Venkataramana kasupu
స్వాగతం
మార్చుVenkataramana kasupu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున (చర్చ) 00:14, 10 జూన్ 2021 (UTC)
మీరు రచ్చబండలో చేర్చిన విషయం రద్దు చేశాను
మార్చు@Venkataramana kasupu గారు, వికీపీడియాకు స్వాగతం. రచ్చబండలో వికీపీడియా కు సంబంధించిన విషయాలే చర్చించాలి. కావున ఆన్లైన్ క్లాసులకు సంబంధించి మీరు చేర్చిన విషయం రద్దు చేశాను. పై స్వాగత సందేశంలో విలువైన సమాచార లింకులు ద్వారా వికీపీడియా గురించి మరింత తెలుసుకొని వికీపీడియాలో కృషి చేయమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 00:17, 10 జూన్ 2021 (UTC)
మానుకోట జర్నలిస్టులు.. వెంకటరమణ కసుపు, 9885398881
మార్చుగల్లీ నుంచి ఢిల్లీ వరకు జర్నలిజం మైలురాళ్లను గమనిస్తే మానుకోట ఆనవాళ్లు అడుగడుగునా పలుకరిస్తూనే ఉంటాయి. సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని ప్రత్యేక రాష్ట్ర తొలి, మలిదశ ఉద్యమాలను ప్రపంచానికి చాటిన పాత్రికేయ ప్రముఖుల్లో మనోళ్లు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. భుజానికి నూలు సంచి, అందులో కాగితాలు, సిరా కలంతో వార్తలను సేకరించిన తొలి విలేకరులు జిల్లాలోనూ ఉన్నారు. రజాకార్ల నిర్బంధంలో సైతం ప్రాణాలకు లెక్కచేయకుండా నిజాలను నిర్భయంగా రిపోర్టు చేసిన త్యాగధనులు మహబూబాబాద్ మట్టినుంచి పుట్టిన వారే. అప్పట్లో ఆకాశవాణి రేడియోకు, దూరదర్శన టీవీ కేంద్రానికి మొదలుకొని ప్రస్తుత ప్రధాన దినపత్రికలు, శాటీలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ లైవ్‌ల వరకు మహబాద్ జర్నలిస్టులు వార్తలు అందిస్తూనే ఉన్నారు. బస్సులకు కవర్లు పంపే రోజుల నుంచి సెల్‌ఫోనలో వాయిస్ టైపింగ్‌తో వార్తలు ఫ్లాష్ చేస్తున్న స్మార్ట్ విలేకరుల వరకు అన్ని కాలాల్లోనూ పాత్రికేయాన్ని పరిపూర్ణం చేసిన విలేకరులు ఈ జిల్లాలో ఉన్నారు. మానుకోట జర్నలిస్టులకు ఘన చరిత్రే ఉంది. సమకాలీన సామాజిక పరిస్థితుల ప్రభావానికి లోనుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా తమ చుట్టూరా ఉన్న సామాజిక ఘటనలకు వెలుగులోకి తెచ్చిన, తెస్తున్న వారెందరో ఉన్నారు. సామాజిక ప్రభావాలను బాహ్యప్రపంచానికి తెలియజేయడానికి సాధారణంగా చాలా మంది ఎన్నో ఉదాత్తమైన సిద్ధాంతాలు, విలువల గురించి చెబుతున్నా, వాటిని వంద శాతం ఆచరించి అలాంటి నిఖార్సయిన కథనాలు రాసి సమాజంలో విలువు పాదుకొల్పడంలో కృషిచేసిన కలంవీరులకు ఇక్కడ కొదువలేదనేది అక్షర సత్యం. జర్నలిజంలోని అన్ని విభాగాల అనుభవం ఉన్న పాత్రికేయులు మానుకోటలో ఉన్నారు. క్రైం, సాహిత్య, బిజినెస్, వ్యవసాయ, విద్య విలేకరులు మొదలు కొని స్టాఫర్లు, బ్యూరో ఇనచార్జ్‌లు, ఇనపుట్, అవుట్‌పుట్ ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, ఎడిటర్ల వరకు దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు. 80 లలో జిల్లాలో ప్రాచుర్యంలోకి వచ్చిన దిన పత్రికల్లో పనిచేసి ప్రస్తుతం కాలంచేసిన పాత తరం పెనపవర్ ఉన్న వారి స్ఫూర్తిగా ప్రస్తుత టెక్ యుగంలో ఇనస్టంట్‌గా ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే న్యూస్ ప్రసెంట్ చేస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఫ ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులు ఉమ్మడి ఆంధ్రప్రదేశలో తొలి తెలుగు విలేకరులుగా ఖ్యాతి గడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు జర్నలిస్టులుగా రాణించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. సరైన రవాణా, ప్రసార సాధనాలు లేని కాలంలోనే ఈ సోదరులు ఒక పత్రికను నిర్వహించి దానికి సంపాదకులుగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో విద్యా, విజ్ఞానదాయక చైతన్య స్ఫూర్తి కలిగించే పత్రికలు లేవని భావంచి ‘ తెనుగు’ దుందుభి పేరుతో 27.8.1922న తొలి సంచికను వెలువరించారు. తెలుగునాట, ప్రత్యేకించి తెలంగాణా సామాజిక, సాహిత్య వికాసంలో వైతాళికులు వీరు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరు స్దాపించిన ‘ తెనుగు’ దుందుభి పత్రిక మూలంగా ఎందరోవ్యాసరచయితలు వెలుగులోకొచ్చారు. సాహిత్యసంబంధ అంశాలను ‘రిపోర్టింగ్’ చేయడంలో ఒరవడి పెట్టింది వీరితోనే. వీరి సాహితీ సృజన అన్ని ప్రక్రియల్లోనూ సాగింది. అలాగే వైవిధ్యంతో కూడిన రచనలు సుమారు 75 రచించగా వాటిలో 32 మాత్రమే ప్రచురితమైనాయి. వీటిలో సీతారామచంద్రరావు పేరిట 58 గ్రంథాలు, రాఘవ రంగారావు పేరుతో 13 గ్రంథాలు కాకుండా ఇద్దరూ జంటగా రాసినవి 4 గ్రంథాలు ఉన్నాయి. అనువాదరంగంలో వారి ప్రత్యేకతగా చెప్పుకుంటే ఆంగ్లంలో స్వతంత్ర రచనలుచేశారు. స్వయంకృషితో భాషలు నేర్చుకోవడంలో ఆంగ్లంతో మొదలుపెట్టి రవీంద్రనాథ్ రెక్ నవలలను ‘నౌకాభంగం’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఉర్దూ గస్తీ తిరిగే గుర్రం సవారీల వద్ద నేర్చుకున్నారు. గ్రామంలో తోళ్ళవ్యాపారం చేేస తమిళ ముస్లిం వ్యక్తికి తెలుగు నేర్పించి, అతడి వద్ద తమిళం నేర్చుకుని పుస్తకాలు చదివారు. ఒద్దిరాజు సోదరులు కలిసి ‘ఉపదేశ రత్నమాల, తిరుప్పల్లాండు, భక్తిసార చరిత్ర, సంస్కృత వ్యాకరణము రచించారు. చక్కని భాషలో, చక్కని భావంతో ఎన్నో కవితాఖండికలను రాశారు. ‘తెనుగు’ పత్రిక పైభాగాన ఇలా ప్రచురించేవారు.. ‘తే.గి. వార్తయందు జగము వర్థిల్లు తున్నదియదియు లేనినాడ యఖిలజనులునంధకార మగ్నులగుదురు గావునవార్త నిర్వహింప వలయు బతికి’ అది వారి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తోంది. నూట పాతిక సంవత్సరాల క్రితం జన్మించిన ఒద్దిరాజు సోదరులను ఇప్పటికీ స్మరిస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నామంటే తెలుగు సాహిత్య సంస్కృతులకు, జర్నలిజానికి వారు చేసిన సేవలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. ఫ కొండపల్లి సుభాష్
మహబూబాబాద్ పట్టణంలోని రెడ్డి బజార్‌లో నివాసం ఉండే కొండపల్లి సుభాష్ 1941లో జన్మించారు. ఆయన సుమారు 50 ఏళ్లపాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 5 సెప్టెంబరు 2007లో కాలం చేశారు. 1978నుంచి జర్నలిజంలో కొనసాగారు. 16ఏళ్లు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ఆంధ్రభూమి, వరంగల్ వాణిలో స్థానిక ప్రతినిధిగా సేవలందించారు. అనంతరం ఆయన సత్య అనే వార పత్రికను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన మహబూబాబాద్ శాఖకు కార్యదర్శిగా సేవలందించారు.
ఫ ఫరీద్ కైసర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ ప్రాంతం నుంచి పేరున్న జర్నలిస్టుగా ఫరీద్ కైసర్‌కి గుర్తింపు ఉంది. 70వ దశకం చివరలో 80వ దశకం ప్రారంభంలో పలు హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉర్దూ దిన పత్రికలలో ఆలోచింపజేసే కథనాలను ఫరీద్ కైసర్ రాశారు. సియాసత, రహమాన్యా దక్కనతో పాటు మరో మూడు ఉర్దూ పత్రికలకు ఆయన వార్తలు రాసేశారు. 1990వ సంవత్సరంలో ఫరీద్ కైసర్ మానుకోటలో కన్నుమూశారు. ఫ భువనగిరి నారాయణ గుప్తా
మహబూబాబాద్ పట్టణానికి చెందిన భువనగిరి నారాయణ గుప్తా స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో తన కలం రాతలతో నిజాం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మానుకోట పట్టణంలో భువనగిరి సోమయ్య గుప్తా, కమలమ్మలకు 24 ఫిబ్రవరి 1919న ఆయన జన్మించారు. ప్రజాబంధు వార పత్రికలో 12డిసెంబరు 1947లో నిజాం నిరంకుశ పాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పైశాచిక దమన నీతిని ఖండిస్తూ, హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత యూనియనలో కలవాల్సిన అవసరాన్ని వ్యాసరూపంలో రాశారు. దీంతో ఆయనపై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీచేసింది. నాటి నుంచి జాతీయ నాయకులలో ప్రముఖ జర్నలిస్టుగా కీర్తిప్రతిష్టలు సంపాదించారు. తక్కువ కాలంలోనే సంపాదకుడిగా ఎదిగారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషలలో 9 పత్రికలకు సంపాదకత్వం వహించారు. పత్రికా రంగంలో ఒక ఒరవడిని నెలకొల్పారు. పిక్టోరియల్ ఆంధ్రప్రదేశ అనే సచిత్ర పత్రికను హైదరాబాద్‌లో స్థాపించి నిర్వహించారు. రచనా రంగంలో విరి అద్వితీయ కృషికి మరో నిదర్శనం ఖమ్మం జిల్లా సర్వస్వం. మానుకోట, వరంగల్ వాణి, ఖమ్మం నాడు-నేడు, మహబూబాబాద్ టేడు, వరంగల్ బెలెటిన, కామన టూరిస్టు, ఉర్దూలో సియాహత అనే పత్రికలను ఎంతో హుందాగా నిర్వహించారు. మూడు సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా పత్రికా రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1951లో ఇంటర్ నేషనల్ టూరిస్టు క్లబ్‌ను స్థాపించారు. 1942లో బి.యన్.గుప్త భారతదేశంలోనే మొదటిది అనదగిన సంఘటిత రైతు సంఘమైన ‘‘తులారాం ప్రాజెక్టు రైతు సంఘాన్ని స్థాపించి నాటి అఖిల భారతీయ నాయకుల ఆశీస్సులు పొందారు. పదివేల ఎకరాల భూమిని పేదలకు పంచారు. వీరు 26డిసెంబరు 2001న కన్నుమూశారు.
ఫ మహ్మద్ అబ్ధుల్ ఉబేద్ ఎనబయ్యవ దశకంలో మానుకోట నుంచి పత్రికలకు వార్తలను పంపిన వారిలో మహ్మద్‌అబ్ధుల్ ఉబేద్(ఎంఏ ఉబేద్) ఒకరు. హబూబాబాబాద్ పాతబజారులో రైల్వే స్టేషన సమీపంలో నివాసం ఉండే ఆయనకు సాహిత్యంపై మక్కువ అధికంగా ఉండేది. ఈనాడు దినపత్రికకు వార్తలను ఆయన పంపేవారు. అప్పట్లో పెద్దగా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సైకిల్‌పైనే వార్తాసేకరణకు వెళ్లేవారు. 1986వ సంవత్సరంలో ఓ మిత్రుడితో కలిసి ఇంట్లోనే వార్తాలహరి పేరుతో వారపత్రికను ప్రారంభించారు. సొంతంగా కంపోజింగ్ ప్లేట్లు తయారు చేసి ఆయనే ప్రింటింగ్ చేసేవారు. కాల క్రమంలో కొందరు సహాయకులను నియమించుకున్నారు. స్వతహాగా విద్యావేత్త అయిన ఆయన నేతాజీ విద్యాలయం పేరుతో ఓ పాఠశాలను నడిపి వేలాడి మంది శిష్యులకు అక్షరజ్ఞానం అందించారు. స్థానిక సమాచారాన్ని అందించడంలో ఆయన ఎంతో చురుగ్గా వ్యవహరించేవారు. మానుకోటలో తొలిసారిగా వార్తాలహరి టెలీఫోన డైరెక్టరీని రూపొందించడం విశేషం. ఫ సుంకరి వీరయ్య రెండు ప్రధాన పత్రికలకు ఎడిటర్‌గా సంపాదకీయ బాధ్యతలు నిర్వహించిన సుంకరి వీరయ్య నాలుగ్గోడల నడుమ ఇముడలేక, తానకు నచ్చిన, తాను మెచ్చిన మాస్ క్యాడర్‌కు సేవలందించడానికే మొగ్గుచూపారు. మహబూబాబాద్ పాతబజారులోని శికారుఖాన గడ్డఏరియాలో పుట్టి పెరిగిన సుంకరి వీరయ్య విద్యార్థి దశలోనే ఎర్రజెండాకు ఆకర్షితులయ్యారు. 1976లో 17 ఏళ్లున్నప్పుడు ఇంటర్ సెకండియర్ చదివే సమయలో ఎస్‌ఎఫ్‌ఐ నుంచి ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం ట్రేడ్ యూనియన(సీఐటీయూ)లో పనిచేస్తుంగా 1994నుంచి పదేళ్ల పాటు ‘కార్మికలోకం’ అనే మాస పత్రికకు ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా, అనంతరం 2004నుంచి పదేళ్లపాటు 2014 వరకు అదే మాసపత్రికకు ఎడిటర్‌గా సేవలందించారు. సీఐటీయూలో రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో నిత్యం బిజీ ఉండే వీరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 2014-15 సంవత్సరం ప్రజాశక్తి దిన పత్రికకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కొత్తగా ఏర్పాటైన నవతెలంగాణ దినపత్రికకు తొలి ఎడిటర్‌గా 21మార్చి 2015 నుంచి ఏడేళ్ల పాటు పనిచేశారు. పొలిటికల్ పార్టీ బాధ్యుడిగా వందల వ్యాసాలు రాసిన ఆయన దిన పత్రికకు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లో ఎడిటోరియల్ సభ్యుల నుంచి నేర్చుకోవడాన్ని ఏమాత్రం చిన్నతనంగా భావించలేదు. డైలీ పేపర్‌లోని వేగవంతమైన సాహిత్యానికి, మాస పత్రిల్లోని విశ్లేషణాత్మక వ్యాసాలకు ఉన్న తేడాను గమనించిన ఆయన తనకు తాను ఆమేరకు మల్చుకున్నారు. అటు ప్రజాశక్తి, ఇటు నవతెలంగాణలో ప్రతీ వారం ఆయన ఒక వ్యాసాం, మరో సంపాదకీయం రాసేవారు. ఆయన ‘సమకాలీనం’ శీర్షికతో రాసిన వ్యాసాలకు పాఠకాధరణ అధికంగా ఉండేది. ఉదయం 6 గంటలకు నిద్రలేచే ఆయన రాత్రి 11నుంచి 12గంటల మధ్య నిద్రకు ఉపక్రమించేలా ఫిక్స్‌డ్ టైంటేబుల్‌ను అలవర్చుకున్నారు. ఈ క్రమశిక్షణ వల్ల న్యూ టీమ్, బోర్డు మీటింగులు, ఫీచర్జ్, బ్యూరో, మఫిసియల్, జనరల్ డెస్క్ సభ్యులతో జరిగే సమావేశాలకు ఎంతో ఉత్సాహంగా హాజరై తగిన సూచనలు చేసేవారు. బ్యానర్‌తో పాటు ప్రధాన వార్తల కూర్పులో కీలకంగా వ్యవహరించేవారు. తెలుగు భాషమీద గట్టి పట్టున్న సుంకరి వీరయ్య ఏకబిగిన శీర్షికలకు వ్యాసాలను పూర్తిచేసేవారు. నవతెలంగాణ ఎడిటర్‌గా పత్రికా రంగంలో మంచి శీర్షికలు ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ‘వేదిక’ శీర్షిక కోసం 250 మంది కొత్త రైటర్స్‌ను ఎంపిక చేసి వారితో ప్రజా సమస్యలపై, విభిన్న అంశాలపై వ్యాసాలు రాయించారు. వాటిలో ఒక శీర్షిక తెలంగాణ ప్రజల సాంస్కృతిక విలువలపై ఉంటే మరోది సామాజిక వివక్షపై ఉండేది. ప్రధానంగా ‘మానవి’ మహిళల సాధికార, వివక్షపై తెరమీదికి తెచ్చిన శీర్షిక హైలెట్‌గా నిలిచింది. నవతెలంగాణ పత్రికలో స్పోర్ట్స్, సినిమా పేజీలు విభిన్నంగా ఉండేలా తగిన విధంగా ప్రణాళిక రూపొందించడం వీరయ్యకే చెల్లింది. సుంకరి వీరయ్య సతీమణి కొండాబత్తుల రాజకుమారి కూడా జర్నలిస్టు కావడం విశేషం. మచిలీపట్నానికి చెందిన ఆమె ప్రజాశక్తిలో కీలక బాధ్యలు నిర్వహించారు. బోర్డు మెంబరుగా, మఫిసియల్ ఇనచార్జ్‌గా కూడా వ్యవహించారు. ప్రజాశక్తి దిన పత్రిక ప్రారంభం నుంచి ఆమె పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఫ రాజోలు చలపతి మహబూబాబాద్ జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన చలపతి అగ్రశ్రేణి జర్నలిస్టుల్లో ఒకరు. ఆయన స్ఫూర్తితో, సలహాలు సూచనలతో పదుల సంఖ్యలో జర్నలిజంలో రాణిస్తున్నారు. పల్లె నుంచి పట్నం వరకు సాగిన ప్రయాణంలో అనేక ప్రధాన సంఘటన వార్తాంశాలను ఎడిటింగ్ చేసి పాఠకులకు అందజేశారు. 1992లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రస్థానం ప్రారంభించి 1994లో సాక్షి పత్రికలో చేరి మఫిసియల్ డెస్క్‌లో రాణిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ రెసిడెంట్ ఎడిటర్ స్థాయిలో సేవలందించారు. ఫ కొండపల్లి కేశవరావు 80వ దశకం తొలినాళ్లలో అగ్రశ్రేణి పాత్రికేయులుగా చలామణి అయిన వారిలో కొండపల్లి కేశవరావు ఒకరు. అప్పట్లో జిల్లా కేంద్రాల్లో మాత్రమే పత్రికా కార్యాలయాలు ఉండేవి. ఆయన మానుకోట నుంచి రైలులో వార్తలు పంపేవారు. పెద్దగూడూరు నుంచి బస్సులో పంపేవారు.. ఇమ్లీబన బస్‌స్టేషనలో వివిధ పత్రికల బాక్సులు ఉండేవి. డ్రైవర్‌కు రూ.5 ఇచ్చి పంపితే అక్కడ బాక్సుల్లో వేసేవారు. అర్జంటు అంటే కేవలం ఎక్స్చేంజ్ కు ఫోనచేసి నెంబరు కలపాల్సి వచ్చేది. పదికిలోమీర్లయినా సైకిల్‌నే ఆశ్రయించేవారు. 1981లో ఈనాడు పత్రికకు విలేకరిగా పనిచేసే కాలంలో తొర్రూరుకు ఒకరు, గూడూరుకు మరొకరు, నర్సంపేట ఇంకొరు.. వరంగల్‌లో స్టాఫర్ ఉండేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పోటీ పడేవి. స్థానిక విలేకరులు సుభాష్‌చందర్, ఉబేద్‌తో కేశవరావు పోటీపడేవారు. 1983 ఎన్నికలు ఎన్టీరామారావు నన వరంగల్ జిల్లాఅంతా తిరిగారు. కేశవరావు లా పట్టభద్రుడు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో మంచి పట్టు ఉండటంతో సంస్థ ప్రధాన బాధ్యతలు అప్పగించేది. మానుకోట నుంచి ఉదయం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్‌కు వెళ్లి వార్తలు అక్కడి కార్యాలయంలో ఇచ్చేవారు. ఏ వార్త అయినా వయా స్టాఫర్‌నుంచే హెడ్ ఆఫీస్‌కు చేరేది. అప్పట్లో కాలమ్ సెం.మీల లెక్కన ఆయనకు ఈనాడులో నెలకు రూ.800 పారితోషికం అభించేది. 1984లో ఆంధ్రప్రభలో చేరారు. 1986లో మహబూబాబాద్ కేందరంగా వార్తాలహరి వార పత్రికను ప్రారంభించారు. తానుఅసోసియేట్ ఎడిటర్‌గా, ఉబేద్ ఎడిటర్‌గా పత్రిక ప్రారంభించారు. అప్పటి ఎంపీ జంగారెడ్డి తో ఢిల్లీకి వెళ్లి ఆయన ఇంట్లోనే వారం రోజుల పాటు ఉండి ఆర్‌ఎనఐ రిజిసే్ట్రషన చేయించారు. 1994వరకు వార్తలహరిని నడిపి అనంతరం కోర్టుకే పూర్తి సమయం కేటాయించారు. ఆయన ఈనాడులో పనిచేసే రోజుల్లో జరిగిన టీడీపీ నేత గండి అయిలయ్య హత్య ఉదంతాన్ని హెడ్‌ఆఫ్‌సుకు రాత్రి 12.50 సమయంలో చేరవేయడంతో బ్యానర్ వార్త ప్రచురితమై సంచలనం సృష్టించింది. మేళ్లచర్వ నాగేశ్వరరావు, దేవయ్యను హత్య ఉదంతంలో అనంతరం మెజిస్ర్టీరియల్ విచారణ జరిగింది. అయితే ఎంక్వయిరీ సందర్భంగా గ్రామస్థులను మానుకోట కృష్ణా లాడ్జీలో నిర్బంధించిన విషయాన్ని స్టాఫర్ డేట్‌లైనతో రాయించారు.. పీపుల్స్‌వార్ నేత కొండపల్లి సీతారామయ్య ఆసుపత్రి నుంచి తప్పించుకున్న నెల రోజులకే.. అదే తీరులో గండి అయిలయ్య హత్యకేసు నిందితుడు వీరారెడ్డి వరంగల్ ఎంజీఎం నుంచి పరారయ్యాడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరాయైున విధానంపై కథనం రాశారు. అది మాడభూషి శ్రీధర్ సొంత పత్రిక వరంగల్ వాణిలో కథనం ప్రచురితం అయ్యి సంచలనంగా మారింది. కశ్మీర్ టు కన్యాకకుమారి రథ యాత్రలో మానుకోటకు వచ్చిన ఎల్‌కే అద్వానీని ఇంటర్వ్యూ చేశారు. టీడీపీ ప్రారంభ దశలో సమితి ప్రసిడెంట్‌తో సహా సభుయలు కాంగ్రెస్ నుంచిటీడీపీలోకి మారాలని రామప్పలో సమావేశం అయ్యారనే వార్త ప్రముఖంగా అచ్చవడంతో రాజకీయంగా సంచలనం సృష్టించింది. సీనియర్ ఎన్టీఆర్‌తో కేశవరావుకు మంచి పరిచయం ఉంది Venkataramana kasupu (చర్చ) 18:42, 16 నవంబరు 2022 (UTC)