వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాఘవేందర్ అస్కాని
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విషయ ప్రాధాన్యత లేనందున ఈ వ్యాసాన్ని తొలగించాలన్నది నిర్ణయం. వ్యాసకర్త సదుద్దేశంతో ఈ వ్యాసాన్ని రూపొందించారనీ, సాధ్యమైనంతవరకూ మూలాలు ఇవ్వడానికి ప్రయత్నించారని గమనించాను, అందుకు అభినందిస్తున్నాను. ఈ నిర్ణయం వ్యాస విషయానికి కానీ, వ్యాసకర్తకు కానీ జడ్జ్మెంటల్గా స్వీకరించకూడదనీ కోరుతున్నాను. ప్రతిపాదించినది నేనే అయినా దాదాపు ఐదు వారాల నుంచి చర్చ నలుగుతూ ఉండడం, నిర్ణయం చేయదలచిన నిర్వాహకులు తాను నిర్ణయించబోవట్లేదని తప్పుకోవడం కారణాలుగా జరిగిన చర్చనూ, విషయ ప్రాధాన్యతనూ పరిగణనలోకి తీసుకుని ఒక మనిహాయింపుగా నిర్ణయించవలసి వచ్చింది. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 14 జూలై 2020 (UTC) వికీపీడియాలో నేను లాగిన్ కానీ ఒక సభ్యుడిని. నేను కొన్ని కొత్త పేజీలు సృష్టించాను. ఆ పేజీలను వికీపీడియా వారి తొలగించలేదు. కానీ వారు నేను ఒక పేజీని సృష్టిస్తే దాన్ని తొలగించారు. గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ పేజీని నాలుగు సార్లు తొలగించారు. ది దీనికి కారణం ఏమిటి. నేను వికీపీడియాలో లాగిన్ కావాలనుకుంటున్నాను. లాగిన్ అవుతే నాకు మరింత సౌకర్యంగా ఉంటుంది.[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో ఒక వ్యక్తి గురించిన వ్యాసం సృష్టించడానికి విషయ ప్రాధాన్యత ఉండాలి. ఆ విషయ ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని ఆ వ్యక్తికి సంబంధం లేని మూడవ పక్షానికి చెందిన నమ్మదగ్గ మూలం (పుస్తకాలు, పత్రికలు, వగైరా) నుంచి ఆధారాలు కావాలి. ఇక్కడ వ్యాసంలో ఇచ్చిన లింకులు అన్నీ వ్యక్తికి నేరుగా సంబంధం ఉన్న వెబ్సైటువే కావడమూ, బయట వెతికి చూసినా విశ్వసనీయమైన మూలాలలో విషయ ప్రాధాన్యత నిర్ధారణ కాకపోవడమూ కారణాలుగా దీన్ని తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను. @Apbook: అన్న వాడుకరి వ్యాసాన్ని సృష్టించినందున వారి చర్చాపేజీలో నోటీసు ప్రచురించాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:40, 6 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఐదు రోజుల్లో (జూన్ 11 వరకు) ఈ వ్యాసానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాలు చేర్చకుంటే వ్యాసం తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:56, 6 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దీనిపై చర్చ లేకుండా నోటీసు తొలగించారు, కానీ వ్యాసంలో జరిగిన మార్పుచేర్పులు చూస్తూంటే మనం లేవనెత్తిన సమస్యలు పరిష్కరించనట్టే ఉన్నాయి. దీనిపై ఏ చర్చ తీసుకోవాలన్నది చర్చలో రాసిన @Pranayraj1985:, @K.Venkataramana: గార్లు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:16, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను ఈ వ్యాసంలో కొన్ని మూలాలను చేర్చాను. మూలాలను పరిశీలించండి. సరియైనవైతే ఈ వ్యాసాన్ని తొలగించకండి. సరైన మూలాలు లేని వాక్యాలను తొలగించండి. మూడవ పక్షానికి చెందిన నమ్మదగ్గ మూలం నుంచి ఆధారాలు లేనిచో ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు. K.Venkataramana(talk) 16:34, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- K.Venkataramana గారు చెప్పిన అభిప్రాయమే నాది కూడా.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:51, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను ఈ వ్యాసంలో కొన్ని మూలాలను చేర్చాను. మూలాలను పరిశీలించండి. సరియైనవైతే ఈ వ్యాసాన్ని తొలగించకండి. సరైన మూలాలు లేని వాక్యాలను తొలగించండి. మూడవ పక్షానికి చెందిన నమ్మదగ్గ మూలం నుంచి ఆధారాలు లేనిచో ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు. K.Venkataramana(talk) 16:34, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దీనిపై చర్చ లేకుండా నోటీసు తొలగించారు, కానీ వ్యాసంలో జరిగిన మార్పుచేర్పులు చూస్తూంటే మనం లేవనెత్తిన సమస్యలు పరిష్కరించనట్టే ఉన్నాయి. దీనిపై ఏ చర్చ తీసుకోవాలన్నది చర్చలో రాసిన @Pranayraj1985:, @K.Venkataramana: గార్లు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:16, 13 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నా పరిశీలనలు ఇవి:
- మొత్తం 7 మూలాలున్నాయి. 1,3 మూలాలు మాత్రమే వికీ స్థాయికి చెందిన స్వతంత్ర మూలాలు. మిగతావి దాదాపుగా అన్నీ ఆయా వ్యక్తులు స్వంతంగా రాసుకునేవే (6,7). లేదా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని రాసేవి (లైమెక్) లేదా మూలాలకు తగనివి (4,5).
- 1,3 మూలాలను పరిశీలిస్తే అవి ఒక ఘటనను రిపోర్టు చేస్తున్నాయి. కానీ విషయ ప్రాముఖ్యతను చూపించేందుకు సరిపోవడం లేదు. మొత్తమ్మీద ఇప్పుడున్న స్థితిలో ఈ వ్యాసపు విషయ ప్రాముఖ్యత నిర్ధారణ కాలేదు. అంచేత నా వోటు తొలగింపుకే.
- తగు మూలాల నిచ్చి విషయ ప్రముఖ్యతను నిర్ధారిస్తే, వ్యాసాన్ని ఉంచేసే పనైతే, కింది చోట్ల మూలాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- "ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధిచి విద్యార్థుల సమస్యలను 2013లో పరిష్కరించారు." - మూలం కావాలి
- "ఎస్.ఆర్.శంకరన్ మొదటి స్మారక విగ్రహం తెలంగాణలోని, వనపర్తిలో ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు." - మూలం కావాలి
- "యువతని యూత్ ఫర్ బెటర్ ఇండియన్ (వైబిఐ) సంస్ద ఉద్యమంలో భాగం చేయగలిగారు " - మూలం కావాలి
- __చదువరి (చర్చ • రచనలు) 02:29, 14 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీ కు సంబంధించిన నా అభిప్రాయం:
- వికీపీడియాలో నేను అడుగుపెట్టి నాలుగు నెలలు పూర్తి అయినది. వికీపీడియా లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అనుకోని కారణాల వల్ల నేను సృష్టించిన పేజీకి సంబంధించిన చర్చలో సరి అయినా సమయంలో పాల్గొన లేకపోయాను. తొలగింపు కొరకు చేసిన పేజీకి సంబంధించిన మూలలను నేను అభివృద్దిచేసాను. అనుకోని తప్పిదం చేశాను ముందుగా పేజీ సృష్టించినప్పుడు మరొక పేరు వున్నా సమాచార మూలలను పేరును నేను జతచేయలేకపోయాను. మరొకసారి మూలాలను పరిశీలించగలరని నా మనవి. __User:Apbook (చర్చ 22:25, 03 జూలై 2020 (UTC)
నిర్ణయం ప్రకటించే ముందు వాడుకరి:Dellme, వాడుకరి:Apbook పై చర్చలో వారం లోగా స్పందించమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 06:29, 2 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారు, వాడుకరి:Apbook గారి స్పందనపై మీ అభిప్రాయం పైన తెలపండి.-- అర్జున (చర్చ) 03:59, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వాడుకరి:Apbook గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇటీవల నా నిర్ణయాలపై అభ్యంతరాలు వెలువడినందున, ఈ నిర్ణయ ప్రక్రియను నేను కొనసాగించలేకపోతున్నాను. ఇతర నిర్వాహకులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:51, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.