా ఉన్నందున సమయం చూసుకొని చూడవచ్చును) --కాసుబాబు 09:43, 29 ఫిబ్రవరి 2008 (UTC)

అభ్యర్ధనసవరించు

ప్రదీపు గారు,

నేను వ్రాసిన మాలిక్ మక్బూల్ ఛూడగలరు. మక్బూల్ సమాధి ని నేను కొన్ని ఫొటొలు తీసితిని. వాటిని వ్యాసములో కూర్చుటకు మీ సాయము కావలెను. సాధ్యమేనా? ఐనచో ఫొటోలు ఎలా పంపగలను?Kumarrao 11:05, 5 మార్చి 2008 (UTC)

ఒక సారి క్రింద ఇచ్చిన లింకులలో ఉన్న సమాచారాన్ని చదివండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానం
__మాకినేని ప్రదీపు (+/-మా) 05:13, 6 మార్చి 2008 (UTC)

వ్యాఖ్యసవరించు

ప్రదీపు గారు, నేను వ్రాసి విస్తరించిన ముసునూరి నాయకులు వ్యాసముపై మీ వ్యాఖ్యలు కోరుతున్నాను.Kumarrao 07:17, 9 మార్చి 2008 (UTC)

తెలుగు వ్యాసములుసవరించు

ప్రదీపు గారు,

దినేశ్ కన్నంబాడి అను కన్నడిగుడు తెలుగు భాష పై నేను వ్రాసిన వాక్యములు, చేసిన దిద్దుబాటులను మార్చుచున్డెను. Please see: en:Telugu language, en:Telugu script, en:Bhattiprolu. ఆతని మొండి వాదనలు, ఆతనికి తోడ్పాటుగా మరి ముగ్గురు కన్నడిగులు తెలుగు వ్యాసములలో నన్ను ఒక సంవత్సరముగా మిగుల విసిగించుచుండిరి. వికి లో గల సౌలభ్యములతో నన్ను బహుళ చికాకుపరచి నేను చేసిన అన్ని మార్పులను తొలగంచుచున్నారు. ఈ విషయమున నేను మీ అందరి సహాయము కోరుతున్నాను.Kumarrao 06:14, 11 మార్చి 2008 (UTC)

మీరు మూలంగా చూపిస్తున్న ఒక సైటులో ఉన్న ఈ పేజీలో తెలుగు లిపి, మరియు ప్రస్తుత కన్నడ లిపి, పాత కన్నడ లిపి నుండి పుట్టాయని ఉంది. తెలుగు లిపి పాత కన్నడ లిపి నుండి కాకుండా వేరే లిపి నుండి పుట్టిందని చెప్పటానికి మీ దగ్గర రుజులేమన్నా ఉన్నాయా? __మాకినేని ప్రదీపు (+/-మా) 10:57, 11 మార్చి 2008 (UTC)

main pageసవరించు

మెదటి పేజి మీకు తీలుసా లో ఫెడెరర్ పేరు రాకుండా చేసారు. ఎందుకు? సాయీ(చర్చ) 12:25, 11 మార్చి 2008 (UTC)

నేను "thumb"ని మాత్రమే తీసేసాను. బొమ్మపై mouseని కదిలిస్తే పేరు ఇప్పటికీ కనపడుతుంది. మొదటి పేజీలో ఇప్పటి వరకూ thumbని వాడలేదు, పైగా చూడటానికి కూడా బాగా అనిపించలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:01, 11 మార్చి 2008 (UTC)
thumbఇప్పటి వరకు ఎందుకు వాడలేదు? సాయీ(చర్చ) 11:36, 12 మార్చి 2008 (UTC)

అధికారి బాధ్యతల గురించిసవరించు

ప్రదీప్!, తెలుగు వికీలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు అధికారులు చాలరని నా అభిప్రాయం. ప్రధాన కారణం: (అందరూ తమతమ పనులతో బిజీగానే ఉన్నారు.) ఇద్దరూ తమ స్వకార్యాల వలన ఒకటి రెండు నెలల కాలం వికీవైపు చూడలేకపోవచ్చును. కనుక నిన్ను కూడా అధికారి బాధ్యతకు ప్రతిపాదించాలని నేను కొద్ది రోజులుగా అనుకొంటున్నాను. వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తిలో వైజాసత్య మొదలుపెట్టిన ఎర్రలింకుల ప్రకారం నిన్నూ, నన్నూ ప్రతిపాదించే వుద్దేశం అతనికి ఉండవచ్చును. నేను ప్రస్తుతం ఈ బాధ్యతలకు సుముఖంగా లేను. (అలాగని నువ్వు కూడా తప్పించుకోవద్దు!) నీకు అంగీకారమైతే 'అధికారి'గా నీ పేరును ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:15, 12 మార్చి 2008 (UTC)

అధికారులై సందర్భంగా శుభాభినందనలు :-) --వైజాసత్య 15:18, 20 మార్చి 2008 (UTC)

ఒక చిన్న మాటసవరించు

ప్రదీప్ గారూ! నా దురదృష్టవశాత్తూ కొన్ని వ్యక్తిగత కారణాల వలన సరిగ్గా నేను నిర్వాహక ప్రతిపాదన చేసిన తరువాతే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లభించుట లేదు. కాబట్టి నేను ఒక రెండు నెలల సమయం పాటు ఎక్కువ మార్పులు చేయలేకపోవచ్చు.అన్యదా భావించకండి. తరువాత నా సొంత ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొంటే యధావిధిగా మార్పులు చేయగలను. రవిచంద్ర ఉత్సాహంగా పనిచేస్తున్నాడు, అని మిగతా నిర్వాహకులు కూడా నాకు మద్దతు తెలిపారు. ఎక్కువ దిద్దుబాట్లు చెయ్యలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. రవిచంద్ర(చర్చ) 13:16, 17 మార్చి 2008 (UTC)

అడ్డదారులుసవరించు

అలాగే ప్రదీపు గారు సాయీ(చర్చ) 11:24, 20 మార్చి 2008 (UTC)

సభ్యులు: Kumarraoసవరించు

ప్రదీపు గారు,

గత కొద్ది రోజులుగా పలు వ్యాసములు వ్రాశాను. చూడగలరు.Kumarrao 16:21, 21 మార్చి 2008 (UTC)

మీరు చేయగల ఒక చిన్న సహాయం ! ఫోటోగ్రఫీ వ్యాసం మొదటి పేజీలో ప్రతిరోజూ ఒక కొత్త ఫోటో వచ్చేలాగ (randomసవరించు

గారికి ఫోటోగ్రఫీ వ్యాసం మొదటి పేజీలో ఖాళి పెట్టెలో ప్రతిరోజూ ఒక కొత్త ఫోటో వచ్చేలాగ (random photo) చేస్తే ఆకర్షణీయంగా,విజ్ఞానాత్మకంగా ఉంటుందని అనుకుంటున్నాను.ఇంగ్లీష్ వికీపీడియా పోర్టల్ ఫోటోగ్రఫీ మొదటి పేజీలో లాగ అన్నమాట.

 • ఉదా:[[1]]vasu bojja 11:20, 22 మార్చి 2008 (UTC)

ఈ వారం వ్యాసం ఈ మెయిల్సవరించు

ప్రదీప్! ఈ వారం వ్యాసం ఈ మెయిల్ ద్వారా పంపే విషయంపై ఇదివరకు నేను అసలు ధ్యాస పెట్టలేదు. అది ఉపయోగకరమా! అన్న భావనతో. ఒకసారి ఈ commitment ను పునస్సమీక్షించమని కోరుతున్నాను. (అందరూ బిజీగా ఉన్నారు గనుక నీ అభిప్రాయం చాలు). పంపాలని నిర్ణయిస్తే ఇకముందు నేను కూడా పంపడం మొదలు పెడతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:01, 23 మార్చి 2008 (UTC)

కారణాలు అవుసరం లేదు. వ్యాసాన్ని ఈ-మెయిల్‌లో అందుకోవడం కొందరికైనా ఆసక్తి ఉంది గనుక కొనసాగిద్దాము. నాకు రెండు వారాల సమయం కావాలి. ఏప్రిల్ 15 నుండి నేను వారం వారం వ్యాసం పంపడానికి Organize చేసుకొంటాను. మరొక సంగతి - మొదటి పేజీ డిజైన్ ఎవరు చూస్తున్నారు? వీవెన్? వైజాసత్య? నువ్వా? - "ఈ వారం సమైక్య కృషి"ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అందులో వ్రాసిన విషయాలన్నీ చూస్తే గనుక సంవత్సరాలు పడుతుంది. వారాలు కాదు. కనుక ఆ మూసలోని విషయాన్ని Specific గా ఉండేలా మార్చి, మొదటి పేజీలో చిన్న బాక్స్‌లో పెడితే బాగుంటుందనుకొంటాను. ఈ వారం బొమ్మకు క్రింద. దాన్ని కూడా మిగిలిన వారం వారం శీర్షికలలాగా నిర్వహించాలి. దాని గురించి నేను కొత్త ప్రతిపాదన చేద్దామనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:43, 26 మార్చి 2008 (UTC)

కాపీ హక్కుల హెచ్చరికసవరించు

ప్రదీప్! (1) ఒక బొమ్మను అప్‌లోడ్ చేసినవారికి ఆ బొమ్మ కాపీ హక్కుల గురించి హెచ్చరిక పంపడావికి ఏదైనా మూస ఉందా? అంటే ఆటోమాటిక్‌గా కాదు. మాన్యువల్‌గా. (2) ఏప్రిల్ నెలనుండి కాపీ హక్కులు సరిగా లేని పాత బొమ్మలు కూడా తొలగిద్దామనుకొంటున్నాను. ఈ పనిలో కొందరి స్వీయచిత్రాలు కూడా చెరిగిపోతాయి. నిజానికి వాటికి వాఱికి సరైన కాపీ హక్కులు ఉండవచ్చు. కాని వారు వివరాలు ఇవ్వలేదు. నీ అభిప్రాయం ఏమిటి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 25 మార్చి 2008 (UTC)

Botసవరించు

Sorry for posting in English. Lazy to use Lekhini. Can you add మూస:నెలలు తేదీలు to all the pages like జనవరి 12 and so on. Using your Bot. I don't have the time to create the code.. సాయీ(చర్చ) 05:29, 27 మార్చి 2008 (UTC)

  ఆ మూసను కలపటం పూర్తయ్యింది. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:43, 27 మార్చి 2008 (UTC)

Thank you very much :) సాయీ(చర్చ) 08:22, 27 మార్చి 2008 (UTC)

ధన్యవాదాలుసవరించు

ప్రదీప గార్కి ధన్యవాదాలు (రిఫ:వికీపీడియా:సభ్యనామం మార్పు పేజీలో మీరు చేసిన అభ్యర్ధన మేరకు మీ సభ్యనామాన్ని "Vulapalli Sambasiva Rao" నుండి "V Sambasiva Rao"గా మార్చాను.)- vsrao 06:19, 27 మార్చి 2008 (UTC)

PD-USerసవరించు

ప్రదీప్! బొమ్మల అప్‌లోడ్ డ్రాప్ డౌన్ లిస్టులో పబ్లిక్ డొమెయిన్ సెక్షన్ లో 100యేళ్ళు పైబడినది, భారతీయ కాపీహక్కుల క్రింద 60 యేళ్ళు పైబడినవి అనే ఛాయిస్ లు మాత్రమే వస్తాయి. {{PD-User}} - User Created Public Domain మూస కూడా ఈ డ్రాప్ డౌన్ లిస్టులో చేర్చడం కుదురుతుందా? (If possible, with a parameter) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:29, 27 మార్చి 2008 (UTC)

దీనిని {{PD-user|sign=~~~}} అనివాడి దీనిని కూడా ఆ డ్రాపుడవును లిస్టులో పెట్టొచ్చు. కానీ అన్ని సమయాలలో సరిగ్గా పని చేస్తుందని నాకు నమ్మకం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:47, 27 మార్చి 2008 (UTC)
ఇఫ్పుడు నువ్వు పెట్టింది ఓకే. కాని అది {{PD-self}} క్రిందికి రావాలి. {{PD-User}} గా మరొక ఆప్షన్ కూడా వుంటే మంచిది. "ఇది వేరే వారు తయారు చేసి పబ్లిక్ డొమెయిన్ లోకి విడుదల చేసిన కృతి" అని. ఇంగ్లీషు వికీ నుండి చిత్రాలు దించుకునేటప్పుడు ఈ ఆప్షన్ బాగుంటుంది. పెరామీటర్ ఆ డ్రాప్ డౌన్ లో రానవసరం లేదు. తరువాత ఎడిట్ మోడ్ లో కలుపుకోవచ్చును.

కృతజ్ఞతలుసవరించు

నా స్వీయ నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యుడను.— రవిచంద్ర(చర్చ) 16:45, 27 మార్చి 2008 (UTC)

జిల్లాల బొమ్మలుసవరించు

కాసుబాబుగారు, జిల్లాల కలరు ఫొటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటు నుండి సేకరించాము. కాబట్టి వాటికి GFDL అనే లైసెన్సు ఇవ్వలేము. అంతే కాదు వాటిని తెలుగు వికీపీడియాలో వాడటం కూడా కాపీహక్కు ఉల్లంఘన అవుతుంది. త్వరలో నేను వాటికి ప్రత్యామ్నాయాలను అప్లోడు చేస్తాను, అప్పుడు ఈ బొమ్మలన్నిటినీ తొలగించవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:36, 28 మార్చి 2008 (UTC)

ఈ విషయం నాకు తెలియదు. మీరే చేశారనుకొన్నాను. నేను చేసిన మార్పులను రద్దు చేయగలవా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:58, 28 మార్చి 2008 (UTC)

మెదటి పేజిసవరించు

ఒక సారి సభ్యులు:Sai2020/ప్రయోగశాల/మెదటి_పేజి చూసి ఏలా ఉందో చెబుతారా? సాయీ(చర్చ) 05:24, 30 మార్చి 2008 (UTC)

WP:WAకి విష్ణు సహస్రనామ స్తోత్రముకి ఏంటి సంబంధం? సాయీ(చర్చ) 05:01, 31 మార్చి 2008 (UTC)
ఓ అలాగా. దానికి మూస లాంటిది తయారుచేయడం కుదరదా? సాయీ(చర్చ) 06:06, 31 మార్చి 2008 (UTC)

మొదటి పేజీగురించి మీ అభిప్రాయాలు తెలుపనేలేదు. సాయీ(చర్చ) 06:35, 31 మార్చి 2008 (UTC)

Usurpation requestసవరించు

Hi Mpradeep, I had made comments on your user page at your user talk page at enwp. Kindly respond to that on enwp. Thanks, 202.153.43.50 09:21, 2 ఏప్రిల్ 2008 (UTC)

క్రొత్త దళాల ప్రతిపాదనసవరించు

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) లో క్రొత్త దళాల ఏర్పాటు ప్రతిపాదించాను. ఒకసారి చూడండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:56, 2 ఏప్రిల్ 2008 (UTC)

బాట్లుసవరించు

మీరు విక్షనరీ లో వాడిన బాటును ఉపయోగించి,అందులోని కొన్ని పదాలను భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము మొదలైన వర్గాల క్రింద చేర్చాలనుకుంటున్నాను. ఆ బాటును ఎలా నడపాలో కొంచెం తెలియ జేయగలరా? మీకు సమయం ఉన్నపుడే సమాధానమీయండి తొందరేమీ లేదు రవిచంద్ర(చర్చ) 13:19, 4 ఏప్రిల్ 2008 (UTC)

Return to the user page of "Mpradeep/పాత చర్చ 5".