వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, వాడుక ఎలా ఉండాలి

గతంలో వీటిని గురించి అంతగా ఆలోచించవలసిన లేదా పట్టించుకునే అవసరం కలగలేదనుకుంటాను.ఇప్పుడు ప్రస్తుతం వీటి వాడుక విషయంలో ఒక పద్దతి లేదా పాలసీని సముదాయ సభ్యులు చర్చించి లేదా విశ్లేషించి ఒక విధాన నిర్ణయం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వికీపీడియాలో జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టు పనిలో పనిచేసినప్పుడు, ప్రధాన పేరుబరులలో ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, అనే ఈ పదాలు రాష్ట్రాలు, జిల్లాల, వివిధ పట్టణాలు నగరాలు వ్యాసాలు శీర్షికల అంత్యంలో స్పేస్ తోటి, స్పేస్ లేకుండా పై వాటిలో ఏదో ఒకటి రకరకాలుగా వచ్చాయి.అలాగే కొన్ని వ్యాసాలలో ఇలాంటి ప్రధాన పేరుబరి వ్యాసాలు కూడా వచ్చినవి. వీటివలన లింకులు కలిపేటప్పుడు కాస్త శ్రమతీసుకోవలసివచ్చింది.అసలు ఈ పదాలన్నీ కోట , దుర్గం అనే అర్థాన్ని తెలిపే సందర్బంలో వాడుతున్నాం.తెలుగు భాష ప్రకారం ఆ ఆర్థాలకు ఆంధ్రభారతి నిఘంటుశోధన ప్రకారం సరియైన పదం "గఢ్" అని చూపుతుంది.

పరిశీలన కోసం ఛత్తీస్ గఢ్ అనే శీర్షికను కేవలం ఉదాహరణగా తీసుకొని వికీపీడియాలో ఫలితాల కొరకు పరిశీలించగా ఈ దిగువ విధంగా ఉన్నవి.

  • ఛత్తీస్‌గఢ్ – రాష్ట్రం పేరుతో పాటు ఆ రాష్ట్రానికి సంబందించిన 6 ప్రధాన పేరుబరి వ్యాసాలలో స్పేస్ లేకుండా ఇలానే ఉంది. తరువాత వివిధ వ్యాసాలలో ఛత్తీస్‌గఢ్ అనే ప్రధాన పేరుబరితో స్పేస్ లేకుండా కలిపి 415 వ్యాసాలలో ఉంది.గఢ్ అనే పదానికి గూగుల్ ఫలితాలు -34,50,00,000
  • ఛత్తీస్‌గడ్ -ఈ విధంగా 11 వ్యాసాలలో ఉంది.గడ్ అనే పదానికి గూగుల్ ఫలితాల - 2,03,00,00,000 ఉన్నవి
  • ఛత్తీస్ గడ్ - వివిధ వ్యాసాలలోని 24 పేజీలలో ఈ విధంగా స్పేష్ తరువాత గడ్ అని ఉంది. వత్తు ఢ్ లేదు
  • ఛత్తీస్గడ్ – ఈ విధంగా పూర్తిగా కలిపి 4 వ్యాసాల పేజీలలో ఉంది
  • ఛత్తీస్‌గర్ - ముగ్గు అనే ఒక వ్యాసంలో స్పేస్ లేకుండా గర్ అని ఉంది). అయితే ఇది నగర్ అనే పదం విషయంలో పరిగణనలోకి రాదు.
  • ఛత్తీస్ ఘడ్ – స్పేస్ తరువాత ఘడ్ అని 19 వ్యాసాల పేజీలలో ఉంది.ఘడ్ అనే పదానికి గూగుల్ ఫలితాలు - 1,46,00,00,000
  • ఛత్తీస్‌ఘడ్ – స్పేస్ లేకుండా ఘడ్ అని 23 వ్యాసాల పేజీలలో ఉంది.
  • ఛత్తీస్‌ఘఢ్ – ఈ విధంగా 12 వ్యాసాల పేజీలలో ఉంది.ఇక్కడ వత్తు ఢ్ ఉంది. ఘఢ్ అనే పదానికి గూగుల్ ఫలితాలు - 1,930

వికీపీడియా వాడుకలో ఇన్ని రకాలుగా కాకుండా గతంలో ఉన్నవి, ఇక ముందు సృష్టించే శీర్షికలు ఏకరూప్యతతో ఉండేలాగున పైకి కనపడే ప్రధాన పేరుబరి ఎలా ఉండాలనే దానిపై పై విశ్లేషనలు పరిగణనలోకి తీసుకుని ఈ దిగువ వివరించిన ప్రకారం శీర్షిక ఉండాలని ప్రతిపాదించటమైనది. దీనిమీద మీ అభిప్రాయాలు తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:53, 11 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తీసుకోవలసిన విధాన నిర్ణయం

పైన ఉదహరించిన వాటిలో "గఢ్" అనే పదం వికీపీడియాలో ఎక్కువ వాడుకలో ఉంది.అంతే గాక ఆంధ్రభారతి నిఘంటుశోధన ప్రకారం సరియైన పదం "గఢ్" అని చూపుతుంది.కావున దీనిని వాడటానికి ప్రతిపాదించటమైనది.

అభిప్రాయాలు, చర్చ మార్చు

  1. పైన ప్రతిపాదించిన "గఢ్" అనే పదం వాడుకకు నేను అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:41, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. గఢ్ వాడాలి, అది సరైన మాట కాబట్టి. <--ఈ వ్యాఖ్య రాసినది నేనే.. చదువరి (చర్చరచనలు) 14:28, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Chhattisgarh పేరును వివిధ యాంత్రిక పద్దతులలో అనువాదం చేయగా ఇలా వచ్చినవి: ఛత్తీస్‌గఢ్, (translate.google),చత్తీస్ గఢ్ (bing. translator), ఛత్తీస్గఢ్ (translate.wmcloud), ఛత్తీస్ గఢ్ (translate.yandex) కావున నా ఎంపిక " గఢ్ " ఇక్కడ మరో సూచన పొల్లుకు తర్వాతి అక్షరం ముందు అక్షరానికి వత్తుగా గా మరకుండా ఛత్తీస్‌గఢ్ రాయటానికి లిప్యంతరీకరణలో జీరో విడ్త్ నాన్ జాయినర్ (ZWNJ) "క్యారట్" (ఇది "^" కీబోర్డులో "6" అంకె కీతో పాటు ఉంటుంది) ను వాడాలి, ఇలాగ Chattees^gaDh^ అప్పుడు "ఛత్తీస్‌గఢ్" అని సరిగా లిప్యంతరీకరిస్తుంది. --Kasyap (చర్చ) 06:29, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. "గఢ్" అనే పదాన్ని వాడడానికి నేను కూడా అంగీకరిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:09, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  5. "గఢ్" అనే పదాన్ని వాడడానికి అంగీకరిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 07:00, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం మార్చు

గఢ్ అన్న పదం వాడకం సరైనదని పైన చర్చలో ఏకాభిప్రాయం ప్రకారం నిర్ణయిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 14:59, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]