వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.[1]

వికారాబాదు మాజీ శాసనసభ్యుడు డా. మెతుకు ఆనంద్ (2018-2023)
వికారాబాదు మాజీ శాసనసభ్యుడు బి.సంజీవరావు (2014-2018)

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,35,755
  • ఓటర్ల సంఖ్య [2] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :1,73,738

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 వి.బి.తిరుమలయ్య భారత జాతీయ కాంగ్రెస్ దేవదాసు జనతా పార్టీ
1983 కె.ఆర్.కృష్ణస్వామి భారత జాతీయ కాంగ్రెస్ దేవదాసు ఇండిపెండెంట్
1985 ఎ.చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ దేవదాసు ఇండిపెండెంట్
1989 ఎ.చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ తిరుమలయ్య కాంగ్రెస్
1994 ఎ.చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ బి. సంజీవరావు ఇండిపెండెంట్
1999 ఎ.చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ మధురవేణి కాంగ్రెస్
2004 ఎ.చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి మధురవేణి తెలుగుదేశం
2008 ఉపఎన్నిక గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్ బి. సంజీవరావు తెలుగుదేశం
2009 గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్ పార్టీ ఎ.చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 బి. సంజీవరావు తెలంగాణ రాష్ట్ర సమితి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్ పార్టీ
2018 మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర సమితి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్ పార్టీ

రాజకీయ పార్టీల బలాబలాలుసవరించు

ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపిన ఈ నియోజకవర్గంలో 1983 తరువాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా 4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన ఏ.చంద్రశేఖర్ 2004 ఎన్నికల ముందు తెలంగాణా రాష్ట్రసమితిలో చేరి పార్టీ టికెట్టు సంపాదించి ఆ పార్టీ అభ్యర్థిగాను గెలిచి వరుసగా 5వ సారి శాసనసభలో ప్రవేశించాడు. విజయం సాధించిన అభ్యర్థి మారకపోయిననూ పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీ విజయాలకు బ్రేక్ పడింది. 2004 ఎన్నికలలో ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ బలపర్చిన తెరాస తరఫున విజయం సాధించిననూ మారిన పరిస్థితుల వల్ల తెరాసకు చెందిన శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామాతో 2008లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

1999 ఎన్నికలుసవరించు

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా నాలుగవ సారి ఏ.చంద్రశేఖర్ పోటీలో ఉండగా కాంగ్రెస్ తరఫున 1994 ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాటీ చేసిన సంజీవరావు భార్య మధురవేణికి టికెట్టు లభించింది.

1999 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
ఏ.చంద్రశేఖర్ తెలుగుదేశం 52733
మధురవేణి కాంగ్రెస్ 52530
పెంద పుష్పమ్మ ఇండిపెండెంట్ 3820
పర్వేది ఆనంద్ కుమార్ అన్నా తెలుగుదేశం 3240
బి.జంగయ్య ఇండిపెండెంట్ 2577
పుష్పమ్మ ఇండిపెండెంట్ 1640

2004 ఎన్నికలుసవరించు

వరుసగా 4 సార్లు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ తెరాసలోకి వెళ్ళడంతో సంజీవరావు భార్య మధురవేణికి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్, తెరాసల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన ఏ.చంద్రశేఖర్ రెండు వేల ఒక్క ఓట్లతేడాతో విజయం సాధించాడు.

2004 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
ఏ.చంద్రశేఖర్ తెలంగాణా రాష్ట్ర సమితి 56647
మధురవేణి తెలుగుదేశం 54646
బిచ్చన్న ఇండిపెండెంట్ 4144
తిరుమలయ్య ఇండిపెండెంట్ 1863
పర్మయ్య అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ 1452
తలారి యేసుదాస్ ఇండిపెండెంట్ 887
పెండ్యాల అనంతయ్య ఇండిపెండెంట్ 785
మాల జంగయ్య మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ 755

2008 ఉపఎన్నికలుసవరించు

తెరాస శాసనసభ్యుడు ఏ.చంద్రశేఖర్ రాజానామాతో ఈ నియోజకవర్గంలో 2008లో ఉపఎన్నిక జరుగింది. తెరాస తరఫున ఏ.చంద్రశేఖర్ వరుసగా 6వ సారి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. కాంగ్రెస్ తరఫున ప్రసాద్, తెలుగుదేశం తరఫున సంజీవరావులు పోటీలో ఉన్నారు. ఐదుసార్లు (4 సార్లు తెలుగుదేశం తరఫున, ఒకసారి తెరాస తరఫున) ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తెరాస అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌కు ఈ ఉప ఎన్నికలలో మూడవస్థానంలో రావడం మనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ తరఫున రాష్ట్ర గనుల, భూగర్భశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషిచేయగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కృషిచేశారు. 2004 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి గెలిచినప్పటికీ 2008 ఉప ఎన్నికలలో ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యనే పోటీ ఉత్కంఠతో సాగింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ సమీప తెలుగుదేశం అభ్యర్థి సంజీవరావుపై 28,892 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.[3]

2008 ఉపఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాల్లు
అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ 67,814
సంజీవరావు తెలుగుదేశం 38,922
ఏ.చంద్రశేఖర్ తెలంగాణా రాష్ట్ర సమితి 15,415

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున శేరి నరసింగరారావు పోటీ చేస్తున్నాడు.[4]

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  3. ఈనాడు దినపత్రి, తేది 2 జూన్, 2008, పేజీ 7
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009