Satyavani గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 16:29, 2 ఏప్రిల్ 2006 (UTC)Reply

మీ రచనలు

మార్చు

Satyavani గారూ, సభ్యత్వం తీసుకుంటూనే మంచి విషయాలపై రచనలు మొదలుపెట్టారు, అభినందనలు. కొన్ని సూచనలు చెయ్యదలచాను. పరిశీలించండి.

  1. రంగనాయకమ్మ గారిపై పేజీ ఇప్పటికే రంగనాయకమ్మ పేరుతో ఉంది. మీరు రాసిన ఆమె రచనల జాబితాను ఆ పేజీకి చేర్చండి.
  2. పోతే రంగనాయకమ్మ గారి ఇంటి పేరు ముప్పల అని రాసారు.. అది సరియేనా!? ముప్పాళ్ళ అని అనుకుంటున్నాను.., ఖచ్చితంగా తెలీదులెండి. మీరు రాసిందే సరైనదైతే, ముప్పల రంగనాయకమ్మ పేజీని రంగనాయకమ్మ పేజీకి దారిమార్పు పేజీగా మార్చవచ్చు. ఏదేమైనా ఆమె తన ఇంటి పేరును రాసుకుంటున్నట్లు లేరు, పరిశీలించండి.
  3. అలాగే, ఎల్. వి. ప్రసాద్ పేరిట కొత్త పేజీ సృష్టించారు. కాని ఎల్.వి.ప్రసాద్ పేరిట ఓ పేజీ ఇప్పటికే ఉంది. పేరు రాసే విధంలో ఉన్న చిన్న చిన్న మార్పుల కారణంగా ఒకే విషయానికి అనేక పేజీలు తయారయ్యే అవకాశం ఉంది. ఎల్.వి.ప్రసాద్ గారిపై వ్యాసాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. మీరు సృష్టించినది నాలుగో పేజీ అనుకుంటాను. ఇప్పటికే ఎల్వీ ప్రసాద్, ఎల్వీ ప్రసాదు పెరిట మరో రెండు పేజీలు కూడా ఉన్నాయి. అయితే అవి దారిమార్పు పేజీలే - అన్నీ కలిపి ఒకే పేజీకి వెళ్తాయి. దీన్ని నివారించేందుకు ఇప్పటికే సదరు విషయాలపై వ్యాసాలున్నాయేమో పరిశీలిస్తే మంచిది. మీరిప్పటికే తెలుగు సినిమా పేజీని చూసినట్లే అనిపిస్తోంది. అలాగే కింది పేజీలను కూడా చూడండి.
  4. నందమూరి తారక రామారావు పేజీలో బాల్యము, విద్యాభ్యాసము విభాగాన్ని తీసేసినట్లున్నారు. అందుకు గల కారణాన్ని ఆ వ్యాసపు చర్చా పేజీలో వివరించగలరు.
  5. చలం గారి పేరు వెంకటాచలమా లేక వెంకటచలమా? -పరిశీలించగలరు.

ఇవి కేవలం సూచనలే! లోపాలెంచుతున్నట్లుగా భావించకండి. సహృదయంతో స్వీకరించగలరు. నా సూచనలలో ఏమైనా తప్పులుంటే తప్పక నాకు చెప్పండి. __చదువరి (చర్చ, రచనలు) 17:19, 2 ఏప్రిల్ 2006 (UTC)Reply

మీరు చేసిన మార్పులు చూసాను, థాంక్స్. రామారావు పేజీలో మార్పులు చేసింది మీరని పొరబడ్డాను, సారీ! ఇక్కడ రచనలు చెయ్యడంలో మీకు ఉపయోగపడగల కొన్ని లింకులు పైనిచ్చిన స్వాగతం! పెట్టెలో ఉన్నాయి. వికీ గురించి తెలియజెప్పే మంచి లింకులవి. అన్నట్లు.. నాలుగు, ఐదు టిల్డెలు వాడి చూసారా? __చదువరి (చర్చ, రచనలు) 09:23, 4 ఏప్రిల్ 2006 (UTC)Reply