వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)/పాత చర్చ 1

ఇది పాత చర్చలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా చర్చించాలంటే ఇక్కడ వ్రాయండి.


తెలుగు మాట్లాడే వారు, ఇంటర్నెట్ వాడే తెలుగువారి సంఖ్యతో తెలుగు వికీపీడియా సభ్యుల సంఖ్య పోలిస్తే బాగా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. తెలుగులో చదివే, రాసే సౌకర్యం లేకపోవడం, అది ఉన్నదని తెలీకపోవడం దీనికి ప్రధాన కారణమైనా, 263 మరీ తక్కువ అని తోస్తోంది. వికీపీడియా సభ్యుల సంఖ్యను చూస్తే మనకంటే చా..లా.. తక్కువ మంది మాట్లాడే భాషల వికీపీడియాలలో మనకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నట్లు కనపడుతోంది. ఆ వివరాలు (2006 జనవరి 8 నాటివి) చూడండి:

భాష మొత్తం మాట్లాడేవారు వికీపీడియా సభ్యులు
లక్సెంబోర్గిష్ 3 లక్షలు 424
గ్రీకు కోటీ యాభై లక్షలు 1754
ఇటాలియను 7 కోట్లు 34,318
స్వీడిష్ 93 లక్షలు 9,898
మాసిడోనియను 20 లక్షలు 314
ఆఫ్రికాన్స్ కోటీ అరవై లక్షలు 570
హీబ్రూ 70 లక్షలు 12216
ఎస్పరాంటో 20 లక్షలు 1534
తెలుగు దాదాపు 9 కోట్లు 263

వికీపీడియా వ్యాప్తికి మనమేదైనా చిన్నపాటి ఉద్యమం చేపట్టాలంటారా? __చదువరి (చర్చ, రచనలు) 17:41, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ప్రచారం

మార్చు

వికీపీడియాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళే విషయమై సభ్యులు తమ అభిప్రాయాలను ఇక్కడ రాయవచ్చు. కొందరు సభ్యుల మధ్య జరిగిన ఉత్తరాల సంభాషణల్లోను, తెలుగువికీ గ్రూపులోను వచ్చిన సూచనలను ఇక్కడ రాస్తున్నాను. మరిన్ని సూచనలను రాయండి.

  1. వికీపీడియాను గురించి సభ్యులంతా తమతమ స్నేహితులకు ఉత్తరాలు రాయాలి. వారిద్వారా అది వారి స్నేహితులకూ వెళ్ళేలా చూడాలి.
  2. ప్రముఖ తెలుగు పత్రికలు, వెబ్‌సైట్లలో వికీపీడియాపై వ్యాసాలు ప్రచురించమని ఆయా సంస్థలను కోరాలి.
  3. టీవీ చానెళ్ళలో వికీ గురించిన కార్యక్రమాలు నిర్వహించేలా వారిని కోరాలి.
  4. తెలుగువారు చేరే ప్రముఖ స్థలాల్లో వికీపీడియా గురించి ప్రకటనలు వెయ్యాలి (ఉచిత ప్రకటనలే సుమండీ!)
  5. పాత్రికేయులు వికీకి సహజ పోషకులు. వారిని వికీలో చేరేందుకు ప్రోత్సహించాలి. మనకు తెలిసిన పాత్రికేయులకు వికీ గురించి తెలియజేయాలి.
  6. ఈనాడు జర్నలిజం స్కూలు, రచన జర్నలిజం స్కూలు వంటి ప్రముఖ జర్నలిజం స్కూళ్ళ విద్యార్థుల్లో వికీపీడియాను పరిచయం చెయ్యాలి.
  7. ఇతర విద్యాసంస్థల విద్యార్థుల్లో కూడా వికీపీడియా గురించిన అవగాహన కలిగించాలి.

__చదువరి (చర్చ, రచనలు) 01:44, 7 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ జన్మదినం

మార్చు

తెవికీ జన్మదినం ఏది? చావా కిరణ్ మార్చి 25 అన్నాడు. (ఈ తేడా చూసికావచ్చు.) కానీ మొదటి పేజీ చరితంలో డిసెంబర్ 10.

ఏ తేదీని మనం తెవికీ పుట్టినరోజుగా భావించవచ్చు?--వీవెన్ 02:01, 13 డిసెంబర్ 2006 (UTC)

డిసెంబర్ 9/10 (తెలుగు వికీ అమెరికాలో పుట్టిందనుకుంటే 9, తెలుగు గడ్డ మీద పుట్టిందనుకుంటే 10) --వైఙాసత్య 02:33, 13 డిసెంబర్ 2006 (UTC)

ఎన్నెన్ని ఊళ్ళు

మార్చు

అన్నవరాలు ఎన్నున్నాయి? కొత్తగూడేలు ఏవి ఎక్కడున్నాయి? ఉప్పలపాడు, బ్రాహ్మణపల్లి పేర్లతో ఎన్ని ఊళ్ళున్నాయి? - ఈ మధ్య చదువరిగారు, ఇతరులు చేస్తున్న అయోమయనివృత్తులు చూస్తుంటే తెలుస్తుంది. బహుశా ఇటువంటి సమాచారం ప్రస్తుతం తెవికీలోనే లభిస్తుంది. ఇది మనం ఊహించని మరొక క్రొత్త విషయ సంగ్రహం. కాసుబాబు 19:57, 28 డిసెంబర్ 2006 (UTC)

అవునండీ, కొన్ని కొన్ని ఊళ్ళు పదీ పదిహేను కూడా ఉన్నాయి. అసలీ అయోమయ నివృత్తిని ఆటోమేటు చేస్తూ ఏదైనా బాటు రాస్తే బాగుంటుందేమో! __చదువరి (చర్చ, రచనలు) 03:30, 29 డిసెంబర్ 2006 (UTC)
అదే రాసే ప్రయత్నములో ఉన్నాను --వైఙాసత్య 03:49, 29 డిసెంబర్ 2006 (UTC)
ఓ! అయితే నేనిక ఈ పని ఆపుతాను. __చదువరి (చర్చ, రచనలు) 09:43, 29 డిసెంబర్ 2006 (UTC)
నేను ఈ మధ్యే మొదలుపెట్టా. బాటు ఇంకా రాలేదు, నేనూ ఆపాలా? కొనసాగిద్దామనే అనుకుంటున్నా.--వీవెన్ 04:00, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సంవత్సరాలు, తేదీల పేజీలు

మార్చు

సంవత్సరాలు మరియు తేదీల పేజీలలో, వివిధ పేజీలలో ఉన్న జననాలు, మరణాలు, ఘటనలు మనమే పూరిద్దామా లేక బాటుకిద్దామా? (సంవత్సరపు పేజీ నుండి తేదీ పేజీ (లేదా ఇటునుంచి అటు) అయితే బాటుకి వీలుగానే ఉంటుంది. కానీ వివిధ పేజీలనుండి అయితే కష్టమే.)--వీవెన్ 04:00, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయా పేజీలు ఆయా వర్గాలలో ఉంటే బాటుకి వీలుగా ఉంటుంది కదా.--వీవెన్ 04:03, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును. నాకూ ఈ విషయమై తరచు అయోమయం నెలకొంటున్నది. నా అభిప్రాయం - బాటుద్వారానే ఇది ఉత్తమం. అయితే బాటుకు అనుకూలంగా వర్గాలు, మూసలు ఎలా చేయాలో మీరు కొన్ని సూచనలు వ్రాస్తే అందరూ వాటిని అనుసరించవచ్చును. --కాసుబాబు 06:30, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, వివిధ పేజీలలో జనన, మరణ వర్గాలు చేర్చితే బాటు తేదీ పేజీలలోని, సంవత్సరపు పేజీలలోని జనన మరణ విభాగాలు నింపగలదు. తేదీ పేజీలు, సంవత్సరాల పేజీలు ఒక నిర్ధిష్ట పద్దతిలో ఉన్నాయి కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఏమీ చెయ్యాల్సిన పని లేదు --వైఙాసత్య 13:49, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

దొంగ బయటి లింకులు

మార్చు

వ్యాసాల్లో పెట్టే బయటి లింకులు అంశాన్ని దుర్వినియోగం చెయ్యడం జరుగుతోంది. రేబ్రూజో అనే బాటు పెట్టిన ఈ పేజీ లో తెవికీలో 10 కంటే ఎక్కువ బయటి లింకులు ఉన్న పేజీల జాబితా ఉంది. వీటిలో కొన్ని స్పాము లింకులున్నాయనుకుంటాను. సదరు పేజీలను వెతికి పట్టి ఆయా లింకులను తీసెయ్యాలి.__చదువరి (చర్చ, రచనలు) 02:49, 15 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియనులు పేజీ

మార్చు

మనం కొత్త సభ్యులని ఈ వికీపీడియా:వికీపీడియనులు పేజీలో పేరు చేర్చమంటున్నాం కదా. ఆ పేజీ పొడవేమో పెరిగిపోతుంది. అప్పుడే మొదలైన వారు వింత వికీ సింటాక్స్ ఉండటం వళ్ల తెగ తికమక పడుతున్నారు. ఇంతా చేసి మనం అందులోని సమాచారం దేనికి ఉపయోగిస్తున్నామో తెలియట్లేదు. మొదటి ప్రశ్న ఇది అవసరమా? ఇంతకీ దీన్ని ఎలా ఉపయోగపెట్టుకోవచ్చు. ఏమైనా ఫార్మాట్లో మార్పులు చేస్తే బాగుంటుందా? దీనికి ఇతర ప్రత్యమ్నాలేమైనా ఉన్నాయా. మీ మీ ఆలోచనలు అందివ్వగలరు. నాకైతే ఏమీ తోచట్లేదు --వైజాసత్య 08:22, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి కొత్తగా చేరే సభ్యులను వారి సభ్య పేజీలలోనే [[వర్గం:వికీపీడియనులు]] అని చేర్చుకోమని మార్చాను. ఇప్పటి వరకూ కొత్త సభ్యులెవరూ దానిని వాడినట్లు లేరు. అసలు అది కూడా అనవసరమేమో. కొత్తగా చేరిన వారిని వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను కొన్ని చూపించి వాటిని చదివుకోమంటే ఏమయినా సూచనలుంటే తెలుపమని అడిగితే బాగుంటుంది. మంచి వ్యాసాలంటే ఈ మధ్య ఈ వారం వ్యాసాలుగా పెడుతున్నవి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:35, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
[[వర్గం:వికీపీడియనులు]] లో నా పేరు ఎలా చేర్చాలో తెలియలేదు.ఇంటర్నల్ లింకు రావడం లేదు కదా!!!.. ఆ వాక్యాన్ని తీసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తెవికీ లొ నిజం చెప్పాలంటే చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, మెదట నేను తెవికీ చూసినప్పుడు నాకే ఆశ్చర్యమేసింది.సంగ్రహం గా ఒకచోట చూసి ఆశ్చర్య పోయాను, అప్పుడు అను కొన్నాను తెవికి లొ ఇతిహాస సంబంధ విషయాలు చెర్చాలి అని అనుకొని రాయడం ప్రారంభించాను--మాటలబాబు 12:53, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మేలుకో

మార్చు

ఏమిటి తెవికీ నిద్ర పోతోందా ఎవ్వరు ఏమి రాయడం లేదు. స్తుప్తావస్థనుండి జాగరణావస్థకు అక్కడనుండి వ్యాసాలు రాసేదిశ లేవండి --మాటలబాబు 22:56, 23 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సహాయం

మార్చు

నేనే అనుకొంటా వైజా సత్యా గారికి విన్న వించుకోవడం వల్ల ఎడిట్ బాక్స్ క్రింద తెలుగు టైపింగ్ సహాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ టైపింగ్ సహాయాన్ని ఎడిట్ బాక్స్ ప్రక్కకు మార్చే అవకాశము ఏమైన ఉన్నదేమో చూడండి. కన్నడ వికిలొ ఖాతా తెరచుకొన్నా అక్కడ వారు కూడా సమిష్టి వ్యాసం లాంటిది ఒకటి తయారు చేశారు. ఆ వ్యాసము లింకు మెదటి పేజిలొ ఇచ్చారు. వారు అక్కడ రాసిదేంటంటే అనువాదము చేయవలసిన వ్యాసము అని రాశారు --మాటలబాబు 02:58, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని వికీపీడియాల గణాంకాలు

మార్చు

ఈ గణాంకాలు జూలై 7 2007న, 4:30AM నుండీ 5.30AM IST మధ్యన సేకరించాను.

భారతదేశ
వికీపీడియాలు
భాషలు
బెంగాలీ బిష్ణుప్రియా
మణీపూరీ
హిందీ కన్నడ మళయాళం మరాఠీ తమిళం తెలుగు
గణాంకాలు
కాపాడుతున్న పేజీలు 1 1 0 3 0 4 1 3
దారిమార్పు పేజీలు 13970 48 1951 1381 2167 3318 2335 1826
<2KB 14299 17774 11584 4054 1860 9771 8306 31809
>2KB and <5KB 1317 1139 849 572 873 663 2189 1031
>5KB and <10KB 240 13 173 118 259 151 366 213
>10KB 181 15 95 69 160 88 155 173
మొత్తం 16037 18941 12701 4813 3152 10673 11016 33226
ఇంగ్లీషు శాతం 27.19 22.12 21.16 17.22 13.17 18.76 18.44 18.46

గణాంకాలు

మార్చు

నాకున్న విపరీత ఆలోచనలలో కొన్ని

  • తెలుగు వికీపీడియాలో ఇంగీషు ఎంత శాతముందో కనుక్కోవడం.   చేశాను
  • అలాకే సైజుల వారీగా ఇతర భారతీయ భాషలలో వ్యాసాల గణన.   చేశాను
  • ఇతర వికీలలో ఇంగ్లీషు శాతమెంత ఉందో తెలుసుకోవడం.   చేశాను

ఈ ఆదివారం ఒక బాటును తయారు చేసి అన్ని వికీపీడియాలలో నడుపటానికి ప్రయత్నిస్తాను. మీదగ్గర ఇలాంటి గణాంకాలకు సంబందించిన అయిడియాలు ఏమయినా ఉంటే చెప్పండి, వాటిని కూడా ప్రయోగించటానికి ప్రయత్నిస్తాను. వీటికి 1000 మంది కంటే ఎక్కువమంది సభ్యులు ఉన్న వికీపీడియాననే పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:45, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగున్నాయి మీ అలోచనలు..నాకేమీ విపరీతాలనిపించట్లేదు. పైవి కాకుండా అదనంగా నాకు ఇప్పుడు తోచినవి ఇవి
  • వివిధ భారతీయ వికీపీడియాల్లో బాటుతో చేసిన వ్యాసాల సంఖ్య
  • వివిధ భారతీయ వికీపీడియాల్లో బాటుతో చేసిన దిద్దుబాట్ల సంఖ్య
  • సంవత్సరాల పేజీల సంఖ్య

ఇవి కాక స్థానికంగా తెవికీలో నాకు కొన్ని గణాంకాలు కావాలి. నేను విస్టాకి మారినప్పటినుండి పైవికీపీడియాతో అంత సాఫీగా నడవట్లేదు. ట్రబుల్షూట్ చెయ్యటానికి బద్ధకం

  • అనువాదం మూసలేని 10 కేబీ కంటే ఎక్కువున్న వ్యాసాల జాబితా   చేశాను 1, 2, 3
  • అనువాదం మూస ఉన్న 10 కేబీ వ్యాసాల జాబితా   చేశాను 1, 2, 3
  • మొత్తం సినిమా (కేవలం సినిమాలు)వ్యాసాల సంఖ్య   చేశాను 1
  • ఎక్కడికీ లింకులేని సినిమా వ్యాసాల జాబితా   చేశాను 1
  • ఒకటి కంటే ఎక్కువ సినిమా మూసలున్న పేజీల జాబితా   చేశాను 1

మీకు చాలా పనిపెట్టినట్టున్నాను --వైజాసత్య 13:28, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటుతో చేసిన మార్పులు, లేదా బాటు ద్వారా సృష్టించిన వ్యాసాలను కనుక్కోవడం కొంచెం కష్టమైన పని. బాటుద్వారా దిద్దుబాట్లను పరిశీలించడానికి పైవికీపీడియాలో ఎటువంటి లైబ్రరీలు లేవనుకుంటాను. కానీ మెళ్ళగా ప్రయత్నిస్తాను. సంవత్సరాల పేజీలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవడం అంత కష్టం కాదు, మెళ్ళగా మొదలు పెడతాను. ప్రస్తుతం తెలుగు సినిమాల వ్యాసాలకు గణాంకాలు తీసుకోవడాంకి బాటును తయారు చేస్తున్నాను. ఉర్దూ వికీపీడియాలో కూడా బాటును నడిపాను, కానీ ఆ భాషతో సమస్యో మరింకేమిటో గానీ 20 గంటలు నడిపిన తరువాత కూడా ఆ భాషలో గణాంకాలు తీసుకోవడం ఇంకా పూర్తవలేదు. అందులో ఉన్నవేమో 6000 వ్యాసాలు (20000 వేల పేజీలు). __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:48, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
భలే భలే ప్రదీప్ గారు చాలా కష్ట పడీ బాటు లు నిర్మించి మంచి విషయాలు తెలిపారు, ప్రదీప్ గారు ఇచ్చిన గణాంకాల బట్టి చూస్తే మనం బాగానే చేస్తున్నాము అని అనిపిస్తోంది, ఆంగ్ల కంటెంటు మన్ వ్యాసాలలొ తక్కువ ఆవిషయం మనలను ఉతహపరచాలి. ఎలాగైన చాలా మంచి బాటు నిర్మించారు. కృతజ్ఞతలు--మాటలబాబు 20:59, 7 జూలై 2007 (UTC) దీనిని[ప్రత్యుత్తరం]
థాంక్స్ ప్రదీపు, ఈ గణాంకాలు మనం చెయ్యాల్సిన పనులమీద కేంద్రీకరించడానికి, మన ప్రాధమ్యాలను గుర్తించడానికి చాలా ఉపయోగపడతాయి. --వైజాసత్య 00:07, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సినిమాల గణాంకాలు కొలవటం మొదలయింది, ఇంకో గంటా, గంటన్నరలో పైన ఇచ్చిన పేజీలో గణాంకాలు ప్రత్యక్షమవుతాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 00:48, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బాటులో కొన్ని కనిపించని లోపాలు, మరియు ఇంటర్‌నెట్ బ్యాండ్విడ్తు సమస్యల వలన సినిమాపేజీల గణాంకాలు అనుకున్నదాని కంటే చాలా ఆలస్యంగా వచ్చాయి. ప్రస్తుతం పైన తెలిపిన పేజీలో గణాంకాలు సిధంగా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:48, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను అనువాదములు చేయాలనుకుటునాను, దయ చెసి వివరములు తెలుపగలరు

మార్చు

my mail id is anu_somanchi@yahoo.com i want to contribute to audio files too kindly let me know how to go about this

with regards anita