వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 1

తాజా వ్యాఖ్య: గాంధీపుట గురించి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
ఈ నాటి చిట్కా...
"ఉపవర్గాలు ఎలా మొదలుపెట్టాలి?"

ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మల కాపీ హక్కులు

మార్చు

Vu3ktb గారూ! మీరు రెండు బొమ్మలు అప్‌లోడ్ చేశారు. కృతజ్ఞతలు. కాని

  1. వాటి కాపీ హక్కులు గురించి వ్రాయలేదు. ఈ ఫొటోలను మీరే తయారు చేస్తే, వాటిని వికీపీడియా ఉంచాలని నిర్ణయించుకుంటే గనక, ప్రస్తుత మున్న ఈ సందేశాన్ని తొలగించేసి GFDL లైసెన్సుతో ఇవ్వాలనుకుంటే {{GFDL-సొంతకృతి}} అని, లేదా క్రియేటివ్ కామన్స్ లైసెన్సుతో వికీపీడియా లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలనుకుంటే {{cc-by-sa-2.5}} అని, లేదా ఎవరయినా ఎటువంటి పనికైనా వాడుకునే విధంగా అయితే {{PD-సొంతకృతి}} అని చేర్చండి.
  2. ఊరి పేరు "వెన్నొతల" అని వ్రాశారు. ఆ వూరు ఏ జిల్లా ఏ మండలంలో ఉందో తెలియలేదు. ఒకవేళ వ్రాయడంలో ఏమైనా అచ్చుతప్పులున్నాయేమో తెలియదు. (బొమ్మల వ్యాఖ్యలను ఆంగ్లంలో కూడా వ్రాస్తే ఉపయోగకరంగా ఉంటుంది.) వూరి పేరు సరిగ్గా తెలిస్తే ఆ బొమ్మలను తగు వ్యాసంలో పెట్టవచ్చును.
  3. మీ వూరి గురించీ, మీకు తెలిసిన ఇతర వూళ్ళగురించీ కూడా వీలైనంత సమాచారం వ్రాయమని అభ్యర్ధన.

మరేమైనా సమాచారం కావలసివస్తే నా చర్చాపేజీలో వ్రాయగలరు.

--కాసుబాబు 05:55, 2 మార్చి 2008 (UTC)Reply

బొమ్మ:IMG 1177a.JPG - ఈ ఫొటోను తీసిన సభ్యులు:Vu3ktb స్వయంగా దీనిని అప్‌లోడ్ చేశారు. కాని లైసెన్సు వివరాలు ఇవ్వడం మరచారు. కనుక వారికి అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో {{GFDL}} లైసెన్సు పట్టీని ఉంచుతున్నాను. --కాసుబాబు

వెన్నూతల, శాయపురం

మార్చు

వూరి సరైన పేరు - వెలెనుతల? వెన్నూతల? మరేదైనానా? తెలుపగలరు.

మీ ఊరిని గురించిన చరిత్రను ఇలా రాయండి. ఊరి పెద్దల కధనం ప్రకారం ఊరి చరిత్ర ఇలా ఉన్నది. ఇలా మొదలెట్టి మీ ఊరిని గురించి వ్రాయండి. వీడియో అప్లోడు చెయ్యవలసిన అవసరం ఉమ్డదు. అభినంధనలతో .--విశ్వనాధ్. 13:16, 6 మార్చి 2008 (UTC)Reply
వెన్నూతల సరయిన పెరు. నెను అప్ లొడ్ ఛెసిన మెలు రాయి మీద కూద ప్రభుత్వము వారు కూడ వెన్నూతల అని మాత్రమె వ్రాయింఛినారు.
ఒక పురాతన గ్రుహమునకు సంబంధింఛిన ఛిత్రము అప్ లొడ్ ఛెసాను. దయఛెసి అది కూడ వెన్నూతల పుటకు అనుసంధింఛగలరు.

--శివరామప్రసాదు కప్పగంతు - వియు3కెటిబి


కాసుబాబుగారు, వెన్నొతల (ఉన్గుతురు మండలము) శాయపురం పెజీలలొ ఫొటొలు కనపదటమ్లెదు. దయఛెసి ఛుదగలరు. - శీవారామప్రసాదు కప్పగంతు.

శివరామ ప్రసాదు గారూ! దయచేసి ఈ విషయాలు గమనించండి.

  • పరిశీలిస్తాను. ఇప్పుడు నేను చూస్తే ఫొటోలు బాగానె కనిపించినాయి. బహుశా ఫొటోలు ఎక్కువ కావడం వలన లోడింగ్ సమయం ఎక్కువై డౌన్‌లోడ్ ప్రక్రియ మొరాయిస్తూ ఉండవచ్చును.
  • సంబంధించిన విషయమే. ఇప్పటికి మీరు చాలా ఫొటోలు అప్‌లోడ్ చేశారు. ఒక వ్యాసానికి నాలుగైదు ఫొటోల కంటే ఎక్కువ సబబు కాదనుకొంటాను (అలాగని నియమం మాత్రం ఏమీ లేదు). కనుక ముఖ్యమైన కొన్ని ఫొటోలు ఉంచి మిగిలినవి తొలగిస్తాను. మీరు అన్యధా భావించరనుకొంటాను.దయఛెసి ఇప్పుదు ఉన్న ఫొటొలు ఉంఛండి యిక అప్ లొడ్ ఆపుతాను. Vu3ktb 17:17, 7 మార్చి 2008 (UTC)Reply
  • నాకు ఏవైనా సందేశాలు పంపాలంటే నా ఆటోగ్రాఫ్ పేజీ కంటే నా చర్చా పేజీలో వ్రాయడం మంచిది.
  • మీరు ఏదైనా సందేశం ఎక్కడైనా వ్రాసినపుడు మీ పేరు టైపు చేయకుండా ఇలా ~~~~ నాలుగు టిల్డెలు పెడితే చాలు. మీ సభ్యనామం, సమయం ఆటోమాటిక్‌గా వస్తాయి. ఇది సులభం. లేదా ఎడిట్ పేజీ పైన ఉన్న బటన్లలో సంతకం లాగా కనిపించే బటన్ ("టైమ్ స్టాంపుతో సహా మీ సంతకం" - ఎడమవైపునుండి 10వ బటన్) నొక్క వచ్చు. ఇది ఇంకా సులభం.
  • నా పేజీలో మీరు వ్రాసిన మీ మెయిల్ ఐ.డి. తొలగిస్తాను (స్పాముకు అవకాశాలు లేకుండా ఉండడానికి)

మీ వికీ కృషిని మాత్రం కొనసాగించండి. --కాసుబాబు 17:03, 7 మార్చి 2008 (UTC)Reply

మైలు రాయి ఫొటోను సవరించాను. ఇది పెద్ద కష్టమేమీ కాదు. నిదానంగా ప్రాక్టీసు చేయండి. మరో ముఖ్యమైన మాట. వికీ వ్యాసాలలో ఏనైనా పొరపాట్లు జరిగినా నిర్వాహకులు పాత కూర్పులను సులభంగా పునరుద్ధరించ గలరు. కనుక క్రొత్త విషయాలు ప్రయోగించడానికి మీరు అస్సలు తటపటాయించనవసరం లేదు. ఏవైనా పొరపాట్లు జరిగినా, లేక సందేహాలున్నా ఎవరైనా సభ్యులను సలహా కోరడానికి కూడా మొహమాటం అసలు పనికిరాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:21, 10 మార్చి 2008 (UTC)Reply

కొన్ని అక్షరదోషాలు

మార్చు

శివరామ ప్రసాదు గారూ! మీరు రాసే వ్యాసాలు మంచి ఆసక్తిని కలగజేస్తున్నాయండీ!. ఈ చిన్న దోషాలు దొర్లకుండా చూసుకోండి. అనే అక్షరం రావాలంటే ca అని వ్రాయాలి కానీ cha అని వ్రాయకూడదు. అలాగే ఎందుకు అని వ్రాయాలంటే eMduku అని రాయగలరు. ఓత్వం రావాలంటే కో(kO),గో(gO) ఇలా వాడండి.—రవిచంద్ర 13:00, 8 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదములు

మార్చు

చాలా ధన్యవాదములు రవి చంద్ర గారు. నెను ఈ తెలుగు వికిపెడియాలొ వ్రాయటము గత 5-6 రోజులు మాత్రమె అయినది. ఛాలావరకు నెర్ఛుకున్నాను. మీ లాంటి మిత్రులు సహాయంతొను మరియు నా అంతట నెను కొన్ని నెర్ఛుకొంటున్నాను.--Vu3ktb 14:00, 8 మార్చి 2008 (UTC)Reply

చందమామ

మార్చు
కాసుబాబుగారూ! నమస్తే. నేను చందమామ పుటలొ చాలా విషయాలు వ్రాసాను, కొన్ని మార్పులు కూడా చేసాను. దయచేసి చూసి మీ అభిప్రాయం తెలుపగలరు.--SIVA 09:43, 16 మార్చి 2008 (UTC)

శివా!

  • చందమామ గురించి మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనిపిస్తుంది. ఏమయినా మీ రచన మాత్రం సూపర్. ఇంతకు ముందే చందమామ మనకున్న విశేష వ్యాసాలలో ఒకటి. ఇప్పుడు మీరు దానిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళుతున్నారు.
  • మీరు వ్రాసేటప్పుడు కామా, ఫుల్‌స్టాప్‌ల తరువాత ఖాళీ (స్పేస్) ఇవ్వడం తరచు మరచిపోతున్నారు. గమనించగలరు.
  • మీ పరిచయం క్లుప్తంగానైనా మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది.
  • గారు, శ్రీ వంటి గౌరవ వాచకాలు వికీ శైలికి తగవు అని ఇంతకు ముందు చర్చించి నిర్ణయించారు. 'వచ్చాడు, వెళ్ళాడు, గీశాడు' వంటివే ఉత్తమం అనుకొన్నారు. కాని ఇలా వ్రాయడం చాలా మందికి (మన సంస్కృతి పరంగా) ఇబ్బందిగా ఉంటున్నది. అయినా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వీలయినంత వరకు బహువచనాలు, గౌరవ వాచకాలు వాడవద్దని మనవి.
  • ఈ సీరియల్ చాలా అద్భుతం వంటి వాక్యాలు అభిప్రాయాల క్రిందికి వస్తాయి. అలాగని ఫలానా వారన్నారు అనేది రిపోర్టింగ్‌గా పరిగణించబడుతుంది. గమనించండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:58, 16 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదములు కాసుబాబుగారూ. చందమామ నా చిన్నప్పటి నుండి నా నేస్తం. అటువంటి చక్కటి పత్రిక మళ్ళీ ఇంతవరకు చూడలేదు. కానీ అటువంటి పత్రికయేక్క ప్రస్తుత పరిస్తితి చూస్తె చాలా బాధగా ఉన్నది. ఇద్దరు, ముగ్గురు కలసి చందమామను చక్కటి స్తాయికి తీసుకుని వెళ్ళారు(1950-1970 ల మధ్య). అలాగే చందమామ మీద ఆసక్తి తో మనస్సు పెట్టి ఆ పత్రిక ప్రాభవాన్ని తిరిగి తేగలిగే వారు ఆ సంస్తకు దొరికితే మన అద్రుష్టం. మీ సూచనలకు ధన్యవాదములు. చందమామ పేజీ విస్తారమయిందని హెచ్చరిక వస్తున్నది, 2వ పేజీకి తీసుకుని వెళ్ళమని సూచన కూడ ఉన్నది. దయచేసి, వ్యాసమును 1 పేజీ నుండి 2 పేజీలకు చెయ్యటం ఎలాగొ చెప్పగలరు.ధారావాహికల జాబితా కు ఒక లింక్ పెట్టి జాబితాను ప్రత్యేక పుటలో ఉంచాను, అక్కడనుండి ప్రతి ధారావాహికకు ఒక్కొక్క ప్రత్యేక పుటకు లింక్ ఏర్పరిచాను. చూసి మీ సూఛనలు ఇవ్వగలరు.నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు నాకేమీ అనిపించట్లేదు. నేను వ్రాసిన మార్పులు, వ్యాస భాగలలొ అక్కడయినా ఎమోషనల్ అయ్యి వ్రాయబడినట్లు అనిపిస్తే తెలియచేయగలరు. తగిన మార్పు తప్పకుండా మీ సూచన అనుసరించి చెయ్యగలను.చందమామ పుట పూర్తి సమగ్రంగా తయారు కావాలన్నదే నా అకాంక్ష.చందమామ ధారవాహికలన్నిటికి(నాకు గుర్తున్నంతవరకు)ప్రత్యేక పుటలు ఎర్పరిచాను(ముఖ్య పుటనుండి లింక్ లతొ).అభిరుచిగల సభ్యులకు ఈ ధారావాహికల గురించి వ్రాయుటకు ఒక ఆహ్వానము, వికీపీడియా ద్వారా పంపగలమా??--SIVA 01:26, 17 మార్చి 2008 (UTC)Reply

  1. బేతాళ కథ అసలు ఎవరు వ్రాసారు,
  2. ఏ కాలంలో వ్రాయబడినది,
  3. బేతాళకథలు ఎన్ని ఉన్నాయి,
  4. బేతాళకథలకు చివరి కథ ఉన్నదా. ఉంటే ఆ కథ ఏమిటి.
  5. చందమామలో వేసిన బేతాళకథలలో అత్యున్నతమయినవి ఎంచి, వాటి గురించి క్లుప్తంగా వ్యాసంలో వ్రాయగలమా

పైన ఉదహరించిన విషయాల గురించి సభ్యులు అలూచించ ప్రార్థన--SIVA 20:18, 19 మార్చి 2008 (UTC)Reply

తప్పకుండా వ్రాయవచ్చును. మీకు తెలిసినంత వరకు వ్రాయండి. మిగిలినవి ఎవరో ఒకరు వ్రాస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)Reply
  1. బేతాళ కథల గురించి వ్యాసం కొంతవరకు పూర్తి చేసాను. నా దగ్గర ఉన్న బొమ్మలు జత పరిచాను.చందమామ పుటనుండి లింక్ ఉన్నది. దయచేసి చూసి, మీ అభిప్రాయం, సూచనలు చెప్పగలరు.--SIVA 20:04, 19 మార్చి 2008 (UTC)Reply
శివా! బేతాళ కథలు లేదా భేతాళ కధలు - ఏది సరైన పేరు? ఒకమారు చందమామలో ఉన్న సరైన స్పెల్లింగ్ చూసి చెప్పండి. కధలలో చివర ఉండే బొమ్మగా అన్ని బొమ్మలు ఉండడం (నాకు) బాగులేదు. అన్ని బొమ్మలనూ కలిపి ఒక చిత్రంగా తిరి త్వరలో ‌లోడ్ చేస్తాను. పోల్చి చూసి నిర్ణయం తీసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)Reply
  • కాసుబాబుగారూ! బేతాళ కథలు సరైన పేరు. అందులో బే కు వత్తు లేదు.
  • కథ చివర బొమ్మలను కలిపి ఒకటిగా చేసి ఒకే చిత్రం చెయ్యటం మంచి ఆలోచన. నేనుకూడా పయత్నింస్తున్నాను,--SIVA 12:03, 20 మార్చి 2008 (UTC)Reply


మీ వ్యాసాలు

మార్చు

Vu3ktb గారు, మీరు రాస్తున్న వ్యాసాలన్నింటినీ ఒకచోట అమర్చుకుంటే మీకు, పాఠకులకు మున్ముందు చాలా ఉపయోగకరంగా ఉండగలదు. ఉదాహరణకు మీరొక వ్యాసం మొదలు పెట్టినపుడు లేదా పూర్తి చేసినపుడు ఆ వ్యాసనామాన్ని మీ పేజీలో, అంటే Vu3ktb పేజీలో భద్రపరచండి. --Svrangarao 22:20, 17 మార్చి 2008 (UTC)Reply

చలం - వ్యాసం

మార్చు

శివా! చలం పేరుతో ఉన్న రెండు వ్యాసాలు విలీనం చేశాను. గమనించ గలరు. నేను ఇతర పనుల వలన గుడిపాటి వెంకట చలం, చందమామ వ్యాసాల గురించి మీరు అడిగిన ప్రశ్నలకు స్పందించలేక పోయాను. ఇప్పటికే కొన్ని సందేహాలు తీరిపోయి ఉంటాయనుకొంటాను. మరేమైనా వివరాలు కావాలంటే నా చర్చా పేజీలో అడగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:56, 18 మార్చి 2008 (UTC)Reply

చందమామ పేజీ

మార్చు

గురువుగారూ! చందమామ వ్యాస వ్యాస పుటలో, అన్నిటికన్న ప్రస్తుతపు సంపాదకుల బొమ్మ చాలా పెద్దది అయిపోయి వషయ-బొమ్మల నిష్పత్తి మీద ప్రభావం చూపుతున్నది.అందుకని బొమ్మను మెగిలిన బొమ్మల సైజుకు మార్చాను,దయచేసి గమనించగలరు.--SIVA 02:53, 20 మార్చి 2008 (UTC)


బొమ్మ

మార్చు

శివగారు, ఒకే బొమ్మను పలుమార్లు అప్‌లోడ్ చేస్తున్నట్టున్నారు.. బొమ్మతో ఏదయినా సమస్య ఎదురవుతున్నదా? --Svrangarao 02:33, 23 మార్చి 2008 (UTC)Reply

గాంధీపుట గురించి

మార్చు

రంగారావుగారూ! సహాయానికి వచ్చినందుకు ధన్యవాదములు. గాడ్సే బొమ్మ చిన్నది చెయ్యలని నా ప్రయత్నం. అందుకని 1కి 2సార్లు అప్లోడ్ ప్రయత్నించాను. దయచేసి గాంధీ పుటలో గాడ్సే చిత్రాన్ని ఇంకా చిన్నది చేసి అంతవరకూ సిమెట్రికల్ గా ఉందేటట్లు చెయ్యగలరా.--SIVA 03:07, 23 మార్చి 2008 (UTC)Reply

మీరు px బదులు pix టైపు చేయడంవలన అనుకున్న సైజులో కనిపించలేదు అనుకుంటాను. మరొకసారి ప్రయత్నించి చూడండి. --Svrangarao 05:06, 23 మార్చి 2008 (UTC)Reply

ధన్యవాదములు రంగారావుగారూ. మీరు తగిన సమయం లో సరైన సలహా ఇచ్చారు మరియు నేను తెలియకుండా చేసిన తప్పు తెలియచేసారు.--SIVA 05:53, 23 మార్చి 2008 (UTC)Reply

Return to the user page of "Vu3ktb/పాతచర్చలు 1".