వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 1
- 1578 : శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం (మ.1657).(చిత్రంలో)
- 1889 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కె.బి.హెడ్గేవార్ జననం (మ.1940).
- 1911 : మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య జననం (మ.1949).
- 1914 : కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది.
- 1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
- 1933 : భారత క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
- 1935 : భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
- 1936 : ఒరిస్సా బ్రిటీష్ ఇండియాలో క్రొత్త ప్రావిన్సుగా అవతరించింది.
- 1941 : భారత దేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ జననం (మ.2018).
- 1963 : హోం మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా DSPE, కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) గా అవతరించింది.
- 1973 : ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం.