వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/కాపీహక్కుల అవగాహన కార్యక్రమం
వికీపీడియా-కాపీహక్కులు అన్న అంశంపై నిపుణులతో కాపీహక్కుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిపుణులతో కాపీహక్కుల అవగాహన కార్యక్రమం నిర్వహించే ఆలోచన తెలుగు వికీపీడియా సముదాయంలో ఉంది. వికీపీడియా, వికీసోర్సు, కామన్స్ వంటి ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు వికీపీడియన్లు గతంలో ఎదుర్కొన్న సమస్యలు, భవిష్యత్తులో అవసరమైన అవగాహన వంటివాటి నేపథ్యంలో ఈ కార్యక్రమం రూపకల్పన చేశాము.
సమావేశం వివరాలు
మార్చు- వేదిక
థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ, సమయం
మార్చి 6, 2016 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ
నిర్వహణ
మార్చు- నిర్వాహకులు
- రీసోర్స్ పర్సన్
అనుభా సిన్హా
- నిర్వహణ సహకారం
పాల్గొనేవారు
మార్చుహైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి
మార్చుదూరప్రాంతాల నుంచి
మార్చునిర్వహణ సౌలభ్యం కోసం మీ పేరుతో పాటుగా మీరు ప్రయాణించదలచుకుంటున్న ప్రాంతం పేరు కూడా రాయండి
- కంపెనీల లోగో తదితర అంశాలపై అవగాహన కోరకు. విజయవాడ నుంచి ప్రయాణం. శ్రీకర్ కాశ్యప్ 15:57, 29 ఫిబ్రవరి 2016 (UTC)
- లైబ్రరీ మరియు పుస్తకాల కాపీహక్కుల గురించి. పుస్తకాల్లో బొమ్మల గురించిన వివరాల పునశ్చరణ,మార్గదర్శకాల స్పష్టత కొరకు పాలకొల్లు నుండి --Viswanadh (చర్చ) 16:53, 29 ఫిబ్రవరి 2016 (UTC)
- పుస్తకాల్లో సమచారం వ్యాసాల్లో ఎంత చేర్చవచ్చు, మరియు కాపీహక్కుల గురించిన అవగాహన కొరకు..--Vijayaviswanadh (చర్చ) 14:42, 1 మార్చి 2016 (UTC)
చర్చనీయాంశాలు
మార్చుకార్యక్రమం నుంచి మీరు ఆశిస్తున్న అంశాల కోసం చర్చ పేజీలో రాయగలరు.
నివేదిక
మార్చుఅనుభా సిన్హా కాపీహక్కుల గురించి, వాటి వికీపీడియా అనువర్తనాల గురించి మాట్లాడారు. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ తెలుగు వికీపీడియన్లకు ఫోటోలు, పుస్తకాలు, వ్యాసాలు, పత్రికల విషయాల్లో కాపీహక్కులు ప్రాథమికంగా ఎవరి వద్ద ఉంటాయో, అవి ఎలా ఇతరులకు సంక్రమిస్తాయో తెలిపారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఇతర దేశాల కాపీహక్కులను అమెరికా, భారత్ వంటి దేశాలు గౌరవిస్తాయన్నారు. ఉదాహరణకు భారతదేశంలో తొలిసారి ముద్రితమైన పుస్తకానికి భారతదేశపు కాపీహక్కుల చట్టాలనే అమెరికా వర్తింపజేయాలన్నది దీని ప్రకారం సాధారణ సూత్రమని, ఐతే డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ కాపీహక్కుల వివాదం వంటి ప్రత్యేక సందర్భాల్లో దీనికి భిన్నంగా అనిపించేలాంటి తీర్పు వచ్చిందని తెలిపారు. రచయిత, సంపాదకుడు పత్రికల విషయంలో ఎటువంటి కాపీహక్కులు కలిగివుంటారో తెలియజేశారు. కృపాల్ కశ్యప్, రాజశేఖర్, పవన్ సంతోష్, విశ్వనాథ్, భాస్కరనాయుడు వంటివారు వేసిన ప్రశ్నలు, పరిప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.
పాల్గొన్నవారు
మార్చు- డా. రాజశేఖర్
- భాస్కరనాయుడు
- విశ్వనాధ్.బి.కె.
- విజయ విశ్వనాధ్
- పవన్ సంతోష్
- ప్రణయ్ రాజ్
- కృపాల్ కశ్యప్
- నాగేశ్వరి గుమ్మళ్ల
చిత్రమాలిక
మార్చు-
కాపీహక్కుల గురించి వివరిస్తున్న అనుభా సిన్హా
-
హాజరైన వికీపీడియన్లు
-
భాస్కరనాయుడు గారికి కాపీహక్కుల గురించి చూపిస్తున్నరాజశేఖర్ గారు
-
కాపీహక్కులపై చర్చ
-
కృపాల్ కశ్యప్, పవన్ సంతోష్ ల వికీ రచన