"వికీపీడియాలో మ్యాపులు - ఒక పరిచయం" ప్రదర్శనా పత్రం

వికీపీడియా లో పటములు చేర్చటం నిర్వహించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు వికీలో వివిధ స్థాన పటాలున్నాయి. {{Infobox settlement}} లాంటి మూసలలో అక్షాంశ రేఖాంశాలు ఇవ్వటం ద్వారా స్థానపటం చేర్చవచ్చును. mw:Extension:Kartographer పొడిగింతతో స్థానాలు, గీతలు, ఆకారాలు సులభంగా ఓపెన్ స్ట్రీట్ మేప్ పటముపై గుర్తించవచ్చును.[1]

వికీలో పటముల చరిత్ర

మార్చు

2005-2009 ప్రాంతంలో పటములు చేర్చినవారిలో కొంతమంది. User:Chaduvari, User:Mpradeep, User:వైజాసత్య, User:Dev. చాలావరకు జాలంలో అందుబాటులోవున్న పటములను నేరుగా, లేక SVG రూపానికి మార్చి, మండలాలకు, జిల్లాలకు చేర్చారు. ఆ తరువాత User:Arjunaraoc ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ భౌతిక పటము QGIS సాఫ్ట్వేర్ వాడి తయారు చేసి చేర్చాడు. User:Adityamadhav83 కామన్స్ లో తెలంగాణ పటములు చేర్చారు. 2019 రెండవ త్రైమాసికంలో జరిగిన ప్రాజెక్టులో భాగంగా పటాల వాడుక మెరుగుపరచబడింది. 2024 లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామాలన్నింటిలో వికీమీడియా పటములు చేర్చబడినవి.

పటము చేర్చు పద్ధతులు

మార్చు

విజువల్ ఎడిటర్ తో పారస్పరికంగా (interactive) పటం చేర్చుట

మార్చు

విజువల్ ఎడిటర్ లో చొప్పించు ఆదేశంలో map ఎంచుకోండి. ఆ వ్యాసానికి తగ్గ అక్షాంశ రేఖాంశాలు వుంటే ఆ ప్రదేశం దగ్గరలోని పటం లేక ప్రపంచ పటం కనబడుతుంది, దాని విభాజకతను (zoom) పారస్పరికంగా మార్చి,మీకు కావలసిన స్థాన బిందువులు, ఇతరాలు చేర్చండి, సోర్స్ ఎడిటర్ కి మారి గుర్తుల గురించిన అదనపు పరామితులు మార్చి భద్రపరచండి. (విజువల్ ఎడిటర్ లోని GeoJSON తెవికీలో మార్పులకు సహకరించటంలేదు (జులై 2020 బగ్ T258338)) (ఉదా :కర్నూలు పేజీలో కనబడే పటం విజువల్ ఎడిటర్ లో సవరించలేము). పరామితుల గురించిన సమాచారం చూడండి.

Overpass query ద్వారా

మార్చు
 
ఆంధ్రప్రదేశ్ మండలాల పటము స్థిర చిత్రం

ఆంధ్రప్రదేశ్ మండలాల పటమునకు Overpass query

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, మరియు రాష్ట్ర సరిహద్దులు

umap వాడి పటం

మార్చు
 
కోటప్పకొండ శిఖరాలు umap పటానికి స్థిర చిత్రం

umap link

OSM ఆధారిత పటాలు

మార్చు
  • OSM లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలు, మండలాల హద్దులు తాజాపరచబడ్డాయి. వాటి ఆధారంగా

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం 2021-12-25 నాడు సవరించబడింది. అంతకు ముందు, వివిధ వనరులు వాడడం వలన రాష్ట్ర సరిహద్దులలో కలిగిన అస్పష్టత తొలగించబడింది. 2022-04-24 న 26 జిల్లాలతో పటం తాజాచేయబడింది.

  • ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామ స్థాన పటములు
తెలుగు వికీపీడియా గ్రామ వ్యాసం నుండి ఓపెన్ స్ట్రీట్ మేప్ పై గ్రామ స్థానానికి చేరటం వీడియా (1ని. 12 సె.)

2024 లో {{Infobox India AP Village}} వాడుక ద్వారా, ఆంధ్రప్రదేశ్ లో అన్ని రెవెన్యూ గ్రామ పేజీలలో OSM ఆధారిత గ్రామ స్థానపటం ప్రదర్శించడమైనది.

మండలాల పటములు

మార్చు

2022-01-05: తొలికాలంలో వైజాసత్య, ఇతరులు చేర్చిన జిల్లా మండలాల రంగుల పటాలలో దోషమున్నందున, నకలుహక్కుల ఉల్లంఘన కూడా కావున, వాటిని తొలగించి OSM పటాలను జిల్లా పేజీలలో చేర్చాను. (దస్త్రంపై చర్చ:Prakasammandals.jpg) కొత్త పటం ఉదాహరణ:

ప్రకాశం జిల్లా మండలాల పటం (Overpass-turbo)


2022-01-05: తొలి కాలంలో Dev, Mpradeep ఎక్కించి వాడిన ప్రకాశం(దోషాలు), వైఎస్ఆర్, (దోషాలు) తూర్పు గోదావరి(పాతబడింది), పశ్చిమ గోదావరి(పాతబడింది) మండలాల గుర్తింపు పటాల వాడుక తొలగించబడినది.

పటముల గణాంకాలు

మార్చు

వికీప్రాజెక్టులలో పటాల వనరులు

మార్చు


ఇవీ చూడండి

మార్చు

బయటిలింకులు

మార్చు
  • Map improvements 2018 info (tourist attractions, archaelogical sites లాంటి కొన్ని OSM డేటా వికీపీడియా లో కనబడదు, దానిగురించిన వివరాలు "Only some types of objects are labeled. To make Wikimedia maps readable and uncluttered, our map styles are configured to show only a subset of the available data on OpenStreetMap, with a focus on features that are useful for what we’re calling “locator” maps: place names, streets, transit features, parks, and some geographic features, like lakes. Among the many things you won’t see labels for are restaurants, stores, houses of worship, archeological sites, tourist attractions…. If our map styles don’t show a category of object, like restaurants, then entering a restaurant name in OpenStreetMap in your language won’t change the map on your wiki—though it will enrich OSM's data generally.")

మూలాలు

మార్చు