Teluguthanam
Joined 21 అక్టోబరు 2022
తాజా వ్యాఖ్య: వికీపీడియా:సత్వర తొలగింపు హేతువులు పేజీలో మీ దిద్దుబాటు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
స్వాగతం
మార్చుTeluguthanam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
Teluguthanam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:MYADAM ABHILASH గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు MYADAM ABHILASH గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
- తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 04:53, 21 అక్టోబరు 2022 (UTC)
వికీపీడియా:సత్వర తొలగింపు హేతువులు పేజీలో మీ దిద్దుబాటు
మార్చునమస్కారమండి. మీరు వికీపీడియా:సత్వర తొలగింపు హేతువులు పేజీలో చేసిన ఈ దిద్దుబాటులో రెండు సత్వర తొలగింపు హేతువులకు సంబంధించిన మూసల లింకులను తీసేసారు. కారణం ఏమిటో అర్థం కాలేదు. వివరించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 09:21, 21 అక్టోబరు 2022 (UTC)
- మీరు బాగున్నారని ఆశిస్తున్నాను సార్. ఈ టెంప్లేట్‌లను ఉంచడం వల్ల, కొంతమంది ఎడిటర్‌లు ఎటువంటి కారణం లేకుండా ముఖ్యమైన పేజీలను తొలగించడానికి వాటిని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. వారు వివరణ ఇవ్వడం లేదు లేదా కనీసం pageకి మార్పులు చేయడం లేదు కానీ సరైన కారణం లేకుండా తొలగించడానికి ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా a1,a2,a3,a4,a5 ట్యాగ్‌లను ఉపయోగించవచ్చు. అలాగే దయచేసి మీ ఫోన్ నంబర్‌ను నాకు అందించగలరు, తెలుగు వికీపీడియా కంట్రిబ్యూటర్‌లుగా మేము ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండగలము. ముఖ్యమైన జాతీయ వార్తా కథనాలలో వ్యక్తి కనిపించినప్పుడు కూడా, వారు దానిని తొలగిస్తున్నారు. కొన్నిసార్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వారు 20,000 రూపాయలు చెల్లించాలని మరియు పేజీలను తొలగించవద్దని అడుగుతున్నారు. ఇది నిజంగా తప్పు Teluguthanam (చర్చ) 09:35, 21 అక్టోబరు 2022 (UTC)
- అయ్యా,
- గతంలో స్పాముగా భావించి, ఇక్కడా ఎన్వికీ లోనూ తొలగించిన పేజీనే మీరు మళ్ళీ సృష్టించారు. అది తప్పు.
- మళ్ళీ అవే మూలాలు, అలాంటి మూలాల తోనే మళ్ళీ సృష్టించారు. అది తప్పు.
- ఆ విషయాలు చెబుతూ వేరే వాడుకరి "సత్వర తొలగింపు" మూసను చేర్చారు. అది వికీలో మామూలు పద్ధతే. తప్పు కాదు.
- ఆ వాడుకరి, వ్యాసంపై చర్చ పేజీలో తన అభిప్రాయాన్ని చెబుతూ చర్చ మొదలుపెట్టారు. అది వికీ పద్దతే, తప్పు కాదు.
- మీరు వ్యాసంలో చేర్చిన మూసను తీసేసారు. కారణమేదైనా అలా చెయ్యకూడదు, అది తప్పు.
- చర్చ పేజీలో ఆ వాడుకరి రాసినదాన్ని తీసేసారు. చర్చ పేజీలో ఎవరైనా రాసిన దాన్ని తీసెయ్యడం, మార్చడం చెయ్యకూడదు. అది తప్పు.
- మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిన తరువాత ఆ తప్పులను సవరించుకునే ప్రయత్నం చెయ్యక పోగా, వికీపీడియా:సత్వర తొలగింపు హేతువులు పేజీలో తొలగింపు మూసల ప్రసక్తిని తీసేసారు. అది తప్పు. అదేమని అడిగితే మీరు ఇచ్చిన సమర్థన, సమర్థనీయం కాదు.
- ఇన్ని తప్పులు చేసాక, వాటి గురించి ఇతరులు చెప్పాక, మీరు మీ తప్పులను సవరించుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు. చెయ్యక పోగా. "వారు 20,000 రూపాయలు చెల్లించాలని మరియు పేజీలను తొలగించవద్దని అడుగుతున్నారు." అని ఆరోపణలు చేసారు. ఇలాంటి ఆరోపణలు చెయ్యడం ఇది రెండో సారి. మొదటిసారి చర్చ:బీరా ఆండ్రూ సూరజ్ పేజీలో ఈ ఆరోపణ చేసినపుడు, తగిన ఆధారాలను చూపించాల్సిందని అడిగాను. మీరు ఆధారాలేమీ చూపించలేదు గానీ, మళ్ళీ ఇక్కడ అవే ఆరోపణలు చేసారు. ఇది తప్పు
- మీరు ఆధారాలేమీ చూపించకుండా ఇకపై ఇలాంటి ఆరోపణలు చెయ్యకండి. ఇలాంటి ఆరోపణలు మళ్ళీ చేస్తే వికీ విధానాలకు అనుగుణంగా మీపై చర్య తీసుకునే అవకాశం ఉంది.
- పోతే, నా ఫోను నంబరడిగారు.. వికీ గురించి మీరు నాతో ఏమైనా సంప్రదించదలిస్తే వికీలోనే చెయ్యండి. నేను ఇతర మార్గాల్లో సంప్రదింపులు చెయ్యను. __చదువరి (చర్చ • రచనలు) 00:54, 22 అక్టోబరు 2022 (UTC)
- అయ్యా,